Palak Paneer Telugu Recipe with step by step instructions.English Version.
పాలకూర తో చేయ గలిగిన అతి రుచి కరమైన రెస్టారెంట్ స్టైల్ వంటకం పాలక్ పనీర్ అని చెప్పవచ్ఛు.ఈ కూరను అతి తక్కువ సమయంలో చాలా తేలికగా తయారు చేయ వచ్చు.సమయానికి ఇంట్లో పనీర్ ఇంకా పాల కూర ఉంటే సరిగ్గా అరగంటలో దీనిని చేసేయ వచ్చు.అందుకే నేనెప్పుడూ నా ఫ్రిజ్ లో పనీర్ ఉండేలా చూసుకుంటాను.వారంలో ఒక సారైనా మేతి పనీర్ కానీ పాలక్ పనీర్ కానీ చేస్తుంటాను.
పాలక్ పనీర్ ను రుచిగా తయారు చేయడమే కాకుండా అందంగా ప్రెజెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది.అలా చేయాలంటే పాల కూర ను వండే ముందుగా బ్లాంచ్ చేస్తే వాటి రంగును కోల్పోకుండా ఉండడమే కాకుండా గాఢమైన పసరు వాసన పోయి చక్కని ఫ్లేవర్ వస్తుంది.బ్లాంచింగ్ ఎలా చేయాలో క్రింద ఇన్స్ట్రక్షన్స్ లో వివరించాను.పనీర్ మృదువుగా ఉండాలంటే పనీర్ ను క్యూబ్స్ గా కట్ చేసిన తర్వాత కాసేపు వేడి నీళ్లలో నానబెడితే మృదువుగా మారతాయి.అప్పుడు కూర లో వేస్తే కూరలోని ఫ్లేవర్స్ అన్నింటినీ పీల్చుకుని రుచిగా ఉంటాయి.అదే మీరు ఫ్రిజ్ లో నుండి తీసి నేరుగా కూరలో వేస్తే ముక్కలు గట్టిగా ఉండడం వల్ల కూర లోని ఫ్లేవర్స్ ని పీల్చుకోవు.
కూర వండడం అయిపోయాక నేతిలో దోరగా వేయించిన జీడి పప్పు ఇంకా తాజా క్రీమ్ కానీ మీగడ కానీ వేసి సెర్ప్ చేస్తే టేస్ట్ సూపర్ గా ఉంటుంది.ఈ కూర నాన్స్ , చపాతీ, పుల్కా లాంటి వాటితో తింటే బాగుంటుంది.ఈ రుచి కరమైన కూరను మీరు కూడా తయారు చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Hyderabadi Mutton Dalcha recipe in Telugu
Malai Paneer Tikka Recipe in Telugu
Chicken Dum Biryani Recipe in Telugu
Veg Manchurian Recipe in Telugu
Vegetable Sambar/Pappu charu Recipe in Telugu
Chamagadda Pulusu Recipe in Telugu
Methi Paneer Recipe in Telugu
Click here for the English Version of this Recipe.
- 200 గ్రాములు పాలకూర
- 200 గ్రాములు పనీర్
- 1/2 కప్పు టమాటో పేస్ట్
- 2 మీడియం ఉల్లిపాయలు
- 2 పచ్చి మిరపకాయలు
- 25 నుండి 30 గ్రాములు బటర్
- 1 1/2 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
- 1 tsp సోంపు
- 3 + 2 ఏలకులు
- 6 జీడి పప్పులు
- 3 లవంగాలు
- 2 దాల్చిన చెక్కలు అంగుళం పొడవు
- చిటికెడు పంచదార
- 1 tsp జీలకర్ర
- ఉప్పు తగినంత
- 1 tsp కారం
- 1/2 tsp పసుపు
- 1 tsp గరం మసాలా
- 1/4 కప్పు నీళ్లు
- 2 tbsp క్రీమ్
- ముందు పనీర్ ను క్యూబ్స్ గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- మరిగిన నీటిలో తగినంత ఉప్పు కలిపి పనీర్ ముక్కలను అందులో వేసి 5 నుండి 10 నిమిషాలు నానబెట్టాలి.
- పాలకూరను శుభ్రంగా కడిగిన తరువాత మరిగిన నీటిలో ఉప్పు వేసి 2 నుండి 3 నిమిషాలు నానబెట్టాలి.
- వేడి నీళ్లను వంపేసి వెంటనే బాగా చల్లని నీళ్లలో 2 నుండి 3 నిమిషాలు ఉంచాలి.
- తర్వాత నీళ్లను వంపేసి, పాలకూరను బ్లెండర్ జార్ లోకి తీసుకొని, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసి ప్యూరీ లా చేసుకోవాలి.
- ముందుగా సోంపు మరియు ఏలకులను కాస్త దోరగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఒక పెనంలో వెన్న వేసి కరగనివ్వాలి.
- అందులో జీడీ పప్పు వేసి దోరగా వేయించి ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
- జీలకర్ర, ఏలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
- బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి మెత్తబడే వరకు వేగనివ్వాలి.
- అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో పేస్ట్ వేసి కలిపి నూనె అంచులకు చేరే వరకు ఉడికించాలి.
- తర్వాత పాలకూర ప్యూరీ, పసుపు, కారం, గరం మసాలా, సోంపు మరియు ఏలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి.
- 1/4 కప్పు నీళ్లు పోసి 2 నుండి 3 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించి స్టవ్ కట్టేయాలి.
- వేయించిన జీడిపప్పు ఇంకా క్రీమ్ లతో గార్నిష్ చేసి వేడిగా వడ్డించాలి.
Leave a Reply