Creamy Tomato Soup Telugu Recipe with step by step instructions.English Version.
చిన్న పిల్లల నుండి పెద్ద వారి దాకా సూప్ అంటే ఇష్టపడని వారుండరు.సూప్స్ ని ఎక్కువగా వర్షాకాలంలో లేదా చలి కాలంలో తీసుకుంటే మంచిది.మా అమ్మాయికైతే సూప్స్ అంటే చాలా ఇష్టం.ఎక్కువగా ఇన్స్టంట్ సూప్ mix లనే ఉపయోగిస్తాను.కానీ సమయం దొరికితే మాత్రం ఇన్స్టంట్ మిక్స్ వాడకుండా మొత్తం నేనే తయారు చేస్తాను.దాదాపు అందరు హోటల్ కి వెళ్లినప్పుడు ముందుగా సూప్ ఆర్డర్ చేస్తారు.అది బాగా ఆకలి కలిగిస్తుందని తింటారు.వేరే వారి సంగతి ఏమో కానీ నేనైతే సూప్ తింటే మాత్రం ఇంకేమి తినలేను.స్టార్టర్ తినాలంటే ఎంతో కష్టపడి తినాల్సి వస్తుంది.
ఈ సూప్ లో క్రీమ్ ఉపయోగించడం వాళ్ళ టేస్ట్ చాలా రిచ్ గా ఉంటుంది.ఒక వేళా అంత హెవీ గా వద్దనుకుంటే క్రీమ్ వేయకుండా చేసుకోవచ్చు.నేను నాటు టమాటో లు వాడాను.కానీ ఈ సూప్ ని హైబ్రిడ్ టమాటో లతో చేస్తే బాగుంటుంది.ఎందుకంటే నాటు టొమాటోలు కాస్త పుల్లగా ఉంటాయి.ఆ పులుపు ను బ్యాలెన్స్ చేయడానికే మనం కొద్దిగా షుగర్ వేయాలి.
ఈ సూప్ ను ఎక్కువగా చేసుకొని 2 రోజుల వరకు వాడ వచ్చు.కాకపొతే ఫ్రిజ్ లో ఉంచాలి.కావలసినప్పుడు బయటకు తీసి కాస్త వేడి చేసుకొని తింటే బాగుంటుంది.బాగా వేడిగా కన్నా కొద్దీ వేడిగా ఉన్న సూప్ టేస్ట్ బాగుంటుంది.చేసిన వెంటనే కాకుండా 5 నుండి 6 గంటల తర్వాత మళ్ళీ వేడి చేసుకుని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అని నేను చాలా సార్లు గమనించాను.సూప్ స్పైసి గా ఉండా లనుకుంటే కాస్త మిరియాల పొడి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది.ఈ సూపర్ టేస్టీ టమాటో క్రీమ్ సూప్ ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Bread Pizza Telugu Recipe in Telugu
Palli Karam Dosa Recipe in Telugu
Sprouted Moong Dal Pesarattu Recipe in Telugu
Veg Manchurian Recipe in Telugu
Ulli Karam Dosa Recipe in Telugu
Chinese Egg Noodles Recipe in Telugu
Click here for the English version of the recipe.
- 350 గ్రాములు టమాటాలు
- 1 మీడియం ఉల్లిపాయ
- ¼ కప్పు క్రీమ్
- 1 tbsp కార్న్ ఫ్లోర్
- 4 స్లైసులు బ్రెడ్
- 50 గ్రాములు వెన్న
- 1 tbsp వెల్లుల్లి తరుగు
- 1 బిర్యానీ ఆకు
- ఉప్పు తగినంత
- మిరియాల పొడి రుచికి సరిపడా
- 300 ml నీళ్ళు
- టమాటో లను శుభ్రంగా కడిగి పైన క్రాస్ గా నాలుగు గాట్లు పెట్టాలి.(ఎక్కువ లోతుగా పెట్టకూడదు).
- మరుగుతున్న నీటిలో టమాటాలు, తోలు తీసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసి 2 నుండి 3 నిమిషాలు మరగనిచ్చి స్టవ్ కట్టేయాలి.
- టమాటా ఇంకా ఉల్లిపాయ లను వెంటనే చల్లని నీళ్ళలో వేయాలి.
- టమాటో మీద తొక్క తీసేసి ఉల్లిపాయ ఇంకా టమాటాలను తరిగి పక్కన పెట్టుకోవాలి.
- వాటిని మిక్సీలో వేసి చక్కగా పేస్ట్ లా అయ్యే వరకు గ్రైండ్ చేయాలి.
- బ్రెడ్ ను సన్నని స్లైసెస్ గా కట్ చేసి బటర్ లో కర కరలాడే వరకు రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఒక చిన్న గిన్నెలో కార్న్ ఫ్లోర్ వేసి అందులో 100 ml నీళ్ళు పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
- సాస్ పాన్ లో వెన్న కరిగించి అందులో బిర్యానీ ఆకు, వెల్లుల్లి తరుగు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
- ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ వేసి కలపాలి.
- 300 ml నీళ్ళు పోసి మూత పెట్టి 10 నుండి 15 నిమిషాలు మరగనివ్వాలి.
- మూత తెరిచి ఒక సారి కలిపి, కార్న్ స్టార్చ్ ఇంకా క్రీమ్ వేసి బాగా కలపాలి.
- తగినంత ఉప్పు, పంచదార, రుచి కి సరిపడా మిరియాల పొడి వేసి కలిపి 2 నుండి 3 నిమిషాలు సిమ్ లో ఉంచి ఆ తరవాత స్టవ్ కట్టేయాలి.
- సూప్ ని సూప్ బౌల్ లోకి తీసుకుని కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ చల్లాలి.
- 1 tbsp క్రీమ్ వేసి వేడి వేడిగా బ్రెడ్ తో సర్వ్ చేయాలి.
Creamy Tomato Soup Telugu Recipe Video
[embedyt] https://www.youtube.com/watch?v=Ca_lwDKB-9U[/embedyt]
Leave a Reply