Pineapple Fruit Punch Telugu recipe with step by step instructions.English Version.
పైన్ ఆపిల్ లేదా అనాస పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అన్ని సీజన్ లలో తేలిగ్గా దొరుకుతుంది.కొనడమైతే తేలిగ్గా కొంటాము కానీ దాని పైన ఉండే స్కిన్ రిమూవ్ చేయడానికే కాస్త ఇబ్బందిగా ఉంటుంది.అమ్మే వాళ్లే స్కిన్ కూడా తీసి ఇస్తున్నారు.కాకపోతే పైన్ ఆపిల్ ని తోలు తీసిన వెంటనే తినేయడం మంచిది.ఎందుకంటే ఆలస్యమైనా కొద్దీ అది ఫెర్మెంట్ అయిపోతుంది.అలా అయిపోయి త్వరగా పులిసిన వాసన వచ్చేస్తుంది.ఇక అప్పుడు తినడానికి పనికి రాదు.అందుకే అనాస పండును తాజాగా ఉన్నప్పుడే ఉపయోగించాలి.
అనాస లో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది.ఆ ఎంజైము మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ పండులో ఉన్న పోషక విలువలతో మన శరీరం ఎదుర్కునే ఎన్నో వ్యాధులను ప్రారంభ దశ లోనే రాకుండా అరికట్ట వచ్చు.దీనిలోని సిట్రస్ మనలోని రోగ నిరోధక శక్తిని పెంచి యవ్వనంగా ఉండేలా చేస్తుంది.అందువల్ల ఈ పండును మన రెగ్యులర్ డైట్ లో భాగంగా చేసుకుంటే మంచిది.పండు నేరుగా తినడానికి పులుపుగా అనిపిస్తే ఇలా జ్యూస్ చేసుకొని తాగేయవచ్చు.నేనైతే షుగర్ లేకుండానే జ్యూస్ చేస్తుంటాను.మనం జ్యూస్ లో పంచదార వేసుకుంటే పండు వల్ల మనకి కలిగే మేలు కన్నా షుగర్ వల్ల కలిగే చేటే ఎక్కువ.అందుకని షుగర్ లేకుండా అలవాటు చేసుకోవడం మంచిది.మనం ఎలా అయినా తీసుకుంటాము కానీ పిల్లల్ని పంచదార లేకుండా తాగమంటే తాగరు.అలాంటప్పుడు కాస్త తేనె వేసి చేసిస్తే సరిపోతుంది.లేదా ఖర్జూర సిరప్ వేసినా కూడా మంచిదే.రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.మీరు కూడా ఈ టేస్టీ అండ్ హెల్తీ పైన్ ఆపిల్ జ్యూస్ తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాను.
you may also like
Grape Soda/Juice Recipe in Telugu
Tomato Soup Recipe in Telugu
Pachi Pulusu Recipe in Telugu
White sauce Pasta Recipe in Telugu
Muntha Masala Recipe in Telugu
Andhra Hotel Style Senagapindi Poori Curry Recipe in Telugu
Click here for the English Version of the Recipe.
- 150 గ్రాములు పైన్ ఆపిల్ ముక్కలు
- అన్ని రకాల ఫ్రూట్ ముక్కలు మీకు అందుబాటులో ఉన్నవి
- 1 tbsp స్ట్రాబెర్రీ ఫ్రూట్ క్రష్ ఆప్షనల్
- 300 ml మంచి నీళ్లు
- 2 లేదా 4 tsp పంచదార ఆప్షనల్
- 6 లేదా 7 క్యూబ్స్ ఐస్
ముందు పైన్ ఆపిల్ పైన స్కిన్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి.
తర్వాత వాటిని జ్యూ సర్ లో వేసి నీళ్లు పోసి, కొద్దిగా పంచదార వేసి ముక్కలన్నీ జ్యూస్ లా మారే వరకు తిప్పుకోవాలి.
జ్యూస్ నుండి పిప్పిని వేరు చేసి పక్కన ఉంచుకోవాలి.
ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో 1 tbsp స్ట్రాబెర్రీ కానీ మరేదైనా ఫ్రూట్ క్రష్ కానీ వేసి గ్లాస్ కు అంటూంకునేలా చుట్టూ తిప్పాలి.
గ్లాస్ లో ముప్పావు భాగం ఐస్ క్యూబ్స్ వేసి అందులో పైన్ ఆపిల్ జ్యూస్ పోయాలి.
పైన కట్ చేసి పెట్టుకున్న అన్ని రకాల ఫ్రూట్ ముక్కలు వేసి చల్లగా సర్వ్ చేయాలి.
Pineapple Fruit Punch Telugu Recipe Video
[embedyt]https://youtu.be/6VJBWP75344[/embedyt]
Leave a Reply