Semiya Bonda Telugu Recipe with step by step instructions.English Version.
ఎప్పుడైనా సాయంత్రం ఆకలిగా అనిపిస్తే వేడి వేడి గా పునుగులు కానీ బజ్జీలు కానీ తినాలనిపిస్తుంది. కానీ అనుకున్న వెంటనే అన్నీ రెడీ గా ఉండాలి కదా. అలాంటప్పుడు ఇలా తేలికగా తయారు చేసుకో దగిన వంటకం ఈ సేమియా బోండాలు. రుచి చాలా బాగుంటాయి.
సేమియా ను ఒక ౩ నిమిషాలు ఉడికించి తర్వాత నీళ్ళు వడ కట్టేయాలి. కొద్దిగా ఆరిన తర్వాత మైదా పిండి, ఉల్లి తరుగు, అల్లం తరుగు, పచ్చి మిర్చి తరుగు ఇంకా మిగిలిన పదార్ధాలు వేసి కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అసలు పుల్లటి పెరుగు వాడితే ఆ 10 నిమిషాలు కూడా ఆగనవసరం లేదు. వెంటనే బోండాలు వేసేసుకోవచ్చు.
ఈ బోండాలకి సైడ్ డిప్ గా చట్నీ గానీ కారం కానీ అవసరం లేదు.ఉత్తిగా కూడా చాలా టేస్టీ గా ఉంటాయి. ఈ బోండాల పిండిలోనే కాస్త ఉడికించిన బంగాళాదుంపను కలిపి వడల్లా చేసుకోవచ్చు. ఎలా చేసినా నీళ్ళు మాత్రం ఎక్కువ కాకుండా చూసుకోవాలి. కొద్దిగా నూనె ఎక్కువయినా బాగా నూనె పీల్చేస్తాయి. సేమియా ను ఉడికించ కుండా ముందే ఎక్కువ సేపు నానబెట్టి పిండి కలుపుకోవచ్చు అనుకుంటున్నాను. ఈ సారి తయారు చేసినప్పుడు అలా ట్రై చేయాలనుకుంటున్నాను.ఒక వేళ నేను ట్రై చేస్తే ఎలా వచ్చాయో మీకు చెప్తాను. ఈ రెసిపీ ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Chicken Dosa Recipe
Beetroot Poori Telugu Recipe
Hotel Style Poori Curry Telugu Recipe
Saggubiyyam Punugulu Recipe
Chinese Egg Noodles Recipe
White Sauce Pasta Recipe
Click here for the English Version of this Recipe.
- ½ కప్పు లేదా 50 గ్రాములు సేమియా
- ¼ కప్పు లేదా 25 గ్రాములు మైదా పిండి
- ¼ కప్పు పెరుగు
- ఉప్పు తగినంత
- ¼ కప్పు ఉల్లిపాయ తరుగు
- 1 పచ్చి మిరపకాయ తరుగు
- 1 tsp జీలకర్ర
- ½ tsp మిరియాల పొడి
- 1 tsp అల్లం తరుగు
- ¼ కప్పు కొత్తిమీర
- 1 tbsp కొబ్బరి పొడి
- నూనె డీప్ ఫ్రై కి సరిపడా
- మరుగుతున్న నీళ్ళలో సేమియా వేసి ఒక ౩ నిమిషాల పాటు ఉడికించాలి.
- తర్వాత వెంటనే ఒక జల్లెడతో నీటిని వడ కట్టేసి సేమియా పక్కన పెట్టుకోవాలి.
- ఒక మిక్సింగ్ బౌల్ లో ఉడికించిన సేమియా, మైదా పిండి, ఉప్పు, బేకింగ్ సోడా, కొబ్బరి పొడి, జీలకర్ర, అల్లం తరుగు, పెరుగు, ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర, పచ్చి మిర్చి తరుగు వేసి బాగా కలపాలి.
- ఆ మిశ్రమాన్ని 10 నుండి 15 నిమిషాలు వదిలేయాలి.
- ఒక కడాయిలో నూనె పోసి వేడి చేయాలి.
- నూనె కాగ గానే మంటను మీడియం ఫ్లేమ్ కు తగ్గించాలి.
- చిన్న నిమ్మకాయంత పరిమాణంలో పిండిని తీసుకుంటూ నూనెలో వేయాలి.
- వేసిన వెంటనే కదప కుండా ఒక అర నిమిషం ఆగి తర్వాత కలుపుతూ చక్కని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పేపర్ నాప్కిన్ లోకి తీసుకోవాలి.
Leave a Reply