Fish Biryani Recipe with step by step instructions.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
హైదరాబాదీ ప్రాన్స్ బిర్యానీ తయారు చేయడం ఎలా ?
గోంగూర చికెన్ తయారు చేయడం ఎలా?
పెప్పర్ చికెన్ తయారు చేయడం ఎలా?
పుట్టగొడుగు బంగాళాదుంప కుర్మా తయారు చేయడం ఎలా?
మునక్కాడ టమాటో కూర
Click here for English version of this Recipe
- 1 ½ tsp షాజీరా
- 1 tsp సోంపు
- 4 రెమ్మలు బిర్యానీ పూలు
- 1 జాపత్రి
- ¼ ముక్క జాజికాయ
- 4 లవంగాలు
- 4 యాలుకలు
- 2 దాల్చినచెక్క అంగుళం ముక్కలు
- 3 మీడియం ఉల్లిపాయలు
- 1 tsp నూనె వేయించడానికి సరిపడా
- 500 గ్రాములు బోన్ లెస్ ఫిష్
- 300 గ్రాములు పెరుగు
- ఉప్పు తగినంత
- ½ tsp పసుపు
- 1 tbsp కారం
- 2 tsp బిర్యానీ మసాలా
- 2 వేయించిన ఉల్లిపాయలు
- ½ నిమ్మకాయ
- 1 tbsp అల్లం వెల్లుల్లి ముద్ద
- ¼ కప్పు పుదీనా
- 2 tbsp నెయ్యి
- 5 tbsp నూనె కాచినది
- 3 లీటర్ల నీళ్ళు
- 500 గ్రాములు బాసుమతి బియ్యం నానబెట్టినవి
- 1 tbsp గరం మసాలా దినుసులు
- 2 బిర్యానీ ఆకులు
- ఉప్పు తగినంత
- 2 tsp నూనె
- 1 జల్లెడ
- 1 వేయించిన ఉల్లిపాయ ముక్కలు
- ¼ కప్పు పుదీనా
- 2 tsp నెయ్యి
- 1 అల్యూమినియం ఫాయిల్
- 1 మందపాటి లోతైన గిన్నె
- 1 పెనం
- ఒక పెనం వేడి చేసి అందులో షాజీరా, సోంపు, బిర్యానీ పూలు, యాలుకలు, దాల్చినచెక్క, లవంగాలు, జాపత్రి వేసి ఒక నిమిషం పాటు వేపి స్టౌ కట్టేయాలి.
- వాటిని మిక్సీలో వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఉల్లిపాయల్ని చాలా సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి.
- ఒక చిన్న బాణలిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి వేడి చేయాలి.
- నూనె కాగాక, ఉల్లిపాయ ముక్కల్ని వేసి అవి ముదురు గోధుమ రంగులోకి మారేవరకు వేయించాలి.
- బాణలిలో నుండి బయటకు తీసే ముందు నునెని గట్టిగా నొక్కేసి ఉల్లిపాయలని పక్కన పెట్టుకోవాలి.
- చేప ముక్కల్ని బాగా కడిగి, ఒక అయిదు నిమషాల పాటు పసుపు, ఉప్పు వేసిన కలిపిన మజ్జిగలో నానబెట్టాలి.
- తర్వాత మజ్జిగలో నుండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- 500 గ్రాముల బియ్యాన్ని నీళ్ళలో 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
- వండబోయే ముందు 2 నుంచి 3 సార్లు కడగాలి.
- ఒక మిక్సింగ్ బౌల్ లోకి చేప ముక్కల్ని తీసుకోవాలి.
- అందులో ఉప్పు, పసుపు, కారం, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, 3 వంతులు వేయించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్, నిమ్మరసం, 4 నుండి 5 tbsp ల కాచిన నూనె, గిలకొట్టిన పెరుగు వేసి జాగ్రత్తగా కలపి 15 నుండి 20 నిమిషాల పాటు నానబెట్టాలి.
- ఒక గిన్నెలో 2.5 నుండి 3 లీటర్ల నీళ్ళు పోసి అందులో తగినంత ఉప్పు, కొద్దిగా నూనె, గరం మసాలా దినుసులు, పుదీనా వేసి మరిగించాలి.
- నీళ్ళు మరగడం మొదలవగానే నానబెట్టి కడిగిన బియ్యం వేయాలి.
- బియ్యం వేయగానే నీళ్ళు మరగడం ఆగిపోతాయి.
- అందుకే మళ్ళీ ఒక ఉడుకు వచ్చే వరకు ఉడకనివ్వాలి.
- అన్నం ఉడకడం మొదలైన దగ్గర నుండి సరిగ్గా 3 నిమిషాలు ఉడికించి పొయ్యి కట్టేయాలి.
- వెంటనే అన్నంలోని నీళ్ళని వార్చేసుకోవాలి.
- గిన్నెఅడుగున కొద్దిగా నూనె రాయాలి.
- నానబెట్టుకున్న చేప ముక్కల్ని వేసి సమానంగా పరవాలి.
- పైన సగం ఉడికిన అన్నం వేసి సమానంగా పరచాలి.
- మిగిలిన వేయించిన ఉల్లిపాయలు, పుదీనా ఆకులు, కొద్దిగా నెయ్యి వేసి, అల్యూమినియం ఫాయిల్ తో గిన్నెని మూసేసి, దాని పైన మూత పెట్టాలి.
- ఒక పెనాన్ని పొయ్యి వెలిగించి పెట్టుకోవాలి.దాని మీద బిర్యానీ పాత్రను కూడా పెట్టాలి.
- హై ఫ్లేమ్ మీద 15 నిమిషాల పాటు ఉడికించి తర్వాత సిమ్ లో ఉంచి 7 నుండి 10 నిమిషాల పాటు ఉడికించి పొయ్యి కట్టేయాలి.
- కట్టేసిన వెంటనే మూత తెరవకుండా ఒక 15 నుండి 30 నిమిషాలు వదిలేయాలి.
Fish biryani recipe Video
[embedyt] http://www.youtube.com/watch?v=RLBB0FOM4l4[/embedyt]
Leave a Reply