Mango Chicken Fry Recipe with step by Step Instructions.English Version.
వేరే రాష్ట్రాల గురించి అయితే నాకు తెలీదు గానీ, ఆంధ్రా మరియు తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలలో చికెన్, మటన్ ఇంకా రొయ్యల్ని తరచుగా గోంగూర, చింతచిగురు లేదా పుల్లటి పచ్చి మామిడికాయలతో కలిపి వండడం పరిపాటి.కాకపోతే ఇవన్నీ ఒకే కాలంలో అందుబాటులో ఉండవు.కాబట్టి ఆయా కాలాల్లో దొరికేవాటితో పుల్లని కూరలతో కలిపి మాంసాన్ని వండుతుంటారు.ఇళ్లలోనే కాకుండా వివిధ రెస్టారెంట్ లలో కూడా వీటిని వడ్డిస్తారు.
మాంసాన్ని ఇలా పుల్లని కూరగాయలతో కలిపి వండినప్పుడు సాధారణంగా గరం మసాలా వేయకపోయినా ఫర్వాలేదు.ఎక్కువగా మసాలాలు తినకూడని వారు ఇలా వండుకుని తింటే మంచిది.నేను ఈ కింద ఇచ్చిన పదార్థాల పట్టికలో మసాలా దినుసులు కూడా వ్రాసాను.మీరు కూడా కావాలంటే వేసుకోవచ్చు.నేను కూరలో కారానికి బదులు పచ్చిమిరపకాయలు వాడాను.కానీ మీరు వాటికి బదులు కారం వేసి తయారు చేసుకోవచ్చు.మామిడికాయ చికెన్ ఫ్రై తయారీ కొరకు పుల్లని పచ్చ్చి మామిడికాయలు తీసుకోవాలి.మామిడికాయ తోలు తీసేసి, సన్నగా తురుముకోవాలి.ఒకవేళ కాయ మరీ పులుపుగా ఉంటే ౩౦౦ గ్రాముల చికెన్ కు 75 గ్రాములు మామిడి తురుము, ఒక మాదిరి పులుపు ఉంటే 100 గ్రాముల మామిడి తురుము సరిపోతుంది.నోరూరించే ఈ కూరని మీరు కూడా తయారుచేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Karivapaku chicken curry Recipe
Andhra Chicken Fry Recipe
Naatukodi Pulusu Recipe in Telugu
Chicken Tikka Pulao Recipe in Telugu
Pepper Chicken Recipe in Telugu
Gongura Chicken Recipe in Telugu
Click here for the English version of the Recipe.
- 1 tbsp ధనియాలు
- 3 లవంగాలు
- 1 అంగుళం దాల్చిన చెక్క
- 3 యాలుకలు
- 1/2 tsp సోంపు
- 1 tsp గసగసాలు
- 5 జీడిపప్పులు
- 300 గ్రాములు చికెన్
- 100 గ్రాములు పచ్చ్చి మామిడి తురుము (పుల్లని మామిడికాయ తీసుకోవాలి)
- 1 మీడియం ఉల్లిపాయ
- 7 పచ్చిమిరపకాయలు
- ఉప్పు తగినంత
- ½ tsp పసుపు
- 1 tsp అల్లం వెల్లుల్లి ముద్ద
- 2 రెమ్మలు కరివేపాకు
- ¼ కప్పు కొత్తిమీర తరుగు
- 6 tbsp నూనె
- 1 tsp గరం మసాలా దినుసులు
ఒక చిన్న పెనంలో ధనియాలు, లవంగాలు, యాలుకలు, దాల్చినచెక్క, సోంపు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
- తర్వాత అందులోనే గసగసాలు, జీడిపప్పు కూడా వేసి ఒక 15 సెకెన్ల పాటు వేపాలి.
- కాస్త చల్లారనిచ్చి మిక్సీలో వేసి పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి.
- ఉల్లిపాయ మరియు పచ్చిమరపకాయలను ముక్కలుగా చేసి మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి.
- ఒక పాత్రలో నూనె వేడిచేసి అందులో గరం మసాలా దినుసులు(లవంగాలు, చెక్క, యాలుకలు) వేసి కొద్దిగా వేగాగానే, ఉల్లిపాయ&పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి.
- నూనె పేస్టు నుండి విడివడేవరకు వేయించి తరవాత పసుపు, తగినంత ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
- చికెన్ ముక్కలు వేసి బాగా కలిపి, మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి.మధ్యలో కూర అడుగంటకుండా కలుపుతుండాలి.
- 15 నిమిషాల తరవాత పచ్చి మామిడికాయ తురుము వేసి సరిగ్గా కలిపి సన్నని సెగ మీద 5 నుండి 7 నిమిషాల పాటు ఉడికించాలి.
- తరవాత ముందుగా తయారుచేసి పెట్టుకున్న మాసాలా పొడి వేసి ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించాలి.
- చివరిగా కొత్తిమీర తరుగు వేసి కూర దించేసుకోవాలి.
Mango Chicken Fry Recipe Video
[embedyt] https://www.youtube.com/watch?v=bm2xoFWWDCc[/embedyt]
Leave a Reply