Fish Fry recipe in Telugu with step by step instructions.English Version
అతి సులువుగా చేయగలిగిన చేప కూరలలో ఇది కూడా ఒకటి.సాధారణంగా చేపల ఫ్రై అనగానే నూనె లో డీప్ ఫ్రై చేస్తుంటారు.తినడానికి బాగానే ఉన్నా ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు.ఎందుకంటే నూనెలో అతిగా వేయించడం వల్ల చేపలో సహజంగా ఉండే పోషక విలువలు నశించిపోతాయి.వేయించడానికి ఉపయోగించిన నూనె కూడా అనవసరంగా వృధా అవుతుంది.డానికి బదులు ఎంచక్కా 3 లేదా 4 స్పూన్ ల నూనె తో పెనంలో ఫ్రై చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటాయి.
ఈ వేపుడు కొరకు మీరు ఏ చేపలనైనా వాడవచ్చు.నేను శీలావతి చేపలను ఉపయోగించాను.ఫిష్ ని మారినేట్ చేసేటప్పుడు గరం మసాలా కూడా వేయలేదు.అయినా కూడా చేప ముక్కలు చాలా రుచిగా ఉంటాయి.ఈ తరహా ఫిష్ ఫ్రై ను ఎక్కువగా వైన్ షాప్ ల ముందు తయారు చేస్తుంటారు.కానీ వాళ్ళు ఆరంజ్ ఫుడ్ కలర్ కలుపుతారు.అందుకే అద్దాల్లో నుండి ఎర్రగా కనపడుతుంటాయి.
ఈ చేప ముక్కలను అన్నం, పప్పుచారు కాంబినేషన్ తింటే చాలా బాగుంటుంది.లేదా ఉత్తిగా స్నాక్స్ లా తిన్నా కూడా బాగుంటాయి.నోరూరించే రుచికరమైన ఈ చేపల వేపుడు recipe ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Nellore Chepala Pulusu Recipe in Telugu
Hyderabadi Mutton Dalcha Recipe in Telugu
Andhra Chicken Fry recipe in Telugu
Naatukodi Pulusu Recipe in Telugu
Fish Biryani Recipe in Telugu
Click here for the English Version of this Recipe.
- 600 గ్రాములు చేప ముక్కలు
- 1 tbsp ఉప్పు
- 1 tsp పసుపు
- 2 tbsp కారం
- 2 tbsp ధనియాల పొడి
- 1 tsp మిరియాల పొడి
- 2 tbsp అల్లం వెల్లుల్లి ముద్ద
- 1 రెమ్మ కరివేపాకు
- 3 పచ్చిమిరపకాయలు
- 1/2 చెక్క నిమ్మకాయ
- 1/4 కప్పు కొత్తిమీర తరుగు
- 1/4 కప్పు ఉల్లికాడ తరుగు
- 5 లేదా 6 tbsp నూనె
- చేప ముక్కలను శుభ్రం చేసి కడగాలి.
- ఉప్పు, పసుపు కలిపిన మజ్జిగలో ఒక 5 నిమిషాల పాటు చేప ముక్కలను నానబెట్టాలి.ఇలా చేయడం వల్ల నీచు వాసన తొలగిపోతుంది.
- చేప ముక్కలలో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, నిమ్మరసం వేసి బాగా పట్టించి ఒక 15 నుండి 20 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి.
- తర్వాత ఒక పెనం లో నూనె వేడి చేసి అందులో చేప ముక్కలను జాగ్రత్తగా వేయాలి.
- ఒక్కొక్క వైపు 10 నుండి 12 నిమిషాల పాటు మధ్య మధ్యలో తిప్పుతూ వేయించాలి.
- అన్నీ వేయించడం అయిపోయాక స్టవ్ కట్టేసి కొత్తిమీర మరియు ఉల్లికాడల తరగు ముక్కలపై వేసి సర్వ్ చేయాలి.
Fish Fry recipe Video
[embedyt] https://www.youtube.com/watch?v=zZfzddFs1O4[/embedyt]
Lanka Naidu says
Nice keep it up my num 9505685311 for diubts i will ask u, ple sms your num
BINDU says
Thank you Naidu garu.you can ask me here in this comment section.I will always be happy to clear the doubts ASAP.
Veena says
I like your receipies… because u narrated in a simple way..so that everyone understands within minutes, without waste of time… good work
BINDU says
Thank you so much Veena garu….