Veg Manchurian Telugu Recipe with step by step instructions.English Version.
ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు వెజ్ స్టార్టర్ ఆర్డర్ చేయాల్సి వస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫస్ట్ ప్రిఫర్ చేసే స్టార్టర్ recipe వెజ్ మంచూరియన్.ఎంత తిన్నా నాన్ స్టాప్ గా అలా నోట్లోకి వెళ్లిపోతూనే ఉంటుంది.కారం కారంగా వేడిగా ఎంతో టేస్టీ గా ఉంటుంది.హోటల్ లో అయితే టక్కున ఆర్డర్ చేసేస్తాం అదే ఇంట్లో చేయాలంటే కాస్త పని ఎక్కువే.
పని ఎక్కువైనా పర్వాలేదు కానీ సరిగ్గా చేయడం రాకపోతే మొత్తం వేస్ట్ అయిపోతుంది.అంతా తేలికే కానీ వెజ్ బాల్స్ మిశ్రమం తయారు చేసే టప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.పొరబాటున కూడా నీళ్ళు కలపకూడదు.కూరగాయాలలో ఉండే తడి సరిపోతుంది.ఒక్కోసారి కలిపిన తర్వాత కూడా కూరగాయలలోనుండి నీళ్ళు ఊరి మిశ్రమం ఉండలు చుట్టడానికి వీలు లేకుండా అవుతుంది.అప్పుడు కాస్త మైదా కానీ కార్న్ ఫ్లోర్ కానీ వేసి మిశ్రమం గట్టిగా ఉండలు చేయడానికి వీలుగా అయ్యేలా కలుపుకోవాలి.ఉండలలో ఏమాత్రం తడి ఎక్కువగా ఉన్నా నూనె విపరీతంగా పీలుస్తాయి లేదా నూనెలో వేయగానే చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి నూనెంతా పాడయిపోతుంది.
అలా కాకుండా ముందుగానే కూరగాయ ముక్కలన్నింటినీ ఒక గిన్నెలో వేసి బాగా వేళ్ళతో పిసికేస్తే నీరు కొంతైనా బయటకు వస్తుంది.ఆ నీటిని గట్టిగా పిండేసి అప్పుడు కార్న్ ఫ్లోర్, మైదా అవన్నీ వేసి మిశ్రమం తయారు చేసుకోవచ్చు.మీకు ఈ recipe గ్రేవీ తో కావాలనుకుంటే కార్న్ స్టార్చ్ ఇంకాస్త ఎక్కువ తయారు చేసుకొని ఆ గ్రేవీ లో వెజ్ బాల్స్ ని కాసేపు ఉడికించి దించేసుకోవాలి.లేదా డ్రై గా కావాలంటే కింద నేను ఇచ్చిన మోతాదులో వేసుకుంటే సరిపోతుంది.ఈ నోరూరించే టేస్టీ వెజ్ మంచూరియా recipe ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Chinese Egg Noodles Recipe in Telugu
Chicken Shawarma Recipe in Telugu
Schezwan Fried Rice Recipe in Telugu
Bread Pizza Recipe in Telugu
Garlic Paneer Recipe in Telugu
Click here for the English Version of the Recipe.
- 250 గ్రాములు క్యాబేజీ బాగా సన్నగా తురిమినది
- 1 లేదా 20 గ్రాములు క్యారెట్
- 1/3 కప్పు లేదా 50 గ్రాములు పచ్చి బఠానీ కచ్చాపచ్చా గా రుబ్బినది
- ¼ కప్పు లేదా 30 గ్రాములు ఫ్రెంచ్ బీన్స్ సన్నగా తరిగినది
- ¼ కప్పు లేదా 30 గ్రాములు క్యాప్సికం సన్నగా తరిగినది
- 1 tbsp రెడ్ చిల్లీ పేస్ట్
- ఉప్పు తగినంత
- 3 లేదా 4 tbsp కార్న్ ఫ్లోర్
- 3 లేదా 4 tbsp మైదా పిండి
- చిటికెడు రెడ్ ఫుడ్ కలర్
- 1 tsp అల్లం తరుగు
- నూనె డీప్ ఫ్రై కి సరిపడా
- 1 tbsp అల్లం తరుగు
- 1 tbsp వెల్లుల్లి తరుగు
- కొద్దిగా ఉప్పు
- 2 లేదా 3 tsp నూనె
- 1 tbsp కార్న్ ఫ్లోర్/మొక్కజొన్న పిండి
- 1 tsp కారం
- 1 కప్పు లేదా 250 ml నీళ్ళు
- 1/3 కప్పు లేదా 30 గ్రాములు ఉల్లి కాడ మొదలు తరుగు
- 1 tbsp వెనిగర్
- 2 tbsp చిల్లీ సాస్
- 1 tbsp డార్క్ సోయా సాస్
- 1 tsp మిరియాల పొడి
- 2 tbsp ఉల్లి కాడ తరుగు
- ఒక మిక్సింగ్ బౌల్ లో సన్నగా తరిగిన అన్ని కూరగాయలు, ఉప్పు, రెడ్ చిల్లీ పేస్ట్, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్, అల్లం తరుగు వేసి బాగా కలపాలి.
- ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఒక కడాయిలో నూనె వేడి చేసి అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెజ్ బాల్స్ ను వేసి చక్కని నారింజ ఎరుపు రంగు వచ్చే వరకు వేయించి పేపర్ నాప్కిన్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
- 1 tbsp కార్న్ ఫ్లోర్ లో పావు లీటరు నీళ్లు పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
- ఒక పాన్ లో నూనె వేసి కాగాక అందులో అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, ఉల్లి కాడ మొదలు తరుగు, క్యాప్సికం తరుగు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
- తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, మిరియాల పొడి, వెనిగర్, డార్క్ సోయా సాస్ వేసి కలపాలి.
- కార్న్ స్టార్చ్ కూడా వేసి బుడగలు వచ్చే వరకు ఉడికించాలి.
- అందులో వేయించి పెట్టుకున్న వెజ్ బాల్స్ వేసి 3 నుండి 5 నిమిషాల పాటు లేదా మంచూరియన్ గ్రేవీ డ్రై అయ్యే వరకు వేయించాలి.
- ఉల్లి కాడల తరుగు పైన చల్లి స్టవ్ కట్టేసి వేడిగా సర్వ్ చేయాలి.
Veg Manchurian Telugu Recipe Video
[embedyt] https://www.youtube.com/watch?v=LeZOBpNQW9g[/embedyt]
siva sankar says
thanq madam for this use full fast food item
it is very much usefull for middle class families to save money and full fill the desire
BINDU says
you are most welcome Siva… 🙂