Saggubiyyam Payasam Telugu Recipe with step by step instructions.English Version.
సగ్గుబియ్యం పాయసం చాలా రుచికరమైన నోరూరించే వంటకం.పాయసం పెట్టి ఇస్తే వద్దని చెప్పేవారెవరైనా ఉంటారా చెప్పండి.అప్పటికే ఫుల్ గా అన్నం లాగించేసినా పాయసం చూడగానే మళ్ళీ కాస్త పొట్టలో ప్లేస్ చేసుకొని మరీ తింటాం.అందరి సంగతేమో కానీ నా హస్బెండ్ కి మాత్రం అసలు సగ్గుబియ్యం పాయసం ఇష్టం ఉండేది కాదు.సగ్గుబియ్యం అంటేనే vomiting వస్తుంది అనేవారు.ఎందుకంటే తను చిన్నప్పుడు హాస్టల్ ఉన్నప్పుడు వరుసగా 5 సంవత్సరాలు ఇదే తినీ తినీ విరక్తి వచ్చిందట.హాస్టల్ లో పాయసం మన ఇంట్లో లా ఎలా ఉంటుంది చెప్పండి.నీళ్ళల్లో సగ్గుబియ్యం వేసి కాచినట్లు ఉంటుంది.అందుకే తనకి అదంటే ఇష్టం పోయి ఉంటుంది.కానీ ఎలాగోలా బ్రతిమలాడి మళ్ళీ అలవాటు చేశాను.ఫస్ట్ టైం నేను చేసిన పాయసం తిని చాలా చాలా నచ్చిందని చెప్పారు.తనకి నేను చేసిన పాయసం తప్ప ఇంకెవరు చేసినా ఇష్టం ఉండదు :).
పాయసం ను మనం ఎన్నో రకాలుగా చేస్తుంటాం.అటుకులతో, బియ్యం తో, సేమియా, ఓట్స్, క్యారెట్, గోధుమ రవ్వ తో, సగ్గుబియ్యంతో చేస్తుంటాము.కొంతమంది బెల్లం తో చేస్తారు కొంతమంది పంచదారతో చేస్తారు.దేనితో చేసినా రుచి బాగుంటుంది.కానీ పంచదార కన్నా బెల్లం తో చేసిన పాయసమే ఆరోగ్యకరం.నేను మొదటి సారి బెల్లం తో పాయసం చేయడానికి ప్రయత్నించినప్పుడు నాకు తెలియక బెల్లం తురుము ను నేరుగా మరుగుతున్న పాలల్లో వేసేశాను.పాలు వెంటనే విరిగిపోయి చూడడానికి అసహ్యం గా మారిపోయింది.మొత్తం పారేసాను.తర్వాత మా పిన్ని చెప్పింది అలా jaggery ని డైరెక్ట్ గా పాలల్లో వేయకూడదు అని.బెల్లం పాకం(లేత పాకం) చేసి పక్కన పెట్టుకొని తర్వాత పాయసం కాచి స్టవ్ కాటేసిన 5 నిమిషాలకు అందులో వేసి కలపాలని.
కొంతమంది పాయసం ఏలకులు లాంటివి వేయరు.అలా వేయక పొతే పాలకు సహజంగా ఉండే నీచు(ఆ స్మెల్ ని ఎలా compare చేయాలో తెలీదు) వాసన పాయసం కాచినా తెలుస్తుంది.అందుకే కొద్దిగా ఏలకుల పొడి కానీ కొద్దిగా జాజికాయ పొడి(చిటికెడు) కానీ వేస్తే రుచి చాలా బాగుంటుంది.ఇంక నేనైతే జీడిపప్పు, బాదంపప్పు లను పొడి కొట్టి వేస్తాను.అలా చేస్తే రుచి ఇంకా బాగుంటుంది.ఒక వేళ మీరు స్వీట్ కండెన్స్ డ్ మిల్క్ వాడకపోతే ఆ తీపికి సరిపడా కొద్దిగా బెల్లం వేసుకోవాలి.ఈ పాయసాన్ని వేడిగా తిన్నా బాగుంటుంది లేదా ఒక 2 నుండి 3 గంటలు ఫ్రిజ్ లో ఉంచి సర్వ్ చేసినా బాగుంటుంది.ఈ సూపర్ టేస్టీ recipe ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్నివంటలు
Poornam Boorelu Recipe in Telugu
Nalla Senaga Guggillu Recipe in Telugu
Banana Balls Recipe in Telugu
Sorakaya Halwa Recipe in Telugu
Strawberry Rava Laddoo Recipe in Telugu
Parle_G Biscuit Cake Recipe in Telugu
Click here for the English Version of this recipe.
- 150 గ్రాములు సగ్గుబియ్యం
- 150 బెల్లం
- 600 ml పాలు
- ½ కప్పు లేదా 150 ml స్వీట్ కండెన్స్ డ్ మిల్క్
- 3 ఏలకులు
- 2 tbsp నెయ్యి
- 150 ml నీళ్ళు బెల్లం పాకం కొరకు
- 10 బాదంపప్పులు
- 10 జీడిపప్పులు
- 2 tbsp ఎండు ద్రాక్ష
- 4 పిస్తా పప్పులు
- 10 కొబ్బరి ముక్కలు సన్నగా తరిగినవి
- సగ్గుబియ్యాన్ని 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
- ఉడికించే ముందు ఒకసారి కడగాలి.
- సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, సగ్గుబియ్యం ఒక అంగుళం పైన వరకు నీళ్ళు పోయాలి.
- హై ఫ్లేం మీద పెట్టి ఒక మరుగు వచ్చే వరకు ఉడికించాలి.
- ఉడకడం మొదలవగానే ఫ్లేమ్ ను మీడియం లోకి తిప్పి సగ్గుబియ్యం బయటి పొర పారదర్శకంగా(transparent) అయ్యేవరకు కలుపుతూ ఉడికించాలి.కలపకపోతే సగ్గుబియ్యం అడుగంటే ప్రమాదం ఉంది.
- తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సగ్గుబియ్యం పక్కన పెట్టుకోవాలి.
- బెల్లం తురుము ను ఒక మందపాటి గిన్నెలోకి తీసుకొని అందులో నీళ్ళు పోయాలి.
- పెద్ద మంట మీద ఉంచి మరిగే వరకు ఉడికించాలి.
- ఒక సారి ఉడకడం మొదలవగానే తిప్పుతూ ఉండాలి.
- తీగ పాకం అవసరం లేదు.పాకాన్ని పట్టుకుంటే జిడ్డుగా నునెలా అనిపించే వరకు కాచి స్టవ్ కట్టేసి పాకాన్ని పక్కన పెట్టుకోవాలి.
- బాదంపప్పు, జీడిపప్పు మరియు ఏలకులను మిక్సీలో వేసి పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి.
- మందపాటి పాత్రలో పాలు పోసి మరిగే వరకు కాచాలి.
- పాలు మరగడం మొదలవగానే అందులో ఉడికించిన సగ్గుబియ్యం వేసి 3 నిమిషాల పాటు కాయాలి.
- తర్వాత స్వీట్ కన్దేన్స్ డ్ మిల్క్, పప్పుల పొడి వేసి కలిపి 3 నుండి 5 నిమిషాల పాటు సన్నని సెగ మీద కలుపుతూ కాయాలి.
- స్టవ్ కట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచాలి.తర్వాత పాయసం లో బెల్లం పాకం పోసి కలపాలి.
- ఒక చిన్న పెనంలో నెయ్యి వేసి అందులో జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదంపప్పు లను దోరగా వేయించి పాయసంలో వేసి వేడిగా గానీ లేదా రెండు నుండి మూడు గంటలు ఫ్రిజ్ లో ఉంచి చల్లగా సర్వ్ చేయవచ్చు.
Saggubiyyam Payasam Telugu Recipe Video
[embedyt] https://www.youtube.com/watch?v=859YP89-WN0[/embedyt]
Leave a Reply