Dondakaya Fry Telugu Recipe with step by step instructions.English Version.
ఈ తరహా దొండకాయ వేపుడు ని ఎక్కువగా ఆంధ్రా సైడ్ హోటళ్ళలో, పెళ్ళిళ్ళలో, ఫంక్షన్ లలో చేస్తుంటారు. కాకపొతే వారు దొండకాయ ముక్కల్ని నూనెలో డీప్ ఫ్రై చేసి పక్కనపెట్టి తర్వాత మళ్ళీ నూనెలో కారం పొడి, ఉప్పు, వేయించిన పల్లీలు, జీడిపప్పు వేసి కలుపుతారు.కానీ అలా చేస్తే దొండకాయ లో ఉన్న పోషక విలువలన్నీ నశిస్తాయి. రుచి బాగుంటుందేమో కానీ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.అందుకే నేను మాత్రం అలా డీప్ ఫ్రై చేయను.
దొండకాయలు మగ్గడానికి కనీసం 15 నుండి 20 నిమిషాలు పడుతుంది. ముక్కలు ముదురు ఆకుపచ్చ నుండి ఆలివ్ గ్రీన్ రంగులోకి మారే వరకు మగ్గ నివ్వాలి.తర్వాత క్రింద ఇచ్చిన వేపుడు మసాలా ను వేసి కాసేపు వేయిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.
మీకు ఇంకా రుచిగా ఉండాలంటే అదే వేపుడు మసాలా లో కొద్దిగా పుట్నాలు కూడా వేసి పొడి చేసి కలపొచ్చు. లేదా నేరుగా కాస్త శనగ పిండి ని కూడా కలప వచ్చు.కానీ శనగ పిండిని కాస్త వేయించాలి.లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ఇదే వేపుడు మసాలాలో చాలా మంది నువ్వులు కూడా వేపి పొడి అన్నిటితో కలిపి పొడి చేసి వేపుడు లో కలుపుతారు. అలా చేసినా కూడా రుచి చాలా బాగుంటుంది.
ఈ వేపుడును పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టి ఇస్తే వదిలేయకుండా ఇష్టంగా తింటారు.వేడి వేడి అన్నం లో దొండకాయ వేపుడు, చారు కలిపి తింటే చాలా బాగుంటుంది.నోరూరించే ఈ దొండకాయ ఫ్రై రెసిపీ ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Thota Kura Pesara Pappu Fry Recipe in Telugu
Boiled Eggs Fry Recipe in Telugu
Vegetable Sambar Recipe in Telugu
Chicken Liver Fry Recipe in Telugu
Tomato Pudina Chutney Recipe in Telugu
Chamagadda Pulusu Recipe in Telugu
Click Here for the English Version of this Recipe.
- 4 ఎండుమిరపకాయలు
- 1 రెమ్మ కరివేపాకు
- 3 రెబ్బలు వెల్లుల్లి
- 1 tsp జీలకర్ర
- ¼ కప్పు పల్లీలు
- 1/8 కప్పు కొబ్బరి పొడి
- 400 గ్రాములు దొండకాయలు
- ¼ కప్పు జీడిపప్పు
- 1 రెమ్మ కరివేపాకు
- 1 tsp జీలకర్ర
- ¼ tsp పసుపు
- 1 ఎండుమిరపకాయ
- 4 tbsp నూనె
- ఉప్పు తగినంత
- దొండకాయలను శుభ్రంగా కడిగి నిలువు చీలికలుగా కానీ గుండ్రంగా కానీ కట్ చేయాలి.
- పల్లీలను వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
- అదే పెనంలో ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర లను కరకరలాడే వరకు వేయించాలి.
- అలా వేయించిన వాటిని మిక్సీలో వేసి కచ్చాపచ్చా గా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
- అందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, ఎండు కొబ్బరి పొడి కూడా వేసి 2 నుండి 3 సెకెన్లు తిప్పి ఆ పొడిని పక్కన పెట్టుకోవాలి.
- ఒక బాణలిలో 4 tbsp నూనె వేసి కాగినాక అందులో జీడిపప్పు, కరివేపాకు వేసి దోరగా వేయించి వేరే ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
- ఎండుమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర వేసి చిటపటలాడే వరకు వేయించాలి.
- నిలువు చీలికలుగా కోసిన దొండకాయ ముక్కలు వేసి మూత పెట్టి ఆలివ్ గ్రీన్ రంగులోకి మారే వరకు వేయించాలి.మధ్య మధ్యలో కలుపుతుండాలి.
- తర్వాత మూత తెరచి పసుపు, ఉప్పు, ముందుగా తయారు చేసి పెట్టుకున్న జీడిపప్పు మరియు కరివేపాకు లను వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
Leave a Reply