Andhra Chicken Fry Recipe with step by step instructions. English Version
ఇది ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఆదివారంనాడు దాదాపు అందరూ వండుకునే సాధారణమైన వంటకం.చికెన్ వేపుడు ని వేడి అన్నం, మిరియాల చారులతో కలిపి తింటే చాలా బాగుంటుంది.లేదా చపాతీలు, పుల్కాలతో తిన్నా బాగానే ఉంటుంది.
ఇది వేపుడు కూర కనుక మీరు మళ్ళీ నీళ్ళు పోయవలసిన అవసరం లేదు.ఉడికేటపుడు నానబెట్టిన చికెన్ లో ఉన్న నీరు మొత్తం బయటకు వస్తుంది కాబట్టి చికెన్ ని ఉడికించడానికి ఆ తడి సరిపోతుంది.కారం మరియు మసాలాలు మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు.అందరూ ఎలా వండుతారో నాకైతే తెలిదు కానీ నేను మాత్రం కూర దించబోయే 5 నుండి 7 నిమిషాల ముందు మసాలాలు వేసేటపుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద కుడా వేస్తాను.అలా వేసి కొద్దిసేపు ఉడికిస్తే కూర చాలా రుచిగా ఉంటుంది.
తెలంగాణా ఇంకా కొన్ని ఆంధ్రా ప్రాంతాలలో అల్లం వెల్లుల్లి ముద్ద ఉల్లిపాయలు వేయించేటపుడు వేస్తారు కానీ విజయవాడ, గుంటూరు లాంటి కోస్తా ఆంధ్రా ప్రాంతాల్లో కూర ముప్పావు వంతు ఉడికాక వేస్తారు.అప్పుడు వేసినా కూడా పచ్చి వాసన రాదు.అంతే కాకుండా అది కూరకి సున్నితమైన ఘాటు రుచిని కలిగిస్తుంది.
మసాలాలు అన్నీ వేసాక, మంటని హై ఫ్లేమ్ లోకి తిప్పి కలుపుతూ వేయించాలి.ఎక్కవ మంట మీద పెట్టగానే కూర కొంచెం అడుగంటడం మొదలవుతుంది.ఒక 15 సెకన్ల పాటు అడుగంటనిచ్చి గరిటెతో అడుగున అతుక్కున్న కూరని గీకుతూ ఉండాలి.ఇలా చేయడం వల్ల తడి పూర్తిగా ఇగిరిపోయి చక్కటి రుచి వస్తుంది.జాగ్రత్త! అడుగంటనివ్వాలి కానీ మాడనివ్వకూడదు.
ఇగురుని వేరే గిన్నెలోకి మార్చికున్నాక, సగం చెక్క నిమ్మరసం పిండి ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పులని కూడా వేసి వడ్డిస్తే ఎంతో రుచిగా ఉంటుంది.ఈ రుచికరమైన వంటకాన్ని మీరు కూడా తయారు చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Naatu Kodi Pulusu recipe in Telugu
Chicken Tikka Pulao recipe in Telugu
Fish Biryani Recipe in Telugu
Chicken Liver Fry in Telugu
Hyderabadi Prawns Biryani recipe in Telugu
For the English version of this recipe Click here
- 500 గ్రాములు చికెన్
- 2 మీడియం ఉల్లిపాయల తరుగు
- 2 పచ్చిమిరపకాయలు
- 2 tsp అల్లం వెల్లుల్లి ముద్ద
- ½ tsp పసుపు
- 2 ½ tbsp కారం
- 2 tsp ధనియాల పొడి
- ఉప్పు తగినంత
- 50 గ్రాములు పెరుగు
- ¼ కప్ కొత్తిమీర తరుగు
- 5 tbsp నూనె
- ¼ కప్పు నూనెలో వేయించిన జీడిపప్పు
-
చికెన్ ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
-
ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలిపి ఒక 30 నిమిషాల నుండి గంట పాటు నానబెట్టాలి.
-
ఒక కడాయిలో నూనె వేసి వేడి చేయాలి.
-
తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమరపకాయలు వేసి మగ్గే వరకు వేయించాలి.
-
తగినంత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
-
తర్వాత నానబెట్టిన చికెన్ వేసి ఒకసారి కలిపాలి.
-
మూత పెట్టి మీడియం సెగ మీద 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి.మధ్య మధ్యలో కలుపుతుండాలి.
-
చికెన్ లో ఉన్న తడి మొత్తం ఆవిరైపోయేవరకు ఉడికించాలి.
-
ఎప్పుడైతే నూనె కూర నుండి విడిపోయినట్లుగా కనిపిస్తుందో అప్పుడు ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపి 5 నిమిషాల పాటు ఎక్కువ సెగ మీద కలుపుతూ వేయించాలి.
-
కొత్తిమీర తరుగు వేసి పొయ్యి కట్టేసుకోవాలి.
Andhra Chicken Fry Recipe video
[embedyt] https://www.youtube.com/watch?v=M2T-s-vsuaI[/embedyt]