మలయాళం సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా కాస్త సమయం దొరికితే వెతుక్కుని మరీ చూస్తుంటాను. పెద్ద పెద్ద భారీ సెట్ లు ఉండవు. ఫారెన్ లొకేషన్స్ లో పాటలు ఉండవు. మేకప్ లు ఉండవు. పంచ్ డైలాగులు ఉండవు. పెట్టి కొడితే గాల్లో పది గింగిరాలు తిరిగి నేల మీద పడి మళ్ళీ బంతిలా గాల్లోకి లేచి ఇంకో పది గింగిరాలు తిరిగే సీన్లు ఉండవు. మనలాంటి ఒక సాధారణ మనిషి జీవితాల నుండి తీసుకున్న…
సహనం, ఓర్పు, నిజాయితీలు నిజంగా గెలుస్తాయా?
నేను మొన్నీమధ్య ఒక సినిమా చూశాను. నేను ఈ పోస్ట్ లో చెప్పాలి అనుకున్నది చెప్పే ముందు ఒక సినిమా గురించి మాట్లాడం సముచితంగా ఉంటుంది అనిపించింది. ఆ సినిమాలో కత్తులు, తుపాకులు లేవు, అసభ్య ద్వంద్వార్థపు పదజాలం లేదు, గొడవలు లేవు, ఎత్తుగడలు, పన్నాగాలు లేవు, హింస లేదు, ద్వేషం లేదు, పగ లేదు, హారర్ లేదు అయినా ఆ సినిమా కథ మా గుండెల్ని పిండేసే విధంగా బాధించింది. చూస్తున్నంత సేపు ఏదో తెలీని…
పాత సినిమా హాలు, పార్వతమ్మ – నా జ్ఞాపకాలు
నా చిన్నప్పుడు మేము ఒరిస్సా లో ఉండే వారము. అక్కడ పాఠశాలల్లో మొదటి భాష ఒరియా ఉండేది. నాన్న ఉద్యోగ రీత్యా అటూ ఇటూ ఊర్లు తిరగాల్సి వస్తుండడంతో మా అమ్మా నాన్నలు నాకు తెలుగు భాష అబ్బడం లేదని నన్ను ఒక సంవత్సరం మా అమ్మమ్మగారి ఊరిలో ఉంచి చదివించారు. నేను అక్కడ 3వ తరగతి తెలుగు మీడియం లో చదువు కున్నాను. అక్కడ ఉన్నది సంవత్సరమే కానీ ఆ ఒక్క సంవత్సరం నాకు జీవిత…
స్వార్ధం మంచిదా? చెడ్డదా?ముందు మనం బాగుండాలి అనుకోవడం స్వార్ధమా?
అందరికీ నమస్కారము. నేను మొన్న ఒక వీడియో లో నేను కొత్తగా కొనుక్కుని చదువుతున్న పుస్తకాల గురించి చెప్పాను. అందులో అయాన్ రాండ్ రాసిన “The Fountain Head” అనే పుస్తకం చదువుతున్నాను అని చెప్పాను. అందులో రామ్ గోపాల్ వర్మ గారు రాసిన ముందు మాటలో రెండు పేరాలు చదివి వినిపించాను. అవి నాకు నచ్చాయి అని చెప్పాను. అందులో ఒక పేరా ” ప్రతి ఫిలాసఫీ ఇతరుల కోసం బతకాలి అని అరచి గీ…
ప్రకృతి మనకు ఏమి నేర్పిస్తుంది?
నిరంతరం ఎడతెగని పనులతో నిండిపోయింది జీవితం. సమయం, సందర్భం అనేవి లేవు. పగలు, రాత్రి లేదు. అంతులేని, ఆపలేని పనులతో, ఆలోచనలతో అలసిపోతున్న నా మనసుకు, శరీరానికి కాస్త విశ్రాంతి కావాలనిపించింది. మొన్న పొలానికి వెళ్ళినప్పుడు ఏది ఏమయినా ఓ మూడు రోజులు నాకు నచ్చినట్లుగా ఉండాలి అని నిర్ణయించుకున్నాను. కెమెరా ముట్టుకోలేదు, కంప్యూటర్ ని మర్చిపోయాను, ఫోన్ అలవాటు నాకు ఎటూ లేదు. అక్కడ TV కూడా లేదు. చెప్తే నమ్మరేమో కానీ, ఆ మూడు…
దేశాన్ని చుట్టి రావాలి అన్న నా కల నెరవేరుతుందా?
నిన్న సాయంత్రం మరియు ఇవాళ పొద్దున Hotstar లో ఒక డాక్యుమెంటరీ చూశాను. చూసినంత సేపు నా కళ్ళు చెమ్మతో నిండిపోయాయి, నాసిక ఎర్రగా మారిపోయింది, రోమాలు నిక్కబొడుచుకునే ఉన్నాయి. ఆ డాక్యుమెంటరీ ప్రోగ్రాం పేరు India From Above. అత్యాధునిక డ్రోన్ల సహాయంతో నింగి నుండి మన భారతదేశం లో ఎన్నో చారిత్రాత్మక మరియు స్థల ప్రాముఖ్యత గల ప్రాంతాలను అద్భుతంగా చూపించారు. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుండి బతుకు కోసం పోరాటం, స్టేటస్…