ఉదాహరణ 4 నేను పుట్టిన దగ్గర నుండి నాకు 3 సంవత్సరాలు వయసు వచ్చే వరకు మేము నాగార్జున సాగర్ హిల్ కాలనీ లో ఉండేవాళ్ళం.నాకు గుర్తున్నంత వరకు నేను మా అమ్మతో కన్నా ఎక్కువ మా పని మనిషి జయ లక్ష్మి తో లేదా పక్కింటి లక్ష్మి ఆంటీ వాళ్ళింట్లో ఎక్కువగా ఉండేదాన్ని.జయ లక్ష్మి కి నేనంటే బాగా ఇష్టం.విపరీతంగా గారాబం చేసేది.ముద్దొచ్చి నప్పుడల్లా నా బుగ్గలు కొరికేది.నేను నాకు వచ్చిన భాషలోనే ఏదో తిట్టేదాన్ని…
నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు Part-3/అప్పర్ సీలేరు విశేషాలు
ఉదాహరణ 3 పైన ఉదాహరణ లో మా నాన్నకు సీలేరు ట్రాన్స్ ఫర్ అయిందని చెప్పాను కదా.వేసవి సెలవులు రాగానే నాన్న వచ్చి నన్ను, అక్కని, అమ్మను సీలేరు తీసుకెళ్ళేవారు.అక్కడ అప్పర్ సీలేరు లో ఇచ్చారు నాన్నకి ఇల్లు.ఆ ఇల్లు ఊరి చివర కొండ పైన ఇన్స్పెక్షన్ బంగ్లా కి వెళ్లే దారిలో కొండ ఎక్కగానే ఎడమ వైపు ఉండేది.పెద్ద మండువా లోగిలి ఇల్లు.కాకపొతే మండువా లోగిలి ఇంటికి నాలుగు వైపులా గదులు ఉండి మధ్యలో ఖాళీగా…
నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు Part-2
ఉదాహరణ 2 నా చిన్నప్పుడు మేము మా నాన్న పనిచేసే ప్రైవేటు కంపెనీ కి చెందిన ఒక చిన్న, 10 ఇళ్ళు మాత్రమే ఉండే కాలనీ లో ఉండేవాళ్ళం.ఆ కాలనీ ఎంతో అందంగా, అద్భుతంగా ఉండేది.దాదాపు పది ఎకరాలలో కాలనీ ఉండేది.కానీ 3 ఎకరాలలో మాత్రమే ఇళ్ళు ఉండేవి.కాలనీ చుట్టూ fencing ఉండేది. తూర్పు వైపు ఫెన్సింగ్ ను ఆనుకుని వరుసగా పెద్ద పెద్ద నేరేడు చెట్లు ఉండేవి.ఉత్తరం వైపు రోడ్డు కి ఆనుకొని కాలనీ గేటు…
నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు Part-1
మన అందరి బాల్యం, యవ్వనం ఎన్నో తీపి జ్ఞాపకాలతో లేదా చేదు అనుభవాలతో నిండి ఉంటుంది.కానీ మనం అందులోని తీపి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ మిగతా జీవితాన్ని మెల్లిగా వెళ్ళదీస్తాము.ఆ జ్ఞాపకం ఒక ప్రదేశం, వ్యక్తి, సంఘటన ఇలా ఏదైనా కావొచ్చు.ఆ జ్ఞాపకాలతో కూడిన ప్రదేశాలను, వ్యక్తులను ఒక్కసారి మళ్లీ చూస్తే బాగుండుననిపిస్తుంది. నాకూ అలానే అనిపిస్తుంటుంది.నా జ్ఞాపకాలలో వ్యక్తుల కన్నా ఎక్కువగా ప్రదేశాలే ఉన్నాయి.ఏ కాస్త ఖాళీ సమయం చిక్కినా, నా మధుర జ్ఞాపకాలను చాపలుగా…
Beetroot Poori Telugu Recipe-బీట్ రూట్ పూరీ తయారీ
Beetroot Poori Telugu Recipe with step by step instructions.English Version. బీట్ రూట్ లో చాలా పోషక విలువలుంటాయి.కానీ తినాలంటేనే కొద్దిగా కష్టం అనిపిస్తుంది.అలవాటయితే పర్వాలేదు కానీ ప్రతీ దానికి వంకలు పెట్టేవారికి ఇది నోట్లోకి వెళ్లాలంటే కాస్త కష్టమే.ఇక పిల్లల సంగతి అయితే చెప్పనక్కర లేదు.పచ్చి కూరగాయ ముక్కలు తినేవారు ఏ కొద్ది మందో ఉంటారు.అలాంటి వారికి నేరుగా కాకుండా ఇలా ఏదో ఒక రుచికరమైన దాంట్లో కి తోసేసి వండి పెడితే…
Hotel Style Poori Curry Telugu Recipe
Hotel Style Poori Curry Telugu Recipe with step by step instructions.English Version. ఈ హోటల్ పూరి కర్రీ నే బొంబాయి చట్నీ అని కూడా అంటారు.ఈ కూరలో ఉల్లిపాయలు మరియు శనగపిండి ప్రధాన పదార్ధాలు.ఒక్కోసారి ఆటి రావడానికి కానీ లేదా ఎక్స్ట్రా రుచి కి గానీ ఉడకబెట్టిన బంగాళాదుంపలను కూడా ఉపయోగిస్తారు.కానీ ఈ కూర ఎక్కువ సేపు నిల్వ ఉండదు.వెంటనే రెండు మూడు గంటలలో వాడేయాలి.లేకపోతే కూర పాడయిపోయి వెంటనే వాసన వచ్చేస్తుంది….