అందరికీ నమస్కారం. నేను ఈ మధ్య నా యూట్యూబ్ ఛానల్ లో ఒక రోబో క్లీనర్ ని రివ్యూ చేశాను. ఆ వీడియో ను చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇదే కాదండీ! ఎలాంటి వస్తువు ను రివ్యూ చేసినా దాని గురించి ముందు నేను తెలుసుకుని వేరే వారికి అర్ధం అయ్యేలా చెప్పడానికి చాలా సమయం వెచ్చిస్తాను. దీనికి ముఖ్య కారణం నేను ఎప్పుడైనా ఏదైనా వస్తువు కానీ ఇంకేదైనా ఇంటికి సంబంధించిన పని…
Which Juicers are best?ఎలాంటి జ్యూసర్లు తీసుకుంటే మంచిది??
ఎలాంటి జ్యూసర్లు మంచివి? ఇది కూడా నన్ను చాలా మంది నన్ను ఎప్పటి నుండో అడుగుతున్న ప్రశ్నలలో ఒకటి. ఈ పోస్ట్ లో నాకు తెలిసినంత వరకు దాని గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. నిజం చెప్పాలి అంటే అసలు ఈ జ్యూస్లు అవీ తాగడం కన్నా నేరుగా పండ్లు, కూరగాయలు తీసుకోవడం ఎంతో ఉత్తమం. నేను కూడా అది తెలిసే చాలా సంవత్సరాలు ఎటువంటి జ్యూసర్లు వాడలేదు. నేను ఎప్పటి నుండో ఇంట్లో ఉపయోగిస్తున్న Morphy Richards…
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా విశ్లేషణ|| Umamaheswara Ugrarupasya Story Analysis
గమనిక :నేను కమర్షియల్ గా సినిమా లకు రివ్యూ రాసే వ్యక్తిని కాను. నేను ఒక సగటు ప్రేక్షకురాలిగా ఆ సినిమా గురించి ఏమి ఫీల్ అయ్యాను, దాని నుండి ఏమి నేర్చుకున్నాను అనేది రాశాను. అందువల్ల దీనిని సమీక్ష అనే కన్నా విశ్లేషణ(Analysis) అంటే బాగుంటుంది. ఈ సినిమా అనే కాదు నేను చూసిన మరికొన్ని పాత సినిమాలు వాటి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు అని కూడా ఇకముందు నాకు వీలయినప్పుడల్లా రాయాలి అనుకుంటున్నాను….
వ్యవసాయ భూమి ఎలా కొనాలి??
అందరికీ నమస్కారం. నేను యూట్యూబ్ లో నా వ్యవసాయ వీడియోస్ పెట్టడం మొదలు పెట్టిన దగ్గర నుండి ప్రతీరోజు ఎంతో మంది వీక్షకులు అడిగే ప్రశ్న. మీ దగ్గరలో ఏదైనా భూమి ఉంటే చూడండి. లేదా మీకు తెలిసిన ఏజెంట్ ఎవరైనా ఉంటే మాకు తెలపండి అని అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా విదేశాల్లో ఉండేవారు ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అంతమందికి నేను సహాయపడలేను కానీ ఈ ప్రయాణంలో మేము స్వయంగా తిరిగి తెలుసుకున్న విషయాలను మీకు అందిస్తాను….
మా వ్యవసాయ ప్రయాణం వెనుక కథ ఇదీ
చాలా మంది నన్ను ఎప్పటి నుండో అడుగుతున్న ప్రశ్న, ” మీకు అసలు పొలం కొనాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది??” అని. ఎలా కొనాలి అని చెప్పే ముందు అసలు మాకు ఫార్మ్ కొనాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది. ఆ ప్రక్రియ ఎలా మొదలైంది అనేది చెప్పాలి. లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది కాస్త ఓపికగా చదవగలరు. నా చిన్నప్పుడు తెలుగు పాఠంలో ఒక పద్యం ఉండేది “అవని విధీర్ణమైనను, హిమాద్రి యది చలించుట గల్గినన్,…
Useful Kitchen Tools Telugu ||కొన్ని ఉపయోగపడే కిచెన్ గాడ్జెట్స్
చూడడానికి చిన్న చిన్న వస్తువుల్లా ఉన్నా మన పనిని సులభం చేసే కొన్ని కిచెన్ పనిముట్లు లేదా టూల్స్ గురించి వివరిస్తూ మీకు వాటికి సంబంధించిన లింక్ లను ఇస్తాను. సిలికాన్ గ్రిప్స్ వంట చేసే టప్పుడు వేడి గా ఉన్న పాత్రల్ని పట్టుకోవడానికి మనం క్లాత్ ను ఉపయోగిస్తాము. వాటి మీద తరచుగా కూర మరకలు, నూనె మరకలు పడతాయి. ఒక్కోసారి దానినే కిచెన్ అరుగును తుడవడానికి కూడా వాడుతూ ఉంటాము. దీని వల్ల దాని…