Bamboo Chicken Biryani Telugu Recipe with step by step instructions.English Version.
ఎప్పుడూ ఒకే లాంటి వంటలేనా?అందుకే ఇసారి కాస్త డిఫరెంట్ గా ట్రై చేయాలని అనిపించింది.అందుకే నేను, సచిన్ బాగా ఆలోచించి బాంబూ లో recipes చేయాలని నిర్ణయించుకున్నాము.గ్రీన్ బాంబూస్ ఎక్కడ దొరుకుతాయా అని చాలా చోట్ల వెతికాము.కానీ దొరకలేదు.అప్పుడు విజయవాడ ఫోన్ చేసి మా బాబాయ్ ని అడిగాను.బాబాయ్ సరే పంపుతానన్నారు.చెప్పిన వారం లోపే RTC బస్ లో వేసి పంపారు.
కానీ దురదృష్టవశాత్తూ అంతకు ముందు రోజే నా కుడి చేతి చూపుడు వేలు గోరుతో సహా డీప్ కట్ అయింది.అసలే పనీ చేసే పరిస్థితిలో లేను.కానీ వెంటనే ఆ బాంబూస్ ని ఉపయోగించకపోతే వాటి లో పచ్చిదనం పోయి ఎండి పోతాయి.అప్పుడు ఇంక అందులో వండడం కుదరదు.ఎలాగా అని ఆలోచిస్తుంటే సచిన్ నువ్వు ఏమి వర్రీ అవ్వకు.మొత్తం నేనే చేస్తాను అని హామీ ఇచ్చాడు.చెప్పినట్టుగానే చక్కగా టేస్టీ గా వండాడు.సచిన్ వెరీ గుడ్ బాయ్.
సచిన్ ఆ రోజు ఆఫీస్ కి లీవ్ పెట్టేశాడు.మా పాప కూడా స్కూల్ కి సెలవు పెట్టేసింది.అదో బుడ్డి అసిస్టెంట్ కదా మరీ.అన్నీ రెడీ చేసుకొని మరుసటి రోజు ఉదయాన్నే 5 గంటలకల్లా బయలుదేరి మా పొలానికి బయలుదేరాము.వెళ్లేసరికి సరిగ్గా 6 అయింది.కాఫీ తాగుతూ కాసేపు అధ్బుతమైన సూర్యోదయాన్ని చూస్తూ అస్వాదించాము.తర్వాత ఇక చకచకా పని మొదలు పెట్టాము.bamboo తో మొత్తం 5 రకాల వంటలు తయారు చేశాము.అన్నీ సూపర్ డూపర్ హిట్.మధ్యాహ్నం 2.30 కంతా ఫినిష్ చేసేసాము.అప్పటికి బాగా అలసిపోయాము.కనీసం తినే ఓపిక కూడా లేదు.
అసలు ఇదంతా ఎందుకు తిప్పలు అదేదో ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అనుకుంటున్నారేమో.మామూలుగా ఇంట్లో పాత్రల్లో వండే దానికి ఈ బాంబూ లో వండిన డానికి రుచి చాలా తేడా ఉంటుంది.అది రుచిగా ఉంటే ఇది మరింత రుచిగా ఉంటుంది.ఒక్కసారైనా మీరు ట్రై చేయాల్సిన recipe ఇది.అంటే హోటల్ కి వెళ్తే తినొచ్చు కానీ మీరే వండుకుని తింటే ఆ మజాయే వేరు.
ఒక వేళ ఈ recipe ని మీరు గనుక ట్రై చేయాలనుకుంటే పచ్చి బొంగులనే వాడాలి.పచ్చి బొంగు లనే ఎందుకు వాడాలంటే అందులో ఉన్న తేమ కారణంగా తొందరగా కాలదు.మెల్లగా కాలుతూ వస్తుంది.ఈలోపు లోపలున్న పదార్థాలు చక్కగా ఉడుకుతాయి.ఎండిపోయిన బొంగులు యూస్ చేశారనుకోండి అవి వెంటనే కాలిపోయి లోపలున్న పదార్థం మాడిపోయి తినడానికి పనికి రాకుండా పోతాయి.
ఈ recipe కావాల్సిన పదార్ధాలు, చేయవలసిన విధానం అన్నీ క్లియర్ గా కింద ఉన్నాయి.ఒకవేళ మీరు కూడా ట్రై చేయదలచుకుంటే చేయవచ్చు.మీకు తెలిసిన వారెవరైనా విజయవాడ లో ఉంటే bamboos అక్కడి నుండి తెప్పించుకోండి.ఇవి కృష్ణ లంక దగ్గర కట్ట మీద దొరుకుతాయి.ఒకవేళ మీరు ఈ recipe ని ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Chicken Majestic Recipe in Telugu
Methi Chicken Recipe in Telugu.
Chicken Biryani Recipe in Pressure Cooker Telugu Recipe
Chicken Dum Biryani Recipe in Telugu
Ulavacharu Chicken Biryani Recipe in Telugu
Mamidikaya Chicken Fry Recipe in Telugu
Click here for the English Version of this Recipe.
Youtube లో మా తెలుగు వీడియో recipes కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- 300 గ్రాములు చికెన్
- 3 ఏలకులు
- 1 అంగుళం దాల్చినచెక్క
- 3 లవంగాలు
- 1/8 ముక్క జాజికాయ
- 1 అనాస పువ్వు
- 1 మరాఠీ మొగ్గ
- 1 జాపత్రి
- ఉప్పు తగినంత
- ½ tsp పసుపు
- 2 tsp కారం
- 1 tsp ధనియాల పొడి
- 1 tsp బిర్యానీ మసాలా
- 1 ½ tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
- ½ చెక్క నిమ్మ రసం
- ¼ కప్పు వేయించిన ఉల్లిపాయలు
- ½ కప్పు పెరుగు
- ¼ కప్పు పుదీనా
- ¼ కప్పు కొత్తిమీర
- 4 నుండి 5 tbsp నూనె
- 1 ½ కప్పు బాస్మతి బియ్యం( 1 కప్పు కొలత = 250 ml)
- 2 నుండి 3 tbsp నూనె
- 3 ఏలకులు
- 1 మరాఠీ మొగ్గ
- 1 అంగుళం దాల్చిన చెక్క
- 3 లవంగాలు
- ½ జాపత్రి
- 1 అనాస పువ్వు
- 1/8 ముక్క జాజికాయ
- ఉప్పు తగినంత
- ½ tsp కారం
- ½ tsp బిర్యానీ మసాలా
- ½ tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
- ½ పసుపు
- 1 మీడియం ఉల్లిపాయ ముక్కలు నిలువుగా కట్ చేసినవి
- 3 పచ్చి మిరపకాయలు
- ¼ కప్పు పుదీనా
- 1 tbsp నూనె
- 1 ¼ కప్పు నీళ్ళు
- కవర్ చేయడానికి అల్యూమినియం ఫాయిల్
- పచ్చి గా ఉన్న బొంగులు
-
శుభ్రంగా కడిగిన చికెన్ ను ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.
-
అందులో పైన చెప్పిన గరం మసాలా దినుసులు, తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం చెక్క నిమ్మ రసం, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, పెరుగు, పుదీనా, కొత్తిమీర, నూనె వేసి బాగా కలపాలి.
-
కలిపిన తర్వాత మూత పెట్టి ఒక గంట పాటు నానబెట్టాలి.
-
పచ్చి బాస్మతి బియ్యాన్ని కడగకుండా మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.
-
అందులో గరం మసాలా దినుసులు, తగినంత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, నూనె, పుదీనా ఆకులు, నిలువుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి.
-
తర్వాత ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
-
బొంగులను లోపల డస్ట్ అంతా పోయే వరకు శుభ్రంగా కడగాలి.
-
తర్వాత లోపల కొద్దిగా నూనె వేసి అంతా అంటుకునేలా తిప్పాలి.
-
2 గరిటెల చికెన్ వేసి తర్వాత 2 మారినేట్ చేసి పెట్టుకున్న బియ్యం వేయాలి.మళ్ళీ చికెన్ దాని పైన రైస్ వేయాలి.
-
1 ¼ కప్పుల నీళ్ళు పోయాలి. ఆ నీరు లోపల ఉన్న సందుల గుండా క్రిందకు జారుతుంది.
-
బొంగు పైన భాగాన్ని అల్యూమినియం ఫాయిల్ తో గానీ ఆకులతో గానీ కవర్ చేయాలి.
-
కట్టె పుల్లలతో మంట పెట్టి దాని మీద ఈ బొంగులను 30 నుండి 35 నిమిషాల పాటు ఉంచాలి.
-
మంట మీద నుండి తీసేసి ఒక 5 నుండి 10 నిమిషాలు వదిలేయాలి.
-
తర్వాత వేడి వేడిగా అరిటాకులో వడ్డించాలి.
Bamboo Chicken Biryani Telugu Recipe Video
[embedyt] https://www.youtube.com/watch?v=2p30VW6w_wg[/embedyt]
Leave a Reply