Amazing Tips for the Beautiful pink Lips.
నల్లని పొడిబారిన పెదవులు మెరిసే ముఖం అందాన్ని పాడుచేస్తాయి.పెదవులు నల్లగా మారడానికి అనేక కారణాలుంటాయి.
- అనేక రకాల కాస్మోటిక్స్ వాడకం వల్ల
- తరచుగా లిప్ స్టిక్ వాడడం వల్ల
- పిగ్మెంటేషన్ వల్ల
- కొన్ని రకాల మందుల వాడకం వల్ల
- స్మోకింగ్ వల్ల
- కెఫీన్ ఉత్పత్తులు అధికంగా వాడడం వల్ల
- డీ హైడ్రేషన్ వల్ల
కారణం ఏదైనా కానీ, కొద్దిపాటి ప్రయత్నంతో నల్లని పెదవులను మెరిసేలా మార్చుకోవచ్చు.దీనికోసం ముందుగా మీరు పాటించవలసిన నియమాలు:
- సాధ్యమైనంత వరకు కాస్మోటిక్స్ జోలికి పోకూడదు.
- అవసరమైనప్పుడు మాత్రమే లిప్ స్టిక్ మరియు లిప్ గ్లోస్ లాంటివి వాడాలి.
- తీవ్రమైన ఎండలో ఉండవలసి వచ్చినప్పుడు సూర్యకాంతి నేరుగా ముఖం మీద పడకుండా జాగ్రత్త వహించాలి.
- కొన్ని రకాల యాంటిబయాటిక్స్ వాడినప్పుడు కూడా పెదవులు నల్లబడే అవకాశం ఉంది.వాడడం ఆపిన కొన్ని రోజులకు మళ్ళీ మాములుగా అవుతాయి.
- స్మోకింగ్ అలవాటు ఉన్నవారు ఎంత ప్రయత్నించినా, ఎన్ని చిట్కాలు ప్రయోగించినా ఫలితం శూన్యం.కాబట్టి ఆ అలవాటును మానుకోవడం మంచిది.
- అదేపనిగా లెఖ్ఖలేనన్ని సార్లు కాఫీలు, టీ లు, కూల్ డ్రింక్ లు తాగడం వల్ల కూడా నల్లబడతాయి.కాబట్టి రోజులో మొత్తం 2 సార్లు మాత్రమే కాఫీ గానీ, టీ గానీ తీసుకోవాలి.ఇక కూల్ డ్రింక్ ల జోలికి వెళ్ళకపోవడమే మంచిది.
- అన్నింటికన్నా ముఖ్యమైనది నీళ్ళు.రోజుకి కనీసం 2 నుండి 3 లీటర్ల నీళ్ళయినా త్రాగాలి.
చిట్కా 1
- ఒక కట్ట తాజా కొత్తిమీరను శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.
- తర్వాత దానిని వడకట్టి పిప్పిని వేరు చేయాలి.
- వడకట్టగా వచ్చిన రసంలో కొద్దిగా గ్లిసరిన్, కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి, ఒక చిన్న డబ్బాలో పోసి ఫ్రిజ్ లో పెట్టుకోండి.
- రోజుకు రెండు సార్లు, ఉదయం స్నానానికి వెళ్లేముందు 15 నిమిషాలు మరియు రాత్రి పడుకునే 15 నిమిషాల ముందు రాసుకోవాలి.
- ఇలా 10 నుండి 15 రోజుల పాటు పాటించాలి.
చిట్కా 2
-
- ఒక కప్పు గులాబీ రెక్కలను 2 నిమిషాల వరకు నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా కడగాలి.
- తర్వాత వాటిని పేస్టులా చేసి అందులో 1 tsp పచ్చి పాలు, 1 tsp తేనె వేసి కలపాలి.
- ఈ మిశ్రమాన్ని పెదవులకు పట్టించి ఆరిపోయేవరకు ఉంచి గోరు వెచ్చని నీళ్ళతో కడిగేసుకోవాలి.
చిట్కా 3
- 1 tbsp పంచదారను 1 tsp తేనెతో కలిపి టూత్ బ్రష్ తో పెదవులపైన సున్నితంగా కొద్ది నిమిషాల పాటు మర్దన చెయ్యాలి.
- ఇలా చేయడం వల్ల పెదవులపై కల మృత చర్మ కణాలు తొలగిపోయి పెదవులు సున్నితంగా అవుతాయి.
- పాత చర్మం పోయి కొత్త చర్మం వస్తుంది కనుక పెదవులపై చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.అందుకే వెంటనే పెదవులకు నెయ్యి గానీ, కొద్దిగా ఆలివ్ ఆయిల్ గానీ పూసి మర్దనా చెయ్యాలి.
- ఇలా చేయడం వల్ల పెదవులు తేమను కోల్పోకుండా ఉండి చక్కగా అందంగా మెరుస్తూ ఉంటాయి.
చిట్కా 4
- ఇది అన్నింటికన్నా సులువైన చిట్కా.
- సిట్రస్ గుణం కలిగిన పండ్ల రసాన్ని పెదవుల మీద రుద్ది ఎండిపోయే వరకు ఉంచి కడిగేసుకోవాలి.
- వీటిలో అన్నింటికన్నా తేలిగ్గా దొరికేది నిమ్మకాయ.రసం తీసేసిన నిమ్మకాయ తొక్కని వేసి పెదవుల మీద రుద్దినా పర్వాలేదు.
చిట్కా 5
- పైన ఇచ్చిన టిప్స్ అన్నింటిని కనీసం 15 నుండి నెల రోజుల వరకు పాటించాలి.ఒక రెండు రోజులు పాటించి ఏ మార్పు కనపడలేదని మానేయకూడదు.
- ఒక వేళ వీటిలో ఏ చిట్కా పనిచేయలేదంటే మీరు మీ దగ్గరలో ఉన్న dermetologist ని సంప్రదించండి.
Watch the video below for the Beautiful Pink Lips
[embedyt] https://www.youtube.com/watch?v=b2-B1Hc8zJg[/embedyt]