Beetroot Pulao Telugu Recipe with step by step instructions.English Version.
బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.దీనితో సలాడ్స్, నిల్వ పచ్చడి, చట్నీ, పాయసం, హల్వా, పలావ్ లాంటి చాలా డిషెస్ తయారు చేసుకోవచ్చు.నేను బీట్ రూట్ తో ఎక్కువగా కొబ్బరి, పచ్చి బఠానీ కూడా వేసి వేపుడు చేస్తుంటాను.వారంలో ఒక రోజు కచ్చితంగా మా ఇంట్లో ఇది వండాల్సిందే.అప్పుడప్పుడు పలావు కూడా చేస్తుంటాను.
పిల్లల్ని పచ్చి బీట్ రూట్ ముక్కల్ని తినమంటే తినరు.అలాంటప్పుడు ఇలా పులావు చేసి లంచ్ బాక్స్ లో చేసి పెడితే కలర్ ఫుల్ గా ఇంకా రుచిగా కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు.దీని తీపి రుచి వలన చాలా మంది తినడానికి పెద్ద ఇష్ట పడరు.కానీ పులావ్ చేసాక అసలు కొంచెం కూడా తీపి రుచి తెలీదు.బీట్ రూట్ పులావ్ ఒట్టిగా కూడా బాగుంటుంది.లేదా రైతా తో సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.
నేను బాస్మతి బియ్యం ఉపయోగించి చేశాను.కానీ మాములు బియ్యం తో కూడా చేసుకోవచ్చు.అప్పుడు 1 కప్పు మామూలు బియ్యానికి 2 కప్పుల నీళ్ళు చొప్పున పోసి వండాలి.కొద్దిగా మార్చి ఇదే పలావ్ లో పుట్టగొడుగులు కానీ, పనీర్ కానీ, ఆలుగడ్డ లు లేదా క్యాలిఫ్లవర్ కానీ వేసి చేస్తే ఇంకా బాగుంటుంది.ఈ రుచికరమైన బీట్ రూట్ పులావ్ recipe ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Prawns Pulao Recipe in Telugu
Chicken Tikka Pulao Recipe in Telugu
Gobi Biryani Recipe in Telugu
Pressure Cooker Chicken Biryani Recipe in Telugu
Ulavacharu Chicken Biryani Recipe in Telugu
Chicken Biryani Recipe in Telugu
Schezwan Fried Rice Recipe in Telugu
Click here for the English Version of this Recipe.
- 350 గ్రాములు బాస్మతి బియ్యం
- 100 గ్రాములు బీట్ రూట్ తురుము
- 1 మీడియం ఉల్లిపాయ సన్నగా నిలువుగా తరిగినది
- 1/3 కప్పు పచ్చి బఠానీ
- 3 రెమ్మలు పుదీనా ఆకులు
- 1 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
- 1 బిర్యానీ ఆకు
- 1 అంగుళం దాల్చిన చెక్క
- 1 మరాఠీ మొగ్గ
- 1 పువ్వు జాపత్రి
- ¼ ముక్క అనాస పువ్వు
- 4 ఏలకులు
- 3 లవంగాలు
- ¼ tsp మిరియాలు
- ¼ tsp షాజీరా
- ¼ tsp సోంపు
- ¼ tsp పసుపు
- ¼ tsp కారం
- నీళ్ళు ప్రతి 1 బియ్యం కప్పుకి 1 ¼ కప్పు
- 1 tsp నెయ్యి
- 4 నుండి 5 tsp నూనె
-
350 గ్రాముల బియ్యాన్ని 30 నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టాలి.
-
తర్వాత 2 నుండి 3 సార్లు శుభ్రంగా బియ్యాన్ని కడగాలి.
-
ఒక గిన్నెలో 4 నుండి 5 tsp ల నూనె వేడి చేయాలి.
-
బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, మిరియాలు, షాజీరా, సోంపు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
-
ఉల్లిపాయలు ముక్కలు, పచ్చి మిర్చి, పచ్చి బఠానీ, తగినంత ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్త బడే వరకు వేయించాలి.
-
పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
-
బీట్ రూట్ తురుము వేసి 2 నిమిషాల పాటు వేయించాలి.
-
నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి బాగా కలపాలి.
-
ప్రతి ఒక బియ్యం కప్పుకు 1 ¼ కప్పు నీళ్ళు పోసి మరిగే వరకు ఉడికించాలి.
-
బుడగలు రావడం మొదలవ గానే స్టవ్ సిమ్ లోకి పెట్టి అన్నం పూర్తిగా ఉడికే వరకు వండాలి.
Beetroot Pulao Telugu Recipe Video
[embedyt] http://www.youtube.com/watch?v=QuZnt407C7o[/embedyt]