Bharath Ane Nenu Telugu Movie Review.
నటీ నటులు : మహేష్ బాబు, కైరా అద్వానీ, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, రావు రమేష్, రవి శంకర్, పోసాని కృష్ణ మురళి, ఆమని, జీవా, బెనర్జీ, బ్రహ్మాజీ, అజయ్ కుమార్, సితార, రజిత, పృథ్వీ రాజ్, దేవరాజ్, యష్ పాల్ శర్మ.
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: రవి చంద్రన్, తిరునావుక్కరసు
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్
పాటల రచయిత: రామజోగయ్య శాస్త్రి
ప్రొడ్యూసర్ : డివివి దానయ్య
దర్శకత్వం : శివ కొరటాల
కథ:
భరత్ రామ్(మహేష్ బాబు) తండ్రి రాఘవ (శరత్ కుమార్ ) ఎప్పుడూ రాజకీయాల్లో బిజీ గా ఉంటాడు. “ఒకసారి మాటిస్తే తప్పకూడదు” అని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది భరత్ తల్లి(ఆమని). అకస్మాత్తుగా తల్లి చనిపోతుంది. ఒక పక్క రాజకీయాలు చూసుకోలేక ఇంకో పక్క కొడుకుని చూసుకోలేక ఇబ్బంది పడుతుంటాడు భరత్ తండ్రి రాఘవ(శరత్ కుమార్). ఇంకో పెళ్లి చేసుకోమని సలహా ఇస్తాడు అతని స్నేహితుడు వరదరాజులు(ప్రకాష్ రాజ్). కొత్తగా వచ్చిన పిన్ని భరత్ ని తల్లిలా ఆదరించదు. రాఘవ భరత్ ని లండన్ పంపించి వేస్తాడు. భరత్ అక్కడే పెరిగి పెద్దవాడవుతాడు. జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ చాలా డిగ్రీలు సంపాదిస్తాడు. ఒక రోజు హఠాత్తుగా తండ్రి(అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం) చనిపోయాడని ఫోన్ రావడం తో బయలుదేరి ఇండియా వస్తాడు భరత్.
రాజకీయాలలో ఏమాత్రం అనుభవం లేని భరత్ ని తండ్రి రాఘవ ఆశయాల కోసం CM కమ్మని ఒత్తిడి తెస్తాడు వరదరాజులు. భరత్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తాడు. తెలుగు సరిగ్గా రాని భరత్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు “అంతఃకరణశుద్ధిగా ” అనే మాటను సరిగ్గా ఉఛ్చరించలేకపోతాడు. సరిగ్గా మాట్లాడడం కూడా రాని వాడు ఇంకా సీఎం గా బాధ్యతలు ఎలా నిర్వహిస్తాడని పేపర్ లో వస్తుంది. వారి అంచనాలను తప్పని నిరూపిస్తూ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ట్రాఫిక్ సమస్యని పరిగణనలోకి తీసుకుని ట్రాఫిక్ నియమాలను అతిక్రమించిన వారికి భారీ జరిమానాలు విధించే విధంగా ఆర్డర్ జారీ చేస్తాడు. ఇంకా వెంట వెంటనే చాలా సంస్కరణలు చేపడతాడు.
ఒక రోజు ఆఫీస్ కి వెళ్తుండగా దారిలో బస్ స్టాప్ లో స్నేహితురాళ్ళతో నించున్న వసుమతిని(కైరా అద్వానీ ) చూసి తొలిచూపు లోనే ఇష్టపడతాడు. ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. ఇదే అదనుగా తీసుకున్న శతృ వర్గం వారు వీరి పరిచయాన్ని గురించి వార్తా పత్రికల్లో చెడ్డగా రాస్తారు. తన వల్ల ఆ అమ్మయికి జరిగిన అవమానానికి తాను బాధ్యత తీసుకుంటూ తన పదవికి రాజీనామా చేస్తాడు.
తర్వాత ఒక జర్నలిస్ట్ ద్వారా తన తండ్రిది సహజ మరణం కాదని తెలుసుకుంటాడు. తన తండ్రికి అత్యంత విశ్వాసపాత్రుడు, ఆప్త మిత్రుడు అయిన వరదరాజులే తండ్రిని చంపాడని తెలుసుకుంటాడు. తెలుసుకున్నాక అతనిని ఎలా డీల్ చేస్తాడు. మళ్ళీ పరిస్థితులన్నీ ఎలా చక్కబెడతాడన్నది మిగిలిన కథ.
విశ్లేషణ: