Site icon Maatamanti

Biscuit Cake – బిస్కెట్లతో కేకు తయారు చేయడం ఎలా?

biscuit cake

Biscuit Cake recipe with step by step instructions.

సాధారణ కేక్ తయారు చేయడానికి పట్టే సమయం కన్నా చాలా తక్కువ సమయంలోనే ఈ బిస్కెట్ కేక్ సులువుగా తయారు చేసుకోవచ్చు.దీని తయారీ కోసం మీరు Parle-G, Marie, Oreo, Hide & Seek వంటి బిస్కెట్స్ ని వాడవచ్చు.నా Youtube subscribers లో ఒకరు ” ఈ కేక్ బిస్కెట్ లాంటి టేస్ట్ కలిగి ఉంటుందా ” అని అడిగారు.నిజం చెప్పాలంటే, మొదటి సారి దీన్ని తయారు చేసినపుడు నాకు అలానే అనిపించింది.కాని చిన్న చిన్న మార్పులతో మామూలు కేక్ రుచి లా ఉండేట్లుగా తయారు చేసాను.

ఏదైనా మీకు నచ్చిన ఒక ఎసెన్స్ ని వేస్తే ఆ బిస్కెట్ flavor పోతుంది.అలా కాకుండా నేరుగా ఆరెంజ్ కాని మరేదైనా కాని flavor ఉన్న బిస్కెట్స్ ని వాడితే సరిపోతుంది.అప్పుడు ఎసెన్స్ వేయకపోయినా పర్వాలేదు.నేను, కేక్ టిన్ లో సగం batter ని వేసాక ఫ్రూట్ క్రష్ ని ఒక లేయర్ గా వేశాను.తర్వాత పాలతో తడిపిన చాకో ఫిల్స్ ని ఒక లేయర్ గా పెట్టాను.ఆ తర్వాత మిగిలిన కేక్ batter ని కూడా వేసి పైన నట్స్ ఇంకా muesli కూడా వేశాను.

ఈ కేక్ ఆవిరి మీద ఉడికించవచ్చు లేదా ఓవెన్ లో బేక్ చేసుకోవచ్చు.నేను బేక్ చేసి తయారు చేసాను.ఒకవేళ మీరు దీన్ని ఆవిరి మీద ఉడికించాలనుకుంటే, మరుగుతున్న నీటిలో ఒక చిన్న స్టాండ్ లాంటిది ఉంచి దాని పైన కేక్ టిన్ ని ఉంచాలి.నీటి ఆవిరి కేకు లో పడకుండా అల్యూమినియం ఫాయిల్ తో  టిన్ ని కవర్ చేయాలి.తర్వాత, చిన్న రంధ్రం కలిగి ఉన్న మూతను పైన ఉంచి 20 నుండి 25 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించి స్టవ్ కట్టేయాలి.కేక్ చల్లారే వరకు ఆగి అప్పుడు గిన్నె నుండి వేరు చేయాలి.ఎంతో సులువైన ఈ recipe ని మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాను.

you may also like 

వెజిటబుల్ కట్లెట్ తయారు చేయడం ఎలా?

సగ్గుబియ్యం తో పునుగులు చేయడం ఎలా?

 English version కొరకు —  Click here

Biscuit Cake
Prep Time
15 mins
Cook Time
20 mins
Total Time
35 mins
 
Course: Dessert, Snack
Cuisine: Global
Author: Bindu
Ingredients
పౌడర్ కొరకు
  • 200 గ్రాములు Parle-G మరే బిస్కెట్స్ అయినా కాని
కేక్ బాటర్ కోసం
  • 250 ml పాలు కాచి చల్లార్చినవి
  • 1 tsp బేకింగ్ పౌడర్
  • 1/2 tsp బేకింగ్ సోడా
  • 1/4 tsp వెనిల్లా ఎసెన్స్
  • 2 tbsp నెయ్యి లేదా వెన్న లేదా నూనె
కేక్ అసెంబుల్ చేయుట కొరకు
  • 5-6 tbsp ఏదైనా ఫ్రూట్ క్రష్ లేదా జామ్
  • 1/2 కప్పు చాకో ఫిల్స్ మీకు నచ్చినవి
  • 5-6 tbsp పాలు చాకో ఫిల్స్ ని నానబెట్టుటకు
  • 1/8 కప్పు చిన్న చిన్న ముక్కలుగా తరిగిన నట్స్ కాజు,బాదాం,పిస్తా
  • 1/8 కప్పు ముసెలి
బేకింగ్ కొరకు
  • 1 కేక్ టిన్
  • 1 tbsp నెయ్యి టిన్ ని గ్రీజ్ చేయుట కొరకు
Instructions
పొడి చేయుట
  1. ముందుగా బిస్కెట్స్ ని చిన్న చిన్న ముక్కలుగా తుంపుకోవాలి

  2. తర్వాత వాటిని మిక్సిలో వేసి పొడి చేసుకోవాలి

కేక్ బాటర్ కొరకు
  1. ఒక మిక్సింగ్ బౌల్ లో బిస్కెట్ పొడి, పాలు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిల్లా ఎసెన్స్, నెయ్యి వేసి బాగా కలపాలి.

అసెంబ్లింగ్
  1. నెయ్యి పూసి ఉంచిన కేక్ టిన్ లో కలుపుకున్న పిండిలో సగం వేసి సమానంగా పరవాలి

  2. మీకు నచ్చిన ఏదైనా ఫ్రూట్ క్రష్ గాని జామ్ కాని ఒక లేయర్ లా వేయాలి.

  3. 1/2 కప్పు చాకో ఫిల్స్ లో కొద్దిగా పాలు పోస్తే మెత్తబడతాయి.

  4. వాటిని కూడా లేయర్ గా పెట్టుకోవాలి.

  5. తర్వాత మిగిలిన బాటర్ ని కూడా వేసి సమానంగా ఉండేట్లుగా పరచుకోవాలి.

  6. పైన చిన్నగా తురిమి పెట్టుకున్న నట్స్ ముక్కల్ని ఇంకా ముసెలి ని వేయాలి.

బేకింగ్
  1. ఓవెన్ ను 180 °C వద్ద ప్రీ హీట్ చేసుకోవాలి

  2. కేక్ టిన్ ను లోపల ఉంచి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి.

  3. టూత్ పిక్ తో కేక్ మధ్య భాగంలో గుచ్చి తీసినపుడు అది క్లీన్ గా బయటకు వస్తే కేక్ చక్కగా ఉడికినట్లు అర్ధం.లేకపోతే ఇంకాసేపు బేక్ చేసుకోవాలి.

 

Biscuit Cake Video

[embedyt] http://www.youtube.com/watch?v=IW0lGt2NwXU[/embedyt]             

Exit mobile version