బ్లాగ్ మరియు వెబ్ సైట్ అనే పదాలను నెట్ లో వాడడం మనం తరచూ చూస్తుంటాము.నెట్ లో తమ కంటెంట్ ను షేర్ చేయాలనుకునేవారు అసలు బ్లాగ్ స్టార్ట్ చేయాలా లేదా వెబ్ సైట్ స్టార్ట్ చేయాలా అని సందిగ్దానికి గురవుతూ ఉంటారు.అసలు బ్లాగ్ అన్నా వెబ్ సైట్ అన్నా ఒకటేనా లేదా వేరు వేరా అనే ఆలోచన మొదలవుతుంది.అలాంటి వారి కోసమే ఈ వ్యాసం.
BLOG అంటే ఏమిటి?
Blog అను పదం WEB LOG అనే పదం నుండి వచ్చింది.LOG అంటే ఒక విషయమునకు సంబంధించిన వివరాలను కాలక్రమానుసారంగా(chronological ఆర్డర్) ఒక దగ్గర పొందుపరచడం.ఇలా పొందుపరచడం వల్ల ఒక విషయాన్ని కానీ, పనిని కానీ, సంఘటనను కానీ review(పునఃసమీక్ష) చేసుకోవాలనుకున్నప్పుడు ఈ logs అనేవి ఉపయోగపడతాయి.ఉదాహరణకు ఒక కంపెనీలో జరిగే లావాదేవీలు(transactions), ఉద్యోగుల నియామకాలు తదితర వివరాలను ఎలా అయితే చిట్టాల రూపంలో పొందుపరుస్తారో వాటినే logs గా అనుకోవచ్చు.ఇంకో రకంగా ఉదహరించాలంటే ఒక నౌక నౌకాశ్రయాన్ని వదిలి వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చే వరకు జరిగిన అన్ని విషయాల్ని ప్రతిరోజూ ఒక క్రమపద్ధతిలో రికార్డు చేసుకుంటారు.ఆ రికార్డు లను కూడా logs అనవచ్చు.ఒక వెబ్ సైట్ లో ఏవైనా లోపాలు ఉన్నాయేమో అని తెలుసుకోవడానికి దానిని debug మోడ్ లో రన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఒక error log ఫైల్ ఏర్పడుతుంది.ఆ log ఫైల్ ద్వారా website లో ఏమేమి లోపాలున్నాయో తెలుసుకోవచ్చు.అలాగే access log ఫైల్ కూడా ఉంటుంది.దాని ద్వారా మన వెబ్ సైట్ లోని root డైరెక్టరీ నుండి ఏ ఏ files ని వివిధ ప్రాంతాలలోని వ్యక్తులు requset చేసి access చేసుకున్నారో మనకు తెలుస్తుంది.ఇప్పుడు మీకు logs అంటే కాస్త అవగాహన ఏర్పడి ఉంటుంది కదా?
ఒకప్పుడైతే కంప్యూటర్లు అవీ లేవు కాబట్టి పుస్తకాలలోనే రాస్తుండేవారు.ఎప్పుడైతే కంప్యూటర్లు వాడకంలోకి వచ్చాయో అప్పుడే ఈ logs ను వెబ్ లో పొందుపరచడం మొదలు పెట్టారు.వెబ్ లో పొందుపరచడం వల్ల ఆ logs ను web logs అనడం మొదలైంది.కాలక్రమేణా Web logs అనే పదం Blogs గా రూపాంతరం చెందింది.logs అనేవి వాటి పరిధి దాటి కేవలం రికార్డుల రూపంలోనే కాకుండా వ్యక్తిగత విషయాలను ఒక కాలక్రమానుసారం వెబ్ లో పోస్ట్ చేయడం పరిపాటి అయింది.మనం ఎలా అయితే రోజూ డైరీ రాస్తామో అచ్చు అలానే రోజువారీ సంఘటనల గురించి రాయడం ప్రారంభించారు.వీటినే personal బ్లాగ్స్ అంటుంటారు.personal blogs లో ఒక చిన్న గ్రూప్ తో కూడిన వ్యక్తులు కూడా రాస్తారు.food blog, private blog, sports blog, politics blog, fitness blog, review blog లాంటివి కొన్ని ఉదాహరణలు.
బ్లాగ్ మీరు రాసే వ్యాసాలను blog posts అంటారు.ఇవి date ప్రకారం లేదా category ప్రకారం లేదా tag ప్రకారం ఉంటాయి.మీరు అప్పుడే ఫ్రెష్ గా అప్లోడ్ చేసిన పోస్ట్ వరుసలో ముందుంటుంది.కిందకు వెళ్ళిన కొద్దీ పాత పోస్ట్స్ ఉంటాయి.దీనినే chronological listing of posts అంటారు.old posts ని Archives(ఆర్కైవ్స్) అంటారు.ఒక సాధారణ blog ఒక పేజీతో(single page) ఉంటుంది.కానీ ఈ మధ్య blogs ని కూడా website లా కొన్ని pages తో తయారు చేస్తున్నారు.ఉదాహరణకు ఒక food blog ఉందనుకోండి అందులో చాలా pages ఉండవచ్చు.కానీ ఆ pages అన్ని కూడా food కి సంబంధించినవే అయి ఉంటాయి.pages ఎన్ని ఉన్నా అవి ఒకే విషయానికి సంబంధించినవే అయి ఉంటాయన్నమాట.ఒక blog ను వెబ్ సైట్ లా ఎక్కువ pages తో డిజైన్ చేయవచ్చు.
Website అంటే ఏమిటి?
వెబ్ సైట్ అనేది కొన్ని page ల సముదాయం(group).ఆ page లన్నీ ఒకే విషయానికి సంబంధించినవి అయి ఉండవచ్చు లేదా వేరు వేరు టాపిక్స్ అయినా అయివుండచ్చు.ఆ pages అన్నింటిలో కావలిస్తే ఒక page ని Blog page గా ఉంచుకోవచ్చు.ఆ బ్లాగ్ page ని క్లిక్ చేస్తే అందులో మీరు ఆ వెబ్ సైట్ లో చేసిన అన్ని page లలోని పోస్ట్ లు వరుసగా కనిపిస్తాయి. ఒక సాధారణ వెబ్ సైట్ కి Home page లేదా Front page ఉంటుంది.ఆ Home లేదా front page అనేది మీ వెబ్ సైట్ కు Synopsis(సంక్షిప్త రూపము) లాంటిదన్న మాట.Blog ను ఒక person maintain చేయగలడు.కానీ website ని maintain చేయాలంటే కనీసం 2 లేదా 3 వ్యక్తులు ఉండాలి.ఒకరు back end డెవలప్ చేస్తే, ఒకరు front end design చేస్తారు.ఒక content మేనేజర్ ఉంటారు.అవసరాన్ని బట్టి ఒకరు లేదా కొంతమంది admins ఉంటారు.అంతేకాక వేరు వేరు pages కు కంటెంట్ ను అందించే కొంతమంది persons ఉంటారు.ఉదాహరణకు ఈ maatamanti.com అనేది ఒక వెబ్ సైట్ అన్నమాట.ఈ సైట్ కి ప్రస్తుతానికి admin ని, content manager ని, content writer ని అన్నీ నేనే :).
వెబ్ సైట్ లు కూడా చాలా రకాలు ఉంటాయి.personal website, ecommerce website, educational website, photography website, Job portal website, Entertainment website, communities website etc.ఏ website కు అయినా ఒక Domain Name ఉంటుంది.మీకు నచ్చిన పేరుతో డొమైన్ ని register చేసుకోవాలి.
చివరిగా చిన్న మాటలో చెప్పాలంటే blogs అన్ని websites కూడా అయి ఉండవచ్చు.కానీ ఒక website లో మాత్రం Blog అంతర్భాగంగానే ఉంటుంది.ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఎలా అయితే “ఆపిల్స్ అన్ని పండ్లే, కానీ అన్ని పండ్లు ఆపిల్స్ కావో ” అలా అన్నమాట.ఇప్పుడు మీకు blog అంటే ఏమిటో, website అంటే ఏమిటో ఒక అవగాహన వచ్చిందనుకుంటున్నాను.ఒకవేళ అర్ధం కాకపోయినా మీరు మీ సందేహాలను కింద కామెంట్ ల రూపంలో అడగవచ్చు.