Homemade Raw Bounty Chocolates with step by step instructions.తెలుగు వెర్షన్.
నాకు చాకోలేట్లంటే విపరీతమైన ఇష్టం.అందులో బౌంటి ఇంకా స్నిక్కర్ చాకొలేట్లంటే ఇంకా ఇష్టం.నా చాకొలేట్ ని ఫాస్ట్ గా తినేసి మా అమ్మాయి చాకొలేట్ ని కూడా దానితో గొడవపడి లాక్కొని తినేస్తాను.
అసలు చాకొలేట్స్ విషయంలో అమ్మ, అక్క లాంటి సెంటిమెంట్లు పెట్టుకోకూడదండి.బౌంటి చాకొలేట్ ని మొదటిసారి నా ఫ్రెండ్ ప్రశాంతి ఇచ్చింది.
ఈ చాకోలెట్స్ తయారీ చాలా సులువు.అతి తక్కువ పదార్ధాలతో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.దీనికి కావలసిందల్లా ఒక చాకో బార్, ఎండు కొబ్బరి పొడి, మరియు కండెన్స్ డ్ మిల్క్.నేను తీసుకున్నది స్వీట్ కండెన్స్ డ్ మిల్క్ కనుక విడిగా చక్కర కలపలేదు.ఒకవేళ మీరు చక్కర లేని కండెన్స్ డ్ మిల్క్ వాడితే సరిపడా పంచదార కలపవలసి ఉంటుంది.
నేను కాంపౌండ్ chocolate బార్ ని ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి తెప్పించాను.ఒకవేళ మీరు అప్పటికప్పుడు చేసుకోవాలంటే మామూలు డైరీ మిల్క్ లేదా bournville లాంటి చాకోలేట్స్ వాడవచ్చు.చాకో చిప్స్ కూడా ఉపయోగించవచ్చు.చాకొలేట్ ని కరిగించేటపుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.చాకొలేట్ ని తురమడానికి ఉపయోగించే ఛాపింగ్ బోర్డ్, కత్తి, కరిగించడానికి వాడే గిన్నె, గరిటె అన్నీ కొంచెం కూడా తడి లేకుండా చూసుకోవాలి.ఏమాత్రం తడి ఉన్నా చాకొలేట్ గట్టిగా అయిపోతుంది.మళ్ళీ కరిగించడానికి వీలు లేకుండా అవుతుంది.
ఒకవేళ మీరు చాకొలేట్ ని ఓవెన్ లో కనుక కరిగించాలనుకుంటే, దాన్ని ఓవెన్ సేఫ్ బౌల్ లో ఉంచి, ఓవెన్ ను మైక్రో వేవ్ మోడ్ లో 7 నుండి 10 సెకన్ల పాటు ఉంచాలి.మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.అలా పూర్తిగా కరిగేవరకు ఓవెన్ లో ఉంచాలి.కాస్త వైవిధ్యంగా చేయాలనుకుంటే బౌంటి మిశ్రమంలో పీనట్ బటర్, నట్స్, ఎండు ద్రక్షాల్లాంటివి కుడా వేయొచ్చు.వీటిని తయారు చేయడం చాలా సులువు కాబట్టి మీ పిల్లలని కూడా సరదాగా ఒక చెయ్యి వేయమని చెప్పండి.మీరు కుడా ఈ recipe ని తయారు చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Biscuit Cake Recipe in Telugu
Malai Laddu Recipe in Telugu
Ariselu Recipe in Telugu
Bobbatlu Recipe in Telugu
Dry Fruit Recipe in Telugu
Saggubiyyam Payasam Recipe in Telugu
Poornam Boorelu Recipe in Telugu
Sorakaya Halwa Recipe in Telugu
Banana Balls Recipe in Telugu
Flax Seeds/Avise laddu Recipe in Telugu
Homemade Bounty Chocolates Recipe in Telugu
Strawberry Rava Laddu Recipe in Telugu
Click here for the English version of this recipe.
- 200 గ్రాములు ఎండు కొబ్బరి పొడి
- 200 గ్రాములు స్వీట్ కండెన్స్ డ్ మిల్క్
- 1 tbsp పీనట్ బటర్
- 125 గ్రాములు కాంపౌండ్ చాకొలేట్ లేదా చాకో చిప్స్
-
ఒక గిన్నెలో ఎండు కొబ్బరి పొడి, కండెన్స్ డ్ మిల్క్ వేసి బాగా కలపాలి.
-
ఆ మిశ్రమాన్ని సమాన భాగాలుగా చేసి, బౌంటి బార్స్ ఆకారంలో చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
-
కొంత మిశ్రమాన్ని పక్కన ఉంచి అందులో పీనట్ బటర్ వేసి కలుపుకుంటే ఇంకో వెరైటీ తయారు అవుతుంది.
-
చాకో బార్ ను సన్నగా తురిమి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
-
ఆ గిన్నెను కాగుతున్న నీరు ఉన్న గిన్నె మీద ఉంచి మెల్లగా గరిటెతో తిప్పుతూ ఉండాలి.
-
చాకొలేట్ ఉన్న గిన్నె అడుగు భాగం కింద ఉన్న నీటికి తగలకుండా జాగ్రత్త పడాలి.
-
చాకొలేట్ ను కరిగించి పక్కన పెట్టుకోవాలి.
-
ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఎండుకొబ్బరి, కండెన్స్ డ్ మిల్క్ మిశ్రమాన్ని ఫోర్క్ సహాయంతో కరిగించిన చాకొలేట్ లో ముంచి ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టుకోవాలి.
-
ఇలా అన్నింటిని చేసిన తరువాత ఫ్రిజ్ లో 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచితే చాకొలేట్ లు గట్టిబడతాయి.
-
తరవాత కూడా ఫ్రిజ్ లోనే ఉంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినవచ్చు.
Bounty Chocolates Recipe Video
Leave a Reply