Bread Pizza recipe with step by step instructions.
ఈ కాలం పిల్లలకి మనం ఎన్ని రకాల రుచికరమైన వంటలు తయారు చేసి పెట్టినా బయట దొరికే జంక్ ఫుడ్ నే ఇష్టపడుతుంటారు.పిజ్జాలు, బర్గర్లు అంటే ఇష్టపడని వారుండరు.అయితే పిల్లలు అడిగారు కదా అని తరచూ కొనివ్వడం కూడా అంత మంచిది కాదు.మా అమ్మాయికి కూడా పిజ్జా, బర్గర్లంటే ఇష్టమే కానీ కావాలని తను ఎప్పుడూ అడగదు.మేమే ఎప్పుడైనా 6 నెలెలకోసారి బయటకెళ్ళినపుడు సరదాగా తినిపిస్తాము తప్ప అలవాటు మాత్రం చేయలేదు.
పిల్లలు ఎప్పుడు ఏమి కావాలని అడుగుతారో తెలీదు.ఒకవేళ అనుకోకుండా పిజ్జా కావాలని అడిగితే, మీరు ఈ విధంగా బ్రెడ్ తో పిజ్జా చేసి పెట్టవచ్చు.మనం ఒకవేళ పిజ్జా ఆర్డర్ చేసినా అది రావడానికి కొంత సమయం పడుతుంది.ఒక వేళ మనమే తయారు చేసుకోవాలన్నా పిండి కలిపి నానబెట్టడానికి కొంత సమయం పడుతుంది.ఇంకా అది కొంత శ్రమతో కూడుకున్న పని.పోనీ రెడీ టూ యూస్ పిజ్జా బేస్ కొని తయారు చేసుకోవాలన్నా అది మీ దగ్గర ప్రదేశంలో ఆ సమయానికి అందుబాటులో లేకపోవచ్చు.అదే బ్రెడ్ అనుకోండి ఎక్కడైనా సులువుగా దొరకుతుంది.కాకపొతే మీరు సూపర్ మార్కెట్ కి వెళ్ళినపుడు పిజ్జా టాపింగ్, పిజ్జా ఛీజ్ ముందుగానే తెచ్చుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటే, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెంటనే తయారు చేసుకోవచ్చు.
దీన్ని ఓవెన్ లోనే తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు.ఒక మందపాటి పెనానికి కొద్దిగా నూనె రాసి బ్రెడ్ ముక్కల్ని అందులో ఉంచి, పైన మూత పెట్టి సన్నని సెగ మీద ఛీజ్ కరిగే వరకు ఉడికించాలి.లేదా ఒకవేళ ఓవెన్ లో తయారు చేయాలుకుంటే 180 °C వద్ద 9 నిమిషాల పాటు లేదా ఛీజ్ కరిగే వరకు బేక్ చేసుకోవాలి.ఈ recipe ని మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
స్ట్రాబెర్రీ లతో రవ్వ లడ్డు చేయడం ఎలా?
బిస్కెట్ లతో కేక్ తయారు చేయడం ఎలా ?
వెజిటెబుల్ కట్లెట్ తయారు చేయడం ఎలా?
సగ్గుబియ్యం తో పునుగులు చేయడం ఎలా?
బంగాళాదుంప వేపుడు కూర
Click here for the English version of this Recipe
- 4 బ్రెడ్ స్లైసెస్
- 1 ఉల్లిపాయ
- ¼ కప్ కాప్సికం ముక్కలు
- 1 టమాటో గింజలు తిసేసినది
- ¼ కప్ స్వీట్ కార్న్
- 100 గ్రాములు మోజరేల్లా ఛీజ్
- ¼ కప్ ఆలివ్స్
- 2 tbsp పిజ్జా సాస్
- ½ tsp ఆరిగానో
- ½ tsp బేసిల్ లీవ్స్
- 2 tsp నూనె
-
క్యాప్సికం,టమాటో లను క్యూబ్స్ గా గానీ, నిలువు చీలికలుగా గానీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
-
టమాటో లోని గింజలను తీసిన తర్వాతే కట్ చేసుకోవాలి.
-
ఉల్లిపాయను కూడా మీకు నచ్చినట్లుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
-
మోజరేల్లా ఛీజ్ ని చక్కని స్లైసెస్ గా కోసి ఉంచుకోవాలి.
-
నాలుగు బ్రెడ్ ముక్కల్ని తీసుకొని, అన్నింటి మీదా పిజ్జా టాపింగ్ ని వేసి సమానంగా పరచుకునేటట్లు స్పూను వెనక భాగంతో రుద్దాలి.
-
తర్వాత అన్ని కూరగాయ ముక్కల్ని కూడా సమానంగా పరవాలి.
-
కట్ చేసి పెట్టుకున్న ఛీజ్ ముక్కల్ని పైన పెట్టుకోవాలి.
-
డ్రై ఆరిగానో, బేసిల్ లను కొద్దిగా స్ప్రింకిల్ చేయాలి.
-
పాన్ లో చేయాలనుకుంటే, పెనానికి కొద్దిగా నూనె రాసి, బ్రెడ్ స్లైస్ లని పెట్టి, పైన మూత పెట్టి సిమ్ లో ఉంచి ఛీజ్ కరిగే వరకు ఉడికించాలి.
-
ఓవెన్ లో అయితే, 180 °C వద్ద 9 నిమిషాలు లేదా ఛీజ్ కరిగేవరకు బేక్ చేయాలి.
Bread Pizza Recipe Video
[embedyt] http://www.youtube.com/watch?v=u8RJX8PsBPs[/embedyt]