Site icon Maatamanti

Cabbage Pakoda Telugu Recipe-క్యాబేజీ పకోడీ తయారీ

cabbage pakoda telugu recipe

Cabbage Pakoda Telugu Recipe with step by step instructions.English Version.

క్యాబేజీ పకోడా చాలా రుచిగా ఉంటాయి. ఆంధ్రా ప్రాంతంలో అయితే పెళ్ళిళ్ళలో ఇంకా అన్ని రకాల వేడుకలలో క్యాబేజీ పకోడీ తప్పకుండా ఉంటుంది. క్యాబేజీ పకోడీ లేకపోతే తోటకూర పకోడీ అయినా ఉంటుంది.దాదపు అన్ని ఆంధ్రా భోజన హోటల్స్ లో రోజూ ఈ రెండింటిలో ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది.

నేను మరీ తరచుగా కాకపోయినా అప్పుడప్పుడు దీనిని తయారు చేస్తుంటాను. కూర గాయాల్ని డీప్ ఫ్రై చేస్తే వాటిలోని పోషక విలువలన్నీ నశిస్తాయి. అందుకే క్యాబేజీని డీప్ ఫ్రై చేయడం నాకు ఇష్టం లేదు. ఎప్పుడైనా అకేషనల్ గా తింటే పర్వాలేదు కానీ రెగ్యులర్ గా మాత్రం ఇలాంటివి తినకూడదు.

ఇక ఈ రెసిపీ విషయానికొస్తే, క్యాబేజీ పకోడీలు కొద్దిగా నూనె ఎక్కువగా పీలుస్తాయి. అందుకే పకోడీ మిశ్రమం కలిపేటప్పుడు నీళ్ళు పోయకూడదు. క్యాబేజీ లో సహజంగా ఉండే తేమ సరిపోతుంది. అయినా సరే ఎంతో కొంత నూనె పీలుస్తాయి. కాబట్టి నూనె లో నుండి బయటకి తీసేటప్పుడు పేపర్ నాప్కిన్ లోకి తీసుకొని నూనె అవి నూనె మొత్తం పీల్చు కున్నాక అప్పుడు సర్వ్ చేస్తే బెటర్.

ఈ పకోడీలను ఉత్తిగా తిన్నా బాగుంటాయి. అన్నం తో కలిపి తినొచ్చు. రసం లేదా పప్పుచారు అన్నం కాంబినేషన్ తో తింటే ఇంకా సూపర్ గా ఉంటాయి. ఈ టేస్టీ క్యాబేజీ పకోడీ రెసిపీ ని మీరు కూడా ట్రే చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Mirapakaya Bajji Recipe in Telugu
Instant Rava Vada Recipe in Telugu
Maramarala Mixture Recipe in Telugu
Perugu Vada Recipe in Telugu
Chinese Egg Noodles Recipe in Telugu
Nalla Senaga Guggillu Recipe in Telugu

Click here for the English Version of the Recipe

4 from 1 vote
Cabbage Pakoda Telugu Recipe
Prep Time
20 mins
Cook Time
30 mins
Total Time
50 mins
 
Course: Side Dish, Snack
Cuisine: Indian
Author: బిందు
Ingredients
  • 300 గ్రాములు క్యాబేజీ తరుగు
  • 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి
  • ¼ కప్పు పుదీనా ఆకులు
  • 2 రెమ్మలు కరివేపాకు
  • ½ అంగుళం అల్లం తరుగు
  • ఉప్పు తగినంత
  • 1 tsp వాము
  • 1 కప్పు శనగ పిండి
  • చిటికెడు ఎర్ర రంగు (ఆప్షనల్)
  • నూనె డీప్ ఫ్రై కి సరిపడా
Instructions
  1. ఒక మిక్సింగ్ బౌల్ లో క్యాబేజీ తరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తరుగు, పుదీనా, కరివేపాకు, వాము, శనగ పిండి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
  2. అవసరమైతే తప్ప కలపడానికి నీళ్ళు వాడ కూడదు. క్యాబేజీ లో ఉన్న తేమే సరిపోతుంది.
  3. ఒక కడాయి లో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేడి చేయాలి.
  4. నూనె కాగినాక, చిన్న నిమ్మకాయంత పరిమాణంలో క్యాబేజీ పిండి మిశ్రమాన్ని తీసుకుంటూ జాగ్రత్తగా నూనె లోకి జారవిడవాలి.
  5. క్యాబేజీ పకోడీలు చక్కని బంగారు రంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించి పేపర్ నాప్కిన్ లోకి తీసుకొని వేడిగా సర్వ్ చేయాలి.

Cabbage Pakoda Telugu Recipe Video

Exit mobile version