అందరికీ నమస్కారం. నేను యూట్యూబ్ లో నా వ్యవసాయ వీడియోస్ పెట్టడం మొదలు పెట్టిన దగ్గర నుండి ప్రతీరోజు ఎంతో మంది వీక్షకులు అడిగే ప్రశ్న. మీ దగ్గరలో ఏదైనా భూమి ఉంటే చూడండి. లేదా మీకు తెలిసిన ఏజెంట్ ఎవరైనా ఉంటే మాకు తెలపండి అని అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా విదేశాల్లో ఉండేవారు ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అంతమందికి నేను సహాయపడలేను కానీ ఈ ప్రయాణంలో మేము స్వయంగా తిరిగి తెలుసుకున్న విషయాలను మీకు అందిస్తాను….
Farming
మా వ్యవసాయ ప్రయాణం వెనుక కథ ఇదీ
చాలా మంది నన్ను ఎప్పటి నుండో అడుగుతున్న ప్రశ్న, ” మీకు అసలు పొలం కొనాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది??” అని. ఎలా కొనాలి అని చెప్పే ముందు అసలు మాకు ఫార్మ్ కొనాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది. ఆ ప్రక్రియ ఎలా మొదలైంది అనేది చెప్పాలి. లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది కాస్త ఓపికగా చదవగలరు. నా చిన్నప్పుడు తెలుగు పాఠంలో ఒక పద్యం ఉండేది “అవని విధీర్ణమైనను, హిమాద్రి యది చలించుట గల్గినన్,…