కీటో డైట్ ఛార్ట్ ఇవ్వమని నా యూట్యూబ్ స్నేహితులు చాలా మంది అడుగుతున్నారు. ఇప్పటికే చాలా మందికి ఈమెయిల్ చేశాను. కానీ పోను పోను అడిగే వారి సంఖ్య ఎక్కువ అవ్వడం వల్ల అందరికి పర్సనల్ గా మెయిల్ పెట్టలేకపోతున్నాను. అందుకే……. గా సిలబస్ ఏదో గీడ ఖతం చేస్తే అయిపోతది కదా అనుకుంటున్నా 😉😜. పక్కన వాక్యం అస్సలు అర్ధం కాలేదా ఎక్కువ ఆలోచించకండి.. రాసేటప్పుడు మధ్యలో బోర్ అనిపిస్తే అలా అర్ధం పర్ధం లేకుండా…
Weight Management
కీటో డైట్ ను ఎలా ప్రారంభించాలి?How to start Keto Diet?
కీటో డైట్ ను ప్రారంభించటానికి ఒక పధ్ధతి ఉంది. ఉన్న పళంగా కార్బోహైడ్రేట్స్ ని పూర్తిగా కట్ చేసి మొత్తం కొవ్వు/ఫ్యాట్ ఇంకా ప్రోటీన్ ఇస్తే మన శరీరం ఈ ఆకస్మిక మార్పును అలవాటు చేసుకునే ప్రక్రియలో మనల్ని కొంత ఇబ్బందికి గురి చేస్తుంది. అందుకే ఇవాళ అనుకుంటే రేపు అకస్మాత్తుగా కీటో డైట్ ను మొదలు పెట్టకూడదు. కీటో డైట్ లోకి మారడానికి ఒక వారం సమయం తీసుకోండి. ముందుగా ఒక ప్రణాళిక ను సిద్ధం…
About Ketogenic Diet in Telugu- కీటోజెనిక్ డైట్ అంటే ఏమిటి?
ఈ మధ్య బాగా ప్రాచుర్యం లోకి వచ్చిన డైట్ ఈ కేటోజెనిక్ డైట్? విదేశాల్లో ఎప్పటి నుండి ఇది ప్రాచుర్యంలో ఉంది. కానీ మన దేశంలో లేదా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యనే బాగా ప్రాచుర్యం పొందినది. ఈ క్రెడిట్ మొత్తం వీర మాచినేని రామకృష్ణ గారికే దక్కుతుంది. అసలు ఆయనంటూ ఒక విప్లవం లాగా దీన్ని ప్రచారం చేయక పోతే ఇంత మందికి అసలు దీని గురించి తెలుసుకునే అవకాశమే ఉండేది కాదు. సరే…
Weight loss Plan Telugu-బరువు తగ్గించుకునేందుకు ప్రణాళిక
బరువు తగ్గాలి అని నిర్ణయించుకున్నాక మీరు తప్పక ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.ఆ ప్రణాళిక ను తప్పకుండా పాటించి తీరాలి. మీరు ఎపుడైనా వినే ఉంటారు. కొద్దిగా బొద్దుగా ఉండే సినిమా తారలు సడన్ గా నాజూక్కా మారిపోతారు. అది నిజంగా వాళ్ళ పట్టుదల కి నిదర్శనం. వాళ్లకు ప్రణాళిక చేసుకునే సమయం ఉండదు కాబట్టి వాళ్ళు ఒక ఫిట్నెస్ ట్రైనర్ ను, డైటీషియన్ ను నియమించుకుంటారు. వారు చెప్పినట్లే తు.చ తప్పకుండా పాటిస్తారు. అందుకే అంత…
Weight loss Telugu Tips Part-1 వెయిట్ లాస్ టిప్స్
బరువు తగ్గడం అంటే ఏదో ఆదరాబాదరాగా డైట్ లు, ఎక్సర్సైజులు మొదలు పెట్టడం కాదు. ముందు మీరు మానసికంగా సిద్దం కావాలి. ఒక వారం రోజులు సమయం తీసుకొని పక్కా ప్రణాళిక సిద్దం చేసుకోవాలి. మీ శరీర తత్వానికి సరిపడే మార్గం ఎంచుకోవాలి. ఈ మధ్య కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఈ డ్రింక్ తాగితే మూడు రోజుల్లో 10 కేజీలు తగ్గుతారు ఇంకోటేదో తింటే వారంలో 20 కేజీలు తగ్గుతారు లాంటివి చాలా ఎక్కువగా చూస్తున్నాము.ఇవేవి నిజాలు…
అధిక బరువు-మీరు అర్ధం చేసుకోవాల్సిన విషయాలు
మనలో చాలా మందిని బాధించే సమస్య అధిక బరువు. పెరగడమైతే తేలికే కానీ తగ్గాలనుకుంటేనే మహా కష్టం.అందరూ బరువు తగ్గడానికి నానా కష్టాలు పడుతుంటారు. కానీ తగ్గలేక దిగులు పడుతుంటారు. సరే! ఇదంతా పక్కన పెడితే అసలు మనం బరువు ఎందుకు పెరుగుతామో తెలుసుకోవడమనేది చాలా అవసరం. పుట్టగానే అయితే బరువు ఉండము కదా. పెరిగే క్రమంలో మన శరీరం లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. కొందరు ఎప్పటికీ ఒకలానే ఉంటారు. కొంతమంది ఓ మాదిరి…