ఉదాహరణ 5 నేను పైన చెప్పాను కదా తర్వాత ఒరిస్సా వెళ్ళిపోయామని.ఒరిస్సా లో కొన్ని రోజులు కటక్ లో ఉన్నాము.అక్కడ తులసీ పూర్ లో TV టవర్ కట్టే కాంట్రాక్టు మా నాన్న పనిచేసే కంపెనీ వారికి వస్తే వాళ్ళు మా నాన్నను అక్కడ సైట్ ఇంఛార్జ్ గా వేశారు.తర్వాత మా నాన్నను అప్పర్ కొలాబ్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల బరినిపుట్ కి వెళ్ళిపోయాము.బరినిపుట్ Jeypore నుండి మహా అయితే ఒక 5 నుండి 6 km…
Kaburlu
నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు Part-4/నాగార్జున సాగర్ విశేషాలు
ఉదాహరణ 4 నేను పుట్టిన దగ్గర నుండి నాకు 3 సంవత్సరాలు వయసు వచ్చే వరకు మేము నాగార్జున సాగర్ హిల్ కాలనీ లో ఉండేవాళ్ళం.నాకు గుర్తున్నంత వరకు నేను మా అమ్మతో కన్నా ఎక్కువ మా పని మనిషి జయ లక్ష్మి తో లేదా పక్కింటి లక్ష్మి ఆంటీ వాళ్ళింట్లో ఎక్కువగా ఉండేదాన్ని.జయ లక్ష్మి కి నేనంటే బాగా ఇష్టం.విపరీతంగా గారాబం చేసేది.ముద్దొచ్చి నప్పుడల్లా నా బుగ్గలు కొరికేది.నేను నాకు వచ్చిన భాషలోనే ఏదో తిట్టేదాన్ని…
నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు Part-3/అప్పర్ సీలేరు విశేషాలు
ఉదాహరణ 3 పైన ఉదాహరణ లో మా నాన్నకు సీలేరు ట్రాన్స్ ఫర్ అయిందని చెప్పాను కదా.వేసవి సెలవులు రాగానే నాన్న వచ్చి నన్ను, అక్కని, అమ్మను సీలేరు తీసుకెళ్ళేవారు.అక్కడ అప్పర్ సీలేరు లో ఇచ్చారు నాన్నకి ఇల్లు.ఆ ఇల్లు ఊరి చివర కొండ పైన ఇన్స్పెక్షన్ బంగ్లా కి వెళ్లే దారిలో కొండ ఎక్కగానే ఎడమ వైపు ఉండేది.పెద్ద మండువా లోగిలి ఇల్లు.కాకపొతే మండువా లోగిలి ఇంటికి నాలుగు వైపులా గదులు ఉండి మధ్యలో ఖాళీగా…
నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు Part-2
ఉదాహరణ 2 నా చిన్నప్పుడు మేము మా నాన్న పనిచేసే ప్రైవేటు కంపెనీ కి చెందిన ఒక చిన్న, 10 ఇళ్ళు మాత్రమే ఉండే కాలనీ లో ఉండేవాళ్ళం.ఆ కాలనీ ఎంతో అందంగా, అద్భుతంగా ఉండేది.దాదాపు పది ఎకరాలలో కాలనీ ఉండేది.కానీ 3 ఎకరాలలో మాత్రమే ఇళ్ళు ఉండేవి.కాలనీ చుట్టూ fencing ఉండేది. తూర్పు వైపు ఫెన్సింగ్ ను ఆనుకుని వరుసగా పెద్ద పెద్ద నేరేడు చెట్లు ఉండేవి.ఉత్తరం వైపు రోడ్డు కి ఆనుకొని కాలనీ గేటు…
నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు Part-1
మన అందరి బాల్యం, యవ్వనం ఎన్నో తీపి జ్ఞాపకాలతో లేదా చేదు అనుభవాలతో నిండి ఉంటుంది.కానీ మనం అందులోని తీపి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ మిగతా జీవితాన్ని మెల్లిగా వెళ్ళదీస్తాము.ఆ జ్ఞాపకం ఒక ప్రదేశం, వ్యక్తి, సంఘటన ఇలా ఏదైనా కావొచ్చు.ఆ జ్ఞాపకాలతో కూడిన ప్రదేశాలను, వ్యక్తులను ఒక్కసారి మళ్లీ చూస్తే బాగుండుననిపిస్తుంది. నాకూ అలానే అనిపిస్తుంటుంది.నా జ్ఞాపకాలలో వ్యక్తుల కన్నా ఎక్కువగా ప్రదేశాలే ఉన్నాయి.ఏ కాస్త ఖాళీ సమయం చిక్కినా, నా మధుర జ్ఞాపకాలను చాపలుగా…
వేసవి కాలం కబుర్లు – మీ చిన్ననాటి వేసవి రోజులు మీకు గుర్తున్నాయా?
మండే ఎండల్ని తలచుకుంటే వేసవి కాలం అంటేనే భయం వేస్తుంది ఎవరికైనా.కానీ వేసవి ఉదయాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి.నాకు వేసవి కాలపు ఉదయాలంటే చాలా ఇష్టం.పగలంతా ఎంత వేడిగా ఉన్నా తెల్లవారు ఝాము సమయానికి మాత్రం వాతావరణం చల్లగా ఉంటుంది.అందుకే నేను వేసవిలో చాలా తొందరగా నిద్ర లేస్తాను.చక్కని చిక్కని కాఫీ కలుపుకొని బయట వరండాలో కూర్చుంటాను.కమ్మని కాఫీ సువాసనను ఆస్వాదిస్తూ మెల్లిగా సిప్ చేస్తూ అప్పుడే తెల్లవారుతున్న ఆకాశాన్ని చూస్తూ ఉంటాను. చల్లని పిల్ల తెమ్మెరలు…