Site icon Maatamanti

Chamagadda Fry Telugu Recipe-చామగడ్డ వేపుడు

chamagadda fry telugu recipe

Chamagadda Fry Telugu Recipe with step by step instructions.English Version.

చామగడ్డ లను అతి తక్కువ సమయం లో తేలికగా వండాలంటే ఇలా వేపుడు చేసుకుంటే బాగుంటుంది.ఉడికించిన చామగడ్డ లకు మసాలా పట్టించి కాసేపు వదిలేసి తర్వాత నూనెలో తాలింపు వేసి ఒక 5 నుండి 7 నిమిషాల పాటు వేయించుకుంటే అయిపోతుంది.నేను గరం మసాలా వేయలేదు.మీకు టేస్ట్ ఇంకా కొంచెం డిఫరెంట్ గా కావాలనుకుంటే కాస్త గరం మసాలా కూడా వేసి ముక్కలకు పట్టించి వేయిస్తే ఇంకా బాగుంటుంది.

చేమగడ్డ లను ఉడికించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.ఎక్కువగా ఉడికిస్తే పేస్ట్ లా అయిపోతాయి.కాబట్టి 3 విజిల్స్ రాగానే స్టవ్ కట్టేసి కుక్కర్ లో ఆవిరి సగం పోగానే మిగతా సగం ఆవిరిని విజిల్ తేసేసి మనం రిలీజ్ చేయాలి.తర్వాత వేడి నీళ్ళని వంపేసి మామూలు నీళ్ళు పోయాలి.ఇలా చేయడం వల్ల చామగడ్డ లను వేడికి ఇంకా మెత్తబడకుండా ఆపవచ్చు.కాలదు కనుక తేలిగ్గా పొట్టు కూడా తేలిగ్గా  తీసేయవచ్చు.ఉడికిన గడ్డలను చక్రాలుగా కోసి వేయిస్తే చూడడానికి అందంగా చాలా రుచిగా ఉంటాయి.వీటిని రసం తో గానీ, పప్పు చారు తో గానీ తింటే చాలా బాగుంటుంది.ఈ సూపర్ తేలికైన రుచికరమైన recipe ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Dondakaya Fry Recipe in Telugu
Thotakura Pesara Pappu Fry Recipe in Telugu
Potato/Aloo/Alugadda Fry Recipe in Telugu
Kodiguddu Vepudu Recipe in Telugu
Chepala Vepudu or Fish Pan Fry in Telugu
Chicken Liver Fry Recipe in Telugu

Click here for the English Version of this recipe.

Chamagadda Fry Telugu Recipe
Prep Time
30 mins
Cook Time
10 mins
Total Time
40 mins
 
Course: Main Course
Cuisine: Indian, South Indian
Servings: 3
Author: బిందు
Ingredients
ఉడికించుట కొరకు
  • 250 గ్రాములు చేమగడ్డలు
  • నీళ్ళు తగినంత ఉడికించుటకు
మారినేషన్ కొరకు
  • ఉప్పు తగినంత
  • ½ tsp పసుపు
  • 2 tsp కారం
  • 2 tsp ధనియాల పొడి
  • 1 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
వేపుడు కొరకు
  • 3 tbsp నూనె
  • ½ tsp ఆవాలు
  • ½ tsp జీలకర్ర
  • ½ tsp మినప పప్పు
  • 1 ఎండు మిర్చి
  • 1 రెమ్మ కరివేపాకు
Instructions
ఉడికించుట
  1. చేమగడ్డ లను మట్టి పోయే వరకు బాగా కడిగి ప్రెషర్ లోకి తీసుకోవాలి.
  2. మునిగే వరకు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
  3. సగం ఆవిరి పోయాక కుక్కర్ మూత తెరచి వేడి నీళ్ళు వంపేసి మామూలు నీళ్ళు పోయాలి.
  4. చేమగడ్డ ల మీద పొట్టు తీసేసి గుండ్రని చక్రాలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
మారినేట్ చేయుట
  1. ఒక ప్లేట్ లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నింటినీ బాగా కలపాలి.
  2. తరవాత ఆ మసాలా మిశ్రమాన్ని కట్ చేసి పెట్టుకున్న చేమగడ్డ ముక్కలకు పట్టించి ఒక 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
వేయించుట
  1. ఒక బాణలిలో నూనె వేసి కాగి నాక ఆవాలు, జీలకర్ర, మినప పప్పు, ఎండు మిర్చి వేసి చిటపట లాడనివ్వాలి.
  2. కరివేపాకు, పచ్చి మిరపకాయలు కూడా వేసి వేయించాలి.
  3. తరవాత మసాలా పట్టించి పెట్టుకున్న చేమగడ్డ ముక్కలను వేసి బాగా కలపాలి.
  4. 5 నుండి 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించి పొయ్యి కట్టేయాలి.

Chamagadda Fry Telugu Recipe Video

[embedyt] https://www.youtube.com/watch?v=JrhMVNgPl1g[/embedyt]

Exit mobile version