Chicken Biryani Telugu Recipe step by step instructions.English Version.
హైదరాబాదీ బిర్యానీ ప్రపంచంలో ని అత్యంత పాపులర్ వంటకాలలో ఒకటి.హైదరాబాద్ కి వచ్చిన వాళ్ళు ఈ బిర్యానీ ని రుచి చూడకుండా వెళ్ళరంటే అతిశయోక్తి కాదు.ప్రపంచంలో చాలా చోట్ల ఈ హైదరాబాదీ బిర్యానీని తయారు చేసి అమ్ముతుంటారు.కానీ అసలైన హైదరాబాదీ బిర్యానీని తినాలంటే హైదరాబాద్ లోనే తినాలి.బిర్యానీ ని ఖట్టా ఇంకా రైతా లతో కలిపి వడ్డిస్తుంటారు.
నాకు వంట చేయడం బోర్ అనిపించినపుడల్లా బిర్యానీ తెచ్చుకొని తింటుంటాము.పారడైస్, కేఫ్ బహార్, బావర్చి బిర్యానీ లు చాలా బాగుంటాయి.నాకైతే కేఫ్ బహార్ బిర్యానీ అంటే ఇష్టం.పారడైస్ బిర్యానీ అయితే నెయ్యితో చేస్తారు.చికెన్ మిశ్రమంలో కొద్దిగా పల్లీల పొడి కూడా వేస్తారు.ఒకసారి పారడైస్ హోటల్ కి వెళ్ళినప్పుడు కౌంటర్ దగ్గర పెట్టిన video లో చూసాను.అప్పుడే తెలిసింది ఆ బిర్యానీ రుచి వేరే వాటిలా కాకుండా కొంచెం వేరుగా ఎందుకు ఉంటుంది అని.కానీ చాలా బాగుంటుంది.
బిర్యానీ రుచి మొత్తం మనం కలిపే చికెన్ మిశ్రమం మీదే ఆధారపడి ఉంటుంది.అన్ని మసాలాలు తగినంత వేసి రుచి చూస్తే మీకు ఆల్మోస్ట్ బిర్యానీ రుచి లానే ఉంటుంది.ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కొద్దిగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది.బిర్యానీ చేయడానికి కాస్త ప్రాక్టిస్ అవసరం.ఒక్కసారి చేయగానే బాగా రాలేదని వదిలేయకుండా రెండు మూడు సార్లు ట్రై చేస్తే మీకు బాగా వస్తుంది.కావాల్సి నప్పుడల్లా ఎంచక్కా ఇంట్లోనే తయారు చేసుకొని తినవచ్చు.నేనైతే కనీసం నెలకొక్కసారైనా బిర్యానీ చేస్తాను.సరిగ్గా తయారు చేయడం వస్తే అన్నింటికన్నా బిర్యానీ చేయడమే తేలిక.కావాలంటే ముందు రోజు రాత్రే చికెన్ ను మారినేట్ చేసి ఫ్రిజ్ లో పెట్టేసుకొని ఉదయాన్నే బిర్యానీ వండుకోవచ్చు.అప్పుడు అరగంటలో అయిపోతుంది.ఎప్పుడైనా సండే బయటకు వెళ్లే పని ఉన్నప్పుడు టైం వేస్ట్ కాకుండా నేను అలానే చేస్తాను.చికెన్ ముక్కలకు మసాలలన్నీ బాగా పట్టి వండాక చాలా మెత్తగా జ్యూసీ గా ఉంటాయి.కేవలం కట్టా ఇంకా రైతా ల తోనే కాకుండా దాల్చా తో కూడా బిర్యానీ సూపర్ టేస్టీ గా ఉంటుంది.మీరు కూడా ఈ రుచికరమైన బిర్యానీ recipe ని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.
చికెన్ బిర్యానీ నే కాస్త వెరైటీ గా ట్రై చేయాలనుకుంటే మీరు హరా మసాలా చికెన్ బిర్యానీ లేదా/గ్రీన్ బిర్యానీ ని తప్పక ట్రై చేయాల్సిందే.చికెన్ ముక్కలను మరినేట్ చేసేటప్పుడు గ్రీన్ మసాలా పేస్ట్ కూడా వేయాలి.నాకయితే నార్మల్ చికెన్ బిర్యానీ కన్నా కూడా గ్రీన్ చికెన్ బిర్యానీ నే చాలా ఇష్టం.టేస్ట్ సూపర్ గా ఉంటుంది.మీరు కూడా తప్పకుండా గ్రీన్ చికెన్/హరా మసాలా చికెన్ బిర్యానీ ని తప్పక ట్రై చేయండి.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Fish Dum Biryani Recipe in Telugu
Homemade Ulavacharu recipe in Telugu
Hyderabadi Mutton Dalcha Recipe in Telugu
Hyderabadi Prawns Biryani Recipe in Telugu
Chicken Tikka Pulao Recipe in Telugu
Prawns Pulao Recipe in Telugu
Ulavacharu Chicken Biryani recipe in Telugu
Click Here for the English Version of this Recipe.
Chicken Biryani Telugu Recipe Text
- 1 అంగుళాల దాల్చిన చెక్కలను , 2 ముక్కలు
- 6 లేదా 7 లవంగాలు
- 5 నుండి 6 యాలుకలు
- 1 tsp షాజీరా
- 1/4 ముక్క జాజికాయ
- 1 అనాస పువ్వు
- 3 గ్రాముల బిర్యానీ కా ఫూల్
- 3 మరాఠీ మొగ్గు చిన్నవి
- 1 ముక్క జాపత్రి
- 750 గ్రాములు చికెన్ , బిర్యానీ కట్
- 1/2 tsp పసుపు పొడి
- ఉప్పు రుచికి సరిపడా
- 2 నుండి 3 tsp కారం
- 1 tbsp పచ్చిమిర్చి ముద్ద
- 1 tbsp అల్లం వెల్లుల్లి పేస్ట్
- పుదీనా ఆకులు , గుప్పెడు
- 3 మీడియం ఉల్లిపాయలు , చాలా సన్నగా నిలువుగా తరిగిన ముక్కలు
- 200 గ్రాముల గడ్డ పెరుగు
- 1 నిమ్మకాయ
- 6 tbsp నూనె , కాచినది
- 2 లేదా 3 tbsp నెయ్యి
- 800 గ్రాముల బాస్మతి బియ్యం
- నీళ్ళు
- అన్ని మసాలా దినుసులు నేను పైన చెప్పినవన్నీ
-
బాస్మతి బియ్యంలో నీళ్ళు పోసి అరగంట సేపు నానబెట్టాలి.
-
వందే ముందు 2 నుండి 3 సార్లు కడగాలి.
-
దాల్చినచెక్క, లవంగాలు, యాలుకలు, షాజీరా, జాజికాయ, అనాసపువ్వు, బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గలు, జాపత్రి, అనాస పువ్వు అన్నింటిని మిక్సీలో వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
-
750 గ్రాముల చికెన్ కొరకు 1 ½ నుండి 2 tsp ల బిర్యానీ మసాలా వాడితే సరిపోతుంది.
-
ఉల్లిపాయలను చాలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి.
-
డీప్ ఫ్రై కి సరిపడా నూనె కాచి, ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసి లేత గోధుమరంగు లోకి మారేవరకు వేయించాలి.
-
బయటకు తీసేటప్పుడు గరిటెతో నూనె ను గట్టిగా వత్తేసి పక్కన పెట్టుకోవాలి.అలా చేస్తే వేయించిన ఉల్లిపాయలు కర కర లాడతాయి.
-
శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలను ఒక పాత్రలోకి తీసుకొని అందులో తగినంత ఉప్పు, కారం, పసుపు, 2 tsp బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, నిమ్మ రసం, పెరుగు, పచ్చి మిర్చి పేస్ట్, పుదీనా ఆకులు వేసి బాగా ముక్కలకు పట్టేలా కలపాలి.
-
చికెన్ ముక్కలను కనీసం 1 నుండి 2 గంటల పాటు నాననివ్వాలి.
-
ఒక మందపాటి గిన్నెలో నీళ్ళు పోసి, అందులో తగినంత ఉప్పు, అన్ని మసాలా దినుసులు, కొద్దిగా పుదీనా ఆకులు, బిర్యానీ ఆకు వేసి మరిగించాలి.
-
నీళ్ళు మరగడం మొదలవగానే అందులో నానబెట్టిన బియ్యం వేయాలి.బియ్యం వేయగానే నీరు మరగడం ఆగిపోతుంది.అప్పుడు మళ్ళీ మరిగించాలి.
-
మళ్ళీ మరగడం మొదలైన దగ్గర నుండి సరిగ్గా 3 నిమిషాలు ఉడికించి స్టవ్ కట్టేసి వెంటనే నీళ్ళు వార్చేయాలి.
-
బిర్యానీ పాత్ర అంచులకు నూనె రాసి, 5 నుండి 6 tbsp ల కాచిన నూనె, 2 tbsp ల నెయ్యి వేయాలి.
-
అందులో నానబెట్టిన చికెన్ వేసి పైన సగం ఉడికించిన అన్నం వేయాలి.అన్నం పైన కొన్ని పుదీనా ఆకులు, వేయించిన ఉల్లిపాయలు వేయాలి.
-
అల్ల్యుమినియం ఫాయిల్ లేదా తడి బట్ట తో బిర్యానీ పాత్రని సరిగ్గా కవర్ చేయాలి.పైన మూత పెట్టి, ఏదైనా బరువు పెట్టాలి.
-
12 నుండి 15 నిమిషాల పాటు పెద్ద మంట మీద ఉడికించి 5 నిమిషాలు సన్నని సెగ మీద ఉడికించాలి.
-
పొయ్యి కట్టేసి కాసేపు మూత తెరవకుండా వదిలేసి తర్వాత సర్వ్ చేయాలి.
Lavanyap says
So nice mam…..
BINDU says
Thank you, Lavanya…:)
Shankar Ch says
Super bindu garu
BINDU says
Thank you andi.
Sreekanth says
Thanks Bindhu garu. Will try this
BINDU says
you are most welcome Sreekanth garu.
sazid says
Hello Bindu, your hyderabadi dam biriyani is intresting to read but you had not used tomato while preparing. Is it optional? Wish you all the best.
BINDU says
Usually, Tomatoes are not used in Hyderabadi Dum Biryani…. but if you want you can add them.
సత్యనారాయణ says
Good ఇన్ఫర్మేషన్ mm ధన్యవాదములు
Vardhan says
I’m a student in Australia…tried this recipie …..was wonderful …..little complaint is chicken got a bit charred is it problem with the dish or did I overcook??…I love this recipie …thank you very much Ma.bindu
Srikanth Ramagiri says
good explanation mama… please keep post new reciepes
BINDU says
Thank you andi…. sure
Vanitha says
Bindu garu…. pls post cafebahar biryani recipe andi… అది అంత juicy గా ఎలా వస్తుంది అని??? Pls aa secret మీరు తెలుసుకొని మాకు కూడా share cheyandi
Raghavendra says
Superb thank you very much andi
Sirisha says
Very nice andi