Chicken Dosa Telugu Recipe with step by step instructions.English Version.
ఈ చికెన్ దోశ రెసిపీ ని నేను ఎక్కువగా ఆదివారాలలో ప్రిపేర్ చేస్తుంటాను. మామూలు దోశ కన్నా కొద్దిగా ఎక్కువ సమయం తీసుకుంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.దోశ ల బండి దగ్గర లేదా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఒక దోశ ఖరీదు 150 నుండి 200 రూపాయల వరకు ఉంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకుంటే అదే ఖర్చుతో ౩ నుండి 4 దోశ లు తయారు చేసుకోవచ్చు(ఛీజ్ వేస్తే).ఛీజ్ వేయకుండా చేస్తే 5 నుండి 6 దోశల దాకా చేసుకోవచ్చు.
ఇది పోస్ట్ వర్క్ అవుట్ మీల్ గా బాగుంటుంది. ఒక్క దోశ తింటే సరిపోతుంది. మామూలు బ్రేక్ ఫాస్ట్ లో కన్నా కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఇంకా ప్రోటీన్స్ ఎక్కువ. దోశ లో వేసే బియ్యం వల్ల కొద్దిగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇంకా తగ్గించాలంటే దోశ ల పిండిలో పచ్చి బియ్యం వేసే కన్నా మినప పిండిలో ఉడికించి పేస్ట్ చేసిన అన్నం వేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల కార్బోహైడ్రేట్స్ ని ఇంకా కట్ చేయవచ్చు.
ఈ రెసిపీ కోసం నేను చికెన్ ను ముందుగా బాయిల్ చేశాను. మీరు కావాలంటే డైరెక్ట్ గా వండేసుకోవచ్చు. ముందుగా బాయిల్ చేసి పెట్టుకుంటే కూరని ఒకే విధంగా కాకుండా అప్పటికప్పుడు ఎవరికి నచ్చినట్లుగా వారు తయారు చేసుకోవచ్చు. నేను చేసినట్లుగా కాకుండా షేజువాన్ చికెన్ కానీ, చిల్లీ చికెన్ కానీ, ఉలవచారు చికెన్ కానీ చేసుకోవచ్చు. షేజువాన్ చట్నీ, చిల్లీ చట్నీ, ఉలవచారు రెడీ గా ఉంటాయి కాబట్టి మీకు నచ్చినట్లుగా తయారు చేసుకోవచ్చు.
ఈ దోశ లో ఛీజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ వేయక పోయినా పర్వాలేదు. అది జస్ట్ ఆప్షనల్ ఇంగ్రేడిఎంట్ మాత్రమే. ఛీజ్ తో చేసి ఇస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Palli Karam Dosa Recipe in Telugu
Ulli Karam Dosa Recipe in Telugu
Pesarattu Recipe in Telugu
Beetroot Poori Recipe in Telugu
Hotel Style Poori Curry Recipe in Telugu
Instant Rava Vada Recipe in Telugu
Click here for the English Version of the Recipe.
- 250 గ్రాములు చికెన్ బోన్ లెస్
- 2 లీటర్లు నీళ్ళు (చికెన్ ను ఉడికించుట కొరకు)
- ఉప్పు తగినంత
- 4 లవంగాలు
- 4 ఏలకులు
- 2 దాల్చినచెక్కలు అంగుళం పొడవు
- 2 మీడియం ఉల్లిపాయల పేస్ట్
- 1 tbsp అల్లం వెల్లుల్లి పేస్ట్
- 2 పచ్చి మిరపకాయలు
- ¼ tsp పసుపు
- 1 ½ tsp కారం
- 2 మీడియం టమాటోల గుజ్జు
- 1 tsp ధనియాల పొడి
- 1 tsp గరం మసాలా
- ½ కప్పు నీళ్ళు
- ¼ tsp పంచదార
- ¼ కప్పు కొత్తిమీర తరుగు
- 2 గరిటెల దోశెల పిండి
- 40 నుండి 50 గ్రాములు చికెన్ కూర
- 1 గుడ్డు
- 30 గ్రాములు ఛీజ్ తురుము(ఆప్షనల్)
- 2 రెమ్మలు కొత్తిమీర
- 1 tbsp నూనె
-
ఒక పాత్రలో రెండు లీటర్ల నీళ్ళు పోసి, లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క, ఉప్పు వేయాలి.
-
చికెన్ బ్రెస్ట్ లేదా థై ముక్కలు వేసి 10 నిమిషాల పాటు ఉడికించాలి.
-
స్టవ్ కట్టేసి చికెన్ ముక్కలను బయటకు తీసేయాలి.
-
కొద్ది సేపు ఆరనచ్చి వాటిని సన్నని స్ట్రిప్స్ లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
-
కడాయి లో నూనె వేడి చేయాలి.
-
నూనె వేడెక్కాక ఉల్లిపాయ పేస్ట్, పచ్చి మిర్చి పేస్ట్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
-
పసుపు, కారం వేసి కలపాలి.
-
టమాటో గుజ్జు వేసి కలిపి నూనె అంచులకు చేరే వేరే వరకు ఉడికించాలి.
-
ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి.
-
అర కప్పు నీళ్ళు పోసి మళ్ళీ కూర దగ్గర పడే వరకు వండాలి.
-
ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి ఒక సారి కలిపాలి.
-
౩ నుండి 5 నిమిషాలు ఉడికించి కొత్తిమీర తరుగు వేసి స్టవ్ కట్టేయాలి.
-
దోశె పెనం వేడి చేసి రెండు గరిటెల పిండి వేసి గుండ్రంగా పరవాలి.
-
దోశ పెనానికి కొద్దిగా అంటుకోగానే ఒక గుడ్డు పగల కొట్టి పైన వేయాలి.
-
చుట్టూరా నూనె వేసి గుడ్డు సొన దోశ కు అతుక్కునే వరకు ఆగాలి.
-
తర్వాత చికెన్ కూర, ఛీజ్, కొత్తిమీర వేసి దోశ ను మడవాలి.
-
ఛీజ్ కరిగే వరకు సన్నని సెగ మీద ఉంచి తీసేయాలి.
Chicken Dosa Telugu Recipe Video
Leave a Reply