Chicken liver fry recipe with step by step instructions.
నా చిన్నప్పుడు నాకు ఇష్టం లేని వాటిలో చికెన్ లివర్ కూడా ఒకటి.అసలు తినేదాన్ని కాదు. ఒకవేళ పొరబాటున నాకు వేసిన కూరలో ఒక లివర్ పీస్ ఉన్నా పక్కన ఎవరుంటే వాళ్ల ప్లేటులో పెట్టేసేదాన్ని.పెళ్ళయిన తర్వాత నా హస్బెండ్ వండమని చెప్తే అసలు వండడానికి ఇష్టపడేదాన్ని కాదు.ఇక ఇలా అయితే లాభం లేదనుకున్నడేమో అయనే వండి నన్ను టేస్ట్ చేయమంటే నేను తినను అన్నాను.”ఒకే ఒక్క చిన్న ముక్క తిని చూడు.నీకు నచ్చకపోతే ఇంకెప్పుడూ తినమని చెప్పను” అని అన్నారు.రుచి చూడకుండానే బాగోలేదని చెప్పడం సరి కాదు కనుక కొంచెం తీసుకొని తిని చూసాను.
తినగానే చాలా రుచిగా అనిపించింది..అప్పటి నుండి నేను ఆ(అయన వండే) కూరకి ఫాన్ అయిపోయాను.కానీ మేము తరచుగా ఈ కూరని వండుకోము.ఎందుకంటే లివర్ లో చాలా కొలెస్ట్రాల్ ఉంటుంది.100 గ్రాముల వండిన లివర్ లో సుమారుగా 560 mg ల కొలెస్ట్రాల్ ఉంటుంది.ఇంకా సుమారు 25 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.ఈ కూరని అన్నంతో గానీ, చపాతిలతో గానీ తింటే చాలా బాగుంటుంది.మీరు కూడా ఈ కూరని చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
ఫిష్ బిర్యానీ తయారు చేయడం ఎలా?
గోంగూర చికెన్ తయారు చేయడం ఎలా?
పెప్పర్ చికెన్ తయారు చేయడం ఎలా?
హైదరాబాదీ ప్రాన్స్ బిర్యానీ తయారు చేయడం ఎలా?
కోడిగుడ్డు మునక్కాడ కూర
Click here for the English Version of this Recipe
- 200 గ్రాములు చికెన్ లివర్
- 2 మీడియం ఉల్లిపాయలు సన్నగా తరిగినవి
- 4 పచ్చిమిరపకాయలు
- ¼ tsp పసుపు
- 3 tsp కారం
- 3 tsp ధనియాల పొడి
- 1 tsp గరం మసాలా
- 2 ½ tsp అల్లం వెల్లుల్లి ముద్ద
- 1 tsp ఉప్పు తగినంత
- 3 రెమ్మలు కరివేపాకు
- 6 tsp నూనె
- ¼ కప్పు కొత్తిమీర
-
లివర్ ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి 15 నిమిషాల పాటు నానబెట్టాలి.
-
బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి మగ్గేవరకు వేయించాలి.
-
పసుపు, కారం, కరివేపాకు కూడా వేసి ఒక నిమిషం పాటు ఉడికించాలి.
-
నానబెట్టిన లివర్ వేసి బాగా కలిపి మూత పెట్టి 10 నుండి 12 నిమిషాల పాటు ఉడికించాలి.మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.లేకపోతే అడుగంటుతుంది.
-
మూత తెరచి అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా వేసి 5 నుండి 7 నిమిషాల పాటు వేయించాలి.
-
కొత్తిమీర తరుగు వేసి ఒకసారి కలిపి దించేసుకోవాలి.
Chicken Liver Fry Recipe Video
[embedyt] http://www.youtube.com/watch?v=z3J2adJLdJE[/embedyt]
Leave a Reply