Chicken Majestic Telugu Recipe with step by step instructions.English Version.
మా ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రవీణ్ నాకు తను ఒక రెస్టారెంట్ లో టేస్ట్ చేసి వచ్చి చికెన్ మాజేస్టిక్ గురించి చెప్పాడు.టేస్ట్ చాలా బాగుంది నన్ను ట్రై చేసి నా బ్లాగ్ లో పోస్ట్ చేయమని సజెస్ట్ చేశాడు.తను కూడా మాలానే మంచి foodie అన్నమాట.తను చెప్పింది విని నేను google లో recipe కోసం వెతికాను.ఒక్కొక్కరు ఒక్కోలా చేసారు.నేను అందరి recipes లోని మెయిన్ ingredients తీసుకొని తయారు చేశాను.చాలా చాలా బాగా కుదిరింది.చికెన్ పీసెస్ అయితే స్పైసీ గా నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత మృదువుగా ఉన్నాయి.నాకు చికెన్ మలై కబాబ్ అంటే విపరీతమైన ఇష్టం.కానీ అప్పటి నుండి చికెన్ మెజెస్టిక్ కి కూడా ఫ్యాన్ అయిపోయాను.ఇంత మంచి రెసిపీ గురించి తెలియ చేసినందుకు ప్రవీణ్ కి నా కృతజ్ఞతలు.
ఈ రెసిపీ కోసం బోన్ లెస్ చికెన్ తీసుకోవాలి.thigh పీసెస్ తీసుకుంటే ఇంకా మంచిది.చికెన్ ముక్కల్ని మజ్జిగలో నానబెట్టడం వల్ల ముక్కలు మృదువుగా మారతాయి.చికెన్ ను డీప్ ఫ్రై చేసేటప్పుడు 2 లేదా 3 నిమిషాల కన్నా ఎక్కువ సేపు ఫ్రై చేయకూడదు.ఎక్కువ సేపు ఫ్రై చేస్తే చికెన్ లో సహజం గా ఉండే తేమ కోల్పోయి ముక్కలు గట్టిగా మారతాయి.వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీద వేయించాలి.
ముక్కలన్నింటినీ డీప్ ఫ్రై చేశాక మళ్ళీ ఇంకో పాన్ లో మిగిలిన అన్ని పదార్ధాలు వేసి పెద్ద మంట మీద కలుపుతూ వేయించాలి.అయిపోయాక కాస్త నిమ్మ రసం పిండి, ఉల్లి కాడ మరియు కొత్తిమీర తరుగు వేసి వేడిగా సర్వ్ చేయాలి.ఎంతో రుచి కరమైన ఈ చికెన్ మెజెస్టిక్ రెసిపీ ని మీరు కూడా తయారు చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Pressure Cooker Chicken Biryani Recipe in Telugu
Chicken Biryani Recipe in Telugu
Ulavacharu Chicken Biryani Recipe in Telugu
Methi Chicken Recipe in Telugu
Chicken Shawarma Recipe in Telugu
Schezwan Chicken Thighs Recipe in Telugu
Click here for the English Version of the Recipe
- 400 గ్రాములు చికెన్ బోన్ లెస్ సన్నని స్ట్రిప్స్ గా కట్ చేసినది
- 400 ml మజ్జిగ
- తగినంత ఉప్పు
- 1 నిమ్మకాయ
- ¼ కప్పు కార్న్ ఫ్లోర్
- నూనె డీప్ ఫ్రై కి సరిపడా
- 2 tbsp వెల్లుల్లి తరుగు
- 1 రెమ్మ కరివేపాకు
- 1 tbsp అల్లం వెల్లుల్లి పేస్ట్
- 3 పచ్చి మిరపకాయలు
- ½ tsp పసుపు
- 1 tbsp కారం
- 1 tbsp ధనియాల పొడి
- ¼ tsp గరం మసాలా
- 1 tsp సోయా సాస్
- 1 tsp వెనిగర్
- 1/3 కప్పు పెరుగు
- ¼ కప్పు ఉల్లి కాడ తరుగు
- ¼ కప్పు కొత్తిమీర తరుగు
- 1 నిమ్మకాయ
- 3 tbsp నూనె
-
బోన్ లెస్ చికెన్ ను శుభ్రంగా కడిగి సన్నని స్ట్రిప్స్ లా కట్ చేసుకోవాలి.
-
మజ్జిగలో తగినంత ఉప్పు, నిమ్మ రసం, చికెన్ ముక్కలు వేసి కలిపి గంట లేదా రెండు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి.
-
చికెన్ ముక్కలను ఫ్రిజ్ లో నుండి బయటకు తీసి మజ్జిగ వంపేసి ముక్కలను పక్కన పెట్టుకోవాలి.
-
ముక్కలకు కొద్దిగా కార్న్ ఫ్లోర్ పట్టించాలి. ఉప్పు వేయక్కరలేదు. మజ్జిగలోని ఉప్పు పీల్చుకున్నాయి కాబట్టి.
-
కడాయిలో లో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేడి చేసి చికెన్ ముక్కలను 2 నిమిషాల పాటు వేయించాలి.
-
వేయించిన ముక్కలను పేపర్ నాప్ కిన్ లోకి తీసుకోవాలి.
-
ఒక పెనంలో 3 tbsp ల నూనె వేడి చేయాలి.
-
వెల్లుల్లి తరుగు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
-
కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, సోయా సాస్, వెనిగర్, పసుపు, కారం ధనియాల పొడి, గరం మసాలా అన్ని ఒక దాని తర్వాత ఒకటి వేసి బాగా కలిపి వేయించాలి.
-
తర్వాత డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి 3 నుండి 5 నిమిషాల పాటు పెద్ద మంట మీద కలుపుతూ వేయించాలి.
-
సగం చెక్క నిమ్మ రసం, ఉల్లి కాడల తరుగు, కొత్తిమీర తరుగు వేసి కలిపి వేడిగా సర్వ్ చేయాలి.
Chicken Majestic Telugu Recipe Video
[embedyt] http://www.youtube.com/watch?v=duvebKS00x0[/embedyt]