Maatamanti

Chicken Shawarma Telugu Recipe

Chicken Shawarma Telugu Recipe with step by step instructions.English Version.

ఈ చికెన్ షావర్మ అనేది మన ప్రాంతంలో ప్రాచుర్యంలోకి వచ్చి సుమారు రెండు మూడు సంవత్సరాలు మాత్రమే అవుతుంది.అంతకు ముందు ఎక్కడో అక్కడక్కడ మాత్రమే అందుబాటులో ఉండేది.ఇప్పుడైతే హైదరాబాద్ లో  కనీసం వీధికొకటైనా shawarma సెంటర్ ఉంటుంది.ఒక రోజు  థియేటర్ కి నైట్ షో కి వెళ్ళినప్పుడు మొదటి సారి Chicken Shawarma టేస్ట్ చేసాను.కానీ నాకప్పుడు అంతగా నచ్చలేదు.చప్పగా అనిపించింది.తర్వాత మళ్ళీ చాలా రోజుల వరకు తినలేదు.తర్వాత మళ్ళీ మా ఆయన ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు ఒకసారి తెచ్చారు.అది మాత్రం స్పైసి గా సూపర్ టేస్టీ గా ఉంది.ఇక అప్పటి నుండి వారానికొకసారైనా తెప్పించుకొని తినడం అలవాటు అయింది.

పైన wrap కొరకు కొన్నిచోట్ల రుమాలి రోటి ఉపయోగిస్తారు మరికొన్ని చోట్ల పీటా బ్రెడ్ తో చేస్తుంటారు.షావర్మ అనేది ఒక అరబిక్ వంటకం.అసలైన షావర్మ లో అయితే పీటా బ్రెడ్ నే wrap గా ఉపయోగిస్తారు.ఒక చువ్వకు బాగా మసాలా పట్టించిన మాంసాన్ని పొరలు పొరలుగా గుచ్చుతారు.ఒక వైపు నుండి సెగ వస్తూ ఉంటుంది.ఆ సెగ వచ్చే వైపుకి చువ్వని తిప్పుతూ కొన్ని గంటల పాటు ఉడికిస్తూ ఉంటారు.పైన మైదా తో చేసిన పీటా బ్రెడ్ ను పక్కన పెడితే ఇది ఆరోగ్యకరమైన ఆహారంగానే చెప్పవచ్చు.అందుకే నేను పీటా బ్రెడ్ ను వాడకుండా మామూలు గోధుమపిండి రొట్టెను వాడాను.నేను చేసిన ఈ shawarma అసలైన shawarma లా చేయలేదు.కొన్ని మార్పులతో నా దగ్గర ఉన్న వాటితోనే చేసాను.కానీ టేస్ట్ మాత్రం అచ్చు అలానే ఉంది. అసలైతే టాపింగ్ కోసం tahini, hummus లాంటివి ఉపయోగిస్తారు.వీటి తయారీ నేను తదుపరి post చేస్తాను.మీరు కూడా ఈ రుచికరమైన recipe ని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Garlic Paneer Recipe in Telugu
Masala Vadalu Recipe in Telugu
Schezwan Chicken Recipe in Telugu
Bread Pizza Recipe in Telugu
Vegetable Cutlet Recipe in Telugu
Saggubiyyam Punugulu Recipe in Telugu

Click here for the English Version of this recipe.

Chicken Shawarma Telugu Recipe Video

Related Post

Please Share this post if you like