Chinese Egg Noodles Telugu Recipe with step by step instructions.English version.
ఈ చైనీస్ నూడుల్స్ చైనా వాళ్ళన్నా రోజూ చేసుకుంటారో లేదో తెలీదు కానీ మనోళ్ళు మాత్రం వీధికో బండి పెట్టి తెగ అమ్మేస్తుంటారు.ఎక్కడ ఆకలనిపిస్తే అక్కడ టక్కున ఆగి తినేస్తుంటారు.బండి వాడమ్మే నూడుల్స్ చాలా రుచిగా ఉంటాయి.కాకపొతే కాస్త నూనె ఎక్కువగా వేస్తారు.అదే నాకు నచ్చదు.అందుకే నేను ఎప్పుడూ ఇంట్లోనే తయారు చేస్తాను.మా అమ్మాయికి ఇంకా తన ఫ్రెండ్స్ కి నా నూడుల్స్ అంటే చాలా ఇష్టం.
నూడుల్స్ ని పెద్ద మంట మంట మీద పొగ వచ్చేలా వండుతారు.అలా చేయడం వల్ల వాటికి పొగ వాసన(smoky flavor) అంటి మంచి రుచి వస్తుంది.చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు నూడుల్స్ ని ముందే ఉడికించి పెద్ద వెదురు బుట్టలోకి వడకట్టి పక్కన పెట్టుకుంటారు.కూరగాయలు అన్ని ముందే కట్ చేసి పెట్టుకుని ఎవరైనా కస్టమర్ అడగగానే నిమిషాల్లో చేసిస్తారు.నేను కింద పెట్టిన video నూడుల్స్ కొంచెం మెత్తగా అయ్యాయి.అది నేను కొత్తల్లో తీసిన video.ఒకే సమయంలో వంట ఇంకా కెమెరా హేండిల్ చేయలేక పొరబాటున కాస్త మెత్తబడ్డాయి.అలా మెత్తని నూడుల్స్ తో చేస్తే రుచి సగానికి సగం తగ్గిపోతుంది.అందుకే నూడుల్స్ ని 3 నిమిషాల కన్నా ఎక్కువ ఉదడికించకూడదు.సగమే ఉదికినట్లుగా కనిపిస్తాయి.కానీ స్టవ్ కట్టేసి నీళ్ళు వార్చే లోపే మిగిలిన సగం ఉడికిపోతాయి.అందుకే పూర్తిగా ఉడికేవరకు నీళ్ళలో మరిగించకూడదు.కారం మిరియాల పొడి మీ రుచికి తగ్గట్లుగా adjust చేసుకోవచ్చు.ఎంతో నోరూరించే ఈ రుచికరమైన వంటకాన్ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు.
Chicken Shawarma Telugu Recipe
Garlic Paneer Telugu Recipe
Shezwan Fried Rice Telugu Recipe
Schezwan Chicken Telugu Recipe
Chicken Tikka Pulao Telugu Recipe
Sorakaya Halwa Telugu Recipe
Click Here for the English Version of this Recipe
- 250 గ్రాములు ప్లెయిన్ నూడుల్స్
- 1 కాప్సికం
- 3 గుడ్లు
- 1 కప్పు క్యాబేజీ తురుము
- 1 tbsp డార్క్ సోయా సాస్
- 1 tbsp వినెగర్
- ½ tsp కారం
- ¼ or ½ tsp మిరియాల పొడి
- 4 tbsp నూనె
- ¼ or ½ tsp సాల్ట్
-
ఒక మందపాటి గిన్నెలో నీళ్ళు పోసి మరిగేవరకు కాయాలి.
-
నీళ్ళు మరగడం మొదలవ్వగానే ఉప్పు వేయాలి.రుచి చుస్తే నీళ్ళు ఉప్పగా అనిపించాలి.
-
నూడుల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా కొద్దిగా నూనె కూడా మరుగుతున్న నీళ్ళలో వేయాలి.
-
తరవాత నూడుల్స్ ను వేసి 3 నుండి 4 నిమిషాలు మరిగించాలి.
-
3 లేదా 4 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి వెంటనే నీళ్ళు వడకట్టేయాలి.
-
నూడుల్స్ ను రన్నింగ్ వాటర్ టాప్ కింద ఒక నిమిషం ఉంచి తీసేయాలి.ఇలా చేయడం వల్ల నూడుల్స్ వేడికి పూర్తిగా ఉడకకుండా ఉంటాయి.
-
ఒక లోతైన మందపాటి కడాయి లో 4 tbsp ల నూనె వేడి చేయాలి.
-
నూనె కాగాక గుడ్లు పగులకొట్టి వేయాలి.
-
అది ఆమ్లెట్ లా మారాక అట్లకాడతో కొడుతూ ముక్కలుగా చేయాలి.
-
తర్వాత క్యాబేజీ తురుము, క్యాప్సికం ముక్కలు వేసి ఒక రెండు నిమిషాల్ పాటు వేయించాలి.
-
కొద్దిగా ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి కలపాలి.
-
డార్క్ సోయా సాస్, వినెగర్ కూడా వేసి పెద్ద మంట మీద వేయించాలి.
-
ఉడికించిన నూడుల్స్ కూడా వేసి బాగా కలపాలి.
-
అన్ని పదార్ధాలు నూడుల్స్ తో కలిసిపోయేలా చక్కగా పెద్ద మంట మీద సెగ వచ్చేలా తిప్పాలి.
-
స్టవ్ కట్టేసి కొద్దిగా ఉల్లిపాయలు, నిమ్మచెక్క తో వేడిగా సర్వ్ చేయాలి.