Maatamanti

Dondakaya Chutney Telugu Recipe-ఆంధ్రా దొండకాయ పచ్చడి

Dondakaya Chutney Telugu Recipe with step by step instructions.English Version.

రోటి పచ్చడి చేయడానికి చాలా మంది ఎక్కువగా టమాటో, బీరకాయ, వంకాయ, గోంగూర లాంటివి వాడుతుంటారు.దొండకాయలు చాలా తక్కువగా వాడతారు.నేను కూడా అరుదుగా చేస్తుంటాను.కానీ దొండకాయ రోటి పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది.ఈ వారం మా పక్క పొలం లో నుండి 2 kg ల తాజా దొండకాయలు తెచ్చుకున్నాము.కొన్నింటితో వేపుడు చేశాను.ఇంకా ఏం చేయొచ్చా అని ఆలోచిస్తుంటే మా అమ్మమ్మ చేసే దొండకాయ రోటి పచ్చడి గుర్తొచ్చింది.వెంటనే చేసేశాను.చాలా టేస్టీ గా ఉంది.మా నానమ్మ అయితే దొందకాయలతో నిలవ పచ్చడి చేస్తుంది.అది చాలా రుచిగా ఉంటుంది.తన దగ్గరకు వెళ్ళినప్పుడల్లా ఆ recipe చెప్పి నా బ్లాగ్ లో పోస్ట్ చేయమంటుంది.కానీ నాకే ఇంత వరకు అది చేయడానికి వీలు పడలేదు.ఈసారి వెళ్ళినప్పుడు ఎలా చేయాలో సరిగ్గా రాసుకొని వచ్చి తొందరలో పోస్ట్ చేస్తాను.

కొన్ని రకాల మిర్చి బాగా కారంగా ఉంటాయి.కొన్నేమో తక్కువ కారంగా ఉంటాయి.కాబట్టి మీరు వాడే మిర్చి రకాన్ని బట్టి మిరపకాయలు సంఖ్య లెఖ్ఖ చూసుకొని వేయాలి.నేను ఈ పచ్చడిలో పల్లీలు, తెల్ల నువ్వులు కూడా వేశాను.మీకు ఇష్టం లేకపోతే వేయనవసరం లేదు.తాలింపు కూడా వేయనవసరం లేదు.వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, దొండకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది.మీరు కూడా ఈ దొండకాయ పచ్చడి recipe ని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.

 

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Tomato Pudina Pachadi Recipe in Telugu
Pandu Mirapakaya Pachadi Andhra Style Recipe in Telugu
Cauliflower pachadi recipe in Telugu
Mushroom Pickle Recipe in Telugu
Andhra Mango Pickle recipe in Telugu
Click here for the English Version of this Recipe.

Dondakaya Chutney Telugu Recipe
Prep Time
15 mins
Cook Time
20 mins
Total Time
35 mins
 
Course: Main Course
Cuisine: Andhra, Hyderabadi
Author: బిందు
Ingredients
చట్నీ కొరకు
  • 250 గ్రాములు దొండకాయలు
  • 50 లేదా 60 గ్రాములు పచ్చిమిరపకాయలు
  • 10 గ్రాములు చింతపండు
  • 1 tsp జీలకర్ర
  • 1 tsp పచ్చి సెనగ పప్పు
  • 4 లేదా 5 రెబ్బలు వెల్లుల్లి
  • 1 tsp మినప పప్పు
  • 2 tbsp పల్లీలు(optional)
  • 1 tsp తెల్ల నువ్వులు(optional)
  • ఉప్పు తగినంత
  • 5 tsp నూనె
  • ¼ కప్పు కొత్తిమీర తరుగు
తాళింపు కొరకు
  • 1 tsp నూనె
  • ½ tsp ఆవాలు
  • ½ tsp జీలకర్ర
  • ½ tsp పచ్చి సెనగ పప్పు
  • 1 ఎండుమిరపకాయ
  • 1 రెమ్మ కరివేపాకు
  • ¼ tsp ఇంగువ
Instructions
శుభ్రం చేయుట & తరుగుట
  1. దొండకాయలను మరియు పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడగాలి.
  2. దొండకాయలను చక్రాలుగా గా, పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
వేయించుట
  1. ఒక బాణలిలో 3 tsp ల నూనె వేసి వేడి చేయాలి.
  2. అందులో జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, మినప పప్పు, పల్లీలు, నువ్వులు వేసి రెండు నిమిషాలు వేయించాలి.
  3. తర్వాత పచ్చి మిర్చి ముక్కలు, చింతపండు కూడా వేసి మిర్చి రంగు మారే వరకు వేయించి వేరే ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
  4. అదే పెనంలో 2 tsp ల నూనె వేసి, దొండకాయ ముక్కలు వేసి 5 నుండి 7 నిమిషాల పాటు వేయించాలి.
గ్రైండ్ చేయుట
  1. మిక్సీలో వెల్లుల్లి రెబ్బలు, వేయించిన పచ్చి మిర్చి & చింతపండు, ఉప్పు వేసి కచ్చాపచ్చా గా రుబ్బాలి.
  2. అందులోనే వేయించిన దొండకాయ ముక్కలు కూడా వేసి 3 నుండి 5 సెకన్ల పాటు రుబ్బాలి.
  3. పచ్చడిని గిన్నెలోకి తీసుకొని కొత్తిమీర తరుగు వేసి కలపాలి.
తాళింపు వేయుట
  1. పెనంలో 1 tsp నూనె వేడి చేసి, అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, ఎండు మిరపకాయ వేసి చిటపటలాడే వరకు వేయించాలి.
  2. తర్వాత కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసి చిటపటలాడక స్టవ్ కట్టేసి పచ్చడిలో తాళింపు వేసి కలపాలి.

Dondakaya Chutney Telugu Recipe Video

[embedyt] https://www.youtube.com/watch?v=0udakRuDZig[/embedyt]

 

Related Post

Please Share this post if you like