Site icon Maatamanti

Drumstick egg tomato curry recipe – మునక్కాడ టమాటో కూర

Drumstick egg tomato curry

Drumstick egg tomato curry recipe with step by step instructions.

ఈ కూర అంటే నాకు చాలా చాలా ఇష్టం.నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఉరిలో ఉన్నప్పుడు ఇది ఎక్కువగా తినేదాన్ని.కూర వండుతున్నప్పుడే నేను వెళ్లి గరిటెతో కొద్ది కొద్దిగా తీసుకొని తినేదాన్ని.మా పెరట్లో పండిన కురగాయలతోనే మా అమ్మమ్మ వండేవారు.అందుకే కూరలు చాలా రుచిగా ఉండేవి.ఎందుకో ఇప్పుడు ఆ రుచి ఉండడం లేదు.రసాయన ఎరువులు వేసి పెంచిన కురగాయాల్లో రుచి ఏముంటుంది చెప్పండి?

వరి కోతల సమయంలో ఇంకా కుప్పలు నూర్చేటప్పుడు, పెద్ద కాగు నిండా అన్నం వండేవారు.ఆ వేడి అన్నం మీద ఉడకబెట్టిన నాటు కోడిగుడ్లు పెట్టేవారు.ఇంకా ఒక రోటి పచ్చడి, నెయ్యి, పప్పు చారు,      నిమ్మకాయ మజ్జిగ, మునక్కాడ టమాటో కూర(ఎక్కువగా ఆ సమయంలో ఇదే చేసేవారు) పెట్టి, పొలంలో పనిచేసే వారికి  ట్రాక్టర్ లో పెట్టి పంపేవారు.నేను కూడా వారికి ఇచ్చి రావడానికి ట్రాక్టర్ లోనే వెళ్ళేదాన్ని.వాళ్ళు పొద్దున్నే పది పదకొండు గంటలకల్లా తినేసేవారు.ఒక్కోసారి నేను వారితో పాటే తినేసేదాన్ని.అరటి ఆకులో పొగలు కక్కే అన్నం తింటుంటే ఎంతో రుచిగా ఉండేది.

నేను ఈ కింద ఇచ్చిన వండే విధానంలో,  టమాటోలను విడిగా ఉడికించి, తోలు తీసి, వాటిని కోసి అప్పటికే ఉడికిపోయిన మునక్కాడల్లో వేసి రెండు నిమిషాల పాటు ఉంచి పొయ్యి కట్టేయాలని చెప్పాను.కానీ మా అమ్మమ్మ అలా వండే వారు కాదు.టమాటోలను ముందుగానే ఉడికించకుండా నేరుగా నూనెలో మగ్గిన మునక్కాడల్లోనే వేసేవారు.ఇప్పటి టమాటోలు అప్పుడప్పుడు గిడసబారినట్లుగా, గట్టిగా, నీరు లేకుండా వస్తున్నాయి.ఎందుకో అవి ఎంతసేపు ఉడికించినా గట్టిగానే ఉంటాయి.అలాంటప్పుడే నేను వాటిని విడిగా ఉడికించి, కూరలో వేస్తాను.కూర దిన్చుకోబోయే ముందు ఒక చెంచాడు నెయ్యి వేస్తే రుచి అమోఘంగా ఉంటుంది.మీరు కూడా ఈ కూరని చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

ప్రాన్స్ బిరియాని తయారు చేయడం ఎలా?
గోంగూర చికెన్ తయారు చేయడం ఎలా?
పెప్పర్ చికెన్ తయారు చేయడం ఎలా?
ఉలవచారు ఇంట్లోనే తయారు చేయడం ఎలా?
పొటాటో ఫ్రై తయారు చేయడం ఎలా?

For English Version of this Recipe Click here

మునక్కాడ టమాటో కూర
Prep Time
20 mins
Cook Time
20 mins
Total Time
40 mins
 
Course: Main Course
Cuisine: Andhra
Ingredients
  • 3 మునక్కాడలు
  • 4 టమాటోలు
  • 3 ఉల్లిపాయలు తరిగినవి
  • 2 పచ్చిమిరపకాయలు
  • ¼ tsp పసుపు
  • 1 ½ tsp కారం
  • 1 tsp ధనియాల పొడి
  • 1 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 1 రెమ్మ కరివేపాకు
  • ¼ కప్ కొత్తిమీర
  • 3 గుడ్లు ఉడికించినవి
  • 3 tbsp నూనె
  • ఉప్పు తగినంత
Instructions
టమాటాలను ఉడికించుట
  1. టమాటాలను శుభ్రంగా కడిగి, 5 నిమిషాల పాటు ఉడికించాలి.
  2. తర్వాత తొక్కు తీసి వాటిని తరగి పక్కన పెట్టుకోవాలి.
కూర వండే విధానం
  1. బాణలిలో 3 tbsp నూనె వేడి చేయాలి.
  2. తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ములక్కాడలు, ఉప్పు వేసి మూత పెట్టి, మునక్కాడ ముక్కలు చక్కగా ఉడికే వరకు వేయించాలి.
  3. మూత తెరిచాక ఒకసారి కలిపి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
  4. పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
  5. ఉడికించి తరిగి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి ఒకసారి కలిపి 5 నిమిషాల పాటు సన్నని సెగ మీద ఉడికించాలి.
  6. ముందే ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసి మరో 2 నిమిషాలు పాటు ఉడికించాలి.
  7. కొత్తిమీర వేసి స్టౌ ఆఫ్ చేయాలి.

Drumstick Egg tomato curry Video

[embedyt] http://www.youtube.com/watch?v=pFS47BZ08BA[/embedyt]

Exit mobile version