Site icon Maatamanti

Dry Fruit Bobbatlu Telugu Recipe-డ్రై ఫ్రూట్ బొబ్బట్లు

dry fruit bobbatlu telugu recipe

Dry Fruit Bobbatlu Telugu Recipe with step by step instructions.English Version.

బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయి.ముఖ్యంగా నేతి తో చేసిన బొబ్బట్లు ఇంకా రుచిగా ఉంటాయి.ఆంధ్రా ప్రాంతంలో అయితే దాదాపు  ప్రతీ పెళ్ళిలోను వేడుకల్లోనూ నేటి బొబ్బట్లు వడ్డిస్తారు.నేనైతే బొబ్బట్టు ముందుగానే తినేసి మళ్ళీ ఇంకొకటి అడుగుతాను.వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించను.తినడానికి మొహమాటం ఎందుకండీ?ఆంధ్రా మరియు తెలంగాణా లోని కొన్ని ప్రాంతాల్లోని స్వీట్ షాపులలో వీటిని అమ్ముతుంటారు.నేను నాకు తినాలనిపించినప్పుడల్లా స్వీట్ షాప్ లోనే కొనుక్కుంటాను.కానీ దేవుడికి నైవేద్యం పెట్టడానికి మాత్రం నేనే తయారు చేసుకుంటాను.

ఈ బొబ్బట్లను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.పూరన్ పోలీ, హోలిగే, ఒబ్బట్టు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు.సాధారణంగా వీటిని తయారు చేయడానికి పచ్చి సెనగ పప్పు, బెల్లం వాడతారు.కొన్ని ప్రాంతాల్లో లోపల వేరు వేరు స్టఫ్ ఉపయోగిస్తుంటారు.

బొబ్బట్లు సరిగ్గా రావాలంటే లోపలి పిండిని సరిగ్గా తయారు చేయాలి.పచ్చి సెనగ పప్పు ను సరిగ్గా ఉడికించాలి.పప్పు ఉడకాలి కానీ మెత్తగా ముద్ద పప్పులా ఉడికించకూడదు.పప్పు పప్పులానే ఉండాలి కానీ చక్కగా ఉడకాలి.పప్పు ఉడకగానే నీటిని పూర్తిగా వంపేయాలి.అప్పుడు పప్పుని మిక్సీ లో వేసినా కూడా జారుగా అవ్వదు.ప్రతీ బొబ్బట్టుని నెయ్యితో కాల్చాలి.కాల్చి పక్కన పెట్టాక కూడా పైన కొద్దిగా నెయ్యి రాయాలి.నేను లోపలి పిండిలో దోరగా వేయించిన  జీడి పప్పు, బాదం పప్పు, పిస్తాపప్పు మరియు పల్లీ పప్పుల పొడిని వేసి కలిపాను.అలా చేస్తే మరింత రుచిగా ఉంటాయి.మీరు కూడా ఈ recipe ని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Dry Fruit laddu Recipe in Telugu
Saggubiyyam Payasam Recipe in Telugu
Poornam Boorelu Recipe in Telugu
Banana Balls Recipe in Telugu
Sorakaya Halwa Recipe in Telugu
Strawberry Rava Laddu Recipe in Telugu

Click here for the English Version of this Recipe.

Dry Fruit Bobbatlu Telugu Recipe
Prep Time
15 mins
Cook Time
1 hr
Total Time
1 hr 15 mins
 
Course: Dessert, Snack
Cuisine: Andhra, Hyderabadi, South Indian
Author: బిందు
Ingredients
పిండి కొరకు
  • 250 మైదా పిండి లేదా గోధుమ పిండి
  • 1/8 కప్పు బొంబాయి రవ్వ
  • చిటికెడు ఉప్పు
  • 2 tbsp నూనె
  • నీళ్ళు తగినంత
మిక్స్చర్ కొరకు
  • 1 కప్పు లేదా 200 గ్రాములు పచ్చిశనగపప్పు
  • 200 బెల్లం తురుము
  • 200 ml నీళ్లు (పాకం కోసం)
  • 15 బాదంపప్పులు
  • 15 పిస్తాపప్పులు
  • 15 జీడిపప్పులు
  • ¼ కప్పు పల్లీలు వేయించి పొట్టు తీసినవి
  • ¼ కప్పు ఎండు కొబ్బరి పొడి(ఆప్షనల్)
  • 3 ఏలకులు
బొబ్బట్ల కోసం
  • 1 ప్లాస్టిక్ షీట్
  • ¼ కప్పు నెయ్యి
Instructions
పిండి కొరకు
  1. మైదా పిండి లేదా గోధుమ పిండిని గిన్నెలోకి తీసుకోవాలి.
  2. అందులో చిటికెడు ఉప్పు, నూనె, కొద్దిగా బొంబాయి రవ్వ వేసి ఒకసారి కలపాలి.
  3. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ మెత్తగా చపాతి పిండిలా కలుపుకోవాలి.
  4. పైన తేమ కోల్పోకుండా కొద్దిగా నూనె రాసి మూత ఉంచి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
పప్పును ఉడికించుట
  1. పప్పు ని శుభ్రంగా కడిగి అంగుళం పైన వరకు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి ఒక మరుగు వచ్చే వరకు ఉడికించాలి.
  2. పప్పు అదే షేప్ లో ఉండాలి కానీ పూర్తిగా ఉడకాలి.మెత్తగా పేస్ట్ లా కాకుండా చూసుకోవాలి.
  3. ఉడకగానే స్టవ్ కట్టేసి నీళ్ళు వార్చేసి పప్పును పక్కన పెట్టుకోవాలి.
పొడి కొట్టుట
  1. జీడి పప్పు, బాదం పప్పు,పల్లీ మరియు పిస్తాపప్పు లను దోరగా వేయించి మిక్సీలో వేసి పొడి కొట్టాలి.
  2. ఉడికించి పెట్టుకున్న పచ్చి సెనగ పప్పును కూడా మిక్సీలో వేసి పొడి కొట్టాలి.
  3. ఏలకులను కూడా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
  4. అన్ని పొడులను ఒకే గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి.
మిక్స్చర్ తయారు చేయుట
  1. ఒక బాణలిలో బెల్లం తురుము, నీళ్ళు పోసి మరిగే వరకు ఉడికించాలి.
  2. మరగడం మొదలవగానే, పైన తయారు చెసి పెట్టుకున్న పప్పుల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి.
  3. మిశ్రమం గట్టిగా ముద్దలా అవగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
బొబ్బట్లు తయారీ
  1. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచుకోవాలి.
  2. ఒక్కో ఉండను మైదా లేదా గోధుమ పిండి మధ్యలో ఉంచి చపాతీ లా ఒత్తుకోవాలి.
  3. పెనంలో 2 tsp ల నెయ్యి వేసి బొబ్బట్లను రెండు వైపులా సమంగా కాల్చుకోవాలి.
  4. కాల్చడం పూర్తవగానే బొబ్బట్టుని ప్లేట్ లోకి తీసుకొని మళ్ళీ పైన కొద్దిగా నెయ్యి రాయాలి

Dry Fruit Bobbatlu Telugu Recipe Video

[embedyt] https://www.youtube.com/watch?v=cKrNyhkUdho[/embedyt]

Exit mobile version