Flax seeds Laddu recipe with step by step instructions.English Version.
నేను మా అమ్మాయికి చిన్నప్పటి నుండి ప్రతిరోజూ ఒక నువ్వుల లడ్డు గానీ ఒక పల్లీ లడ్డూ గానీ ఇస్తున్నాను.ఒక రెండు సంవత్సరాలకు ముందు నాకు ఫ్లాక్స్ సీడ్స్ లేదా అవిసె గింజల గురించి అసలు తెలీదు.అంతకు ముందు వాటి గురించి ఎప్పుడూ వినలేదు.కానీ వాటి గురించి విన్నాక, వాటిలో ఉండే పోషక విలువల గురించి తెలుసుకున్నాక వాటిని కూడా మా రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకున్నాను.నువ్వులు, అవిసెలు, ఎండుమిరపకాయలు కలిపి దోరగా వేయించి పొడి కొట్టి ఆ కారం పొడిని ఉదయం అల్పాహారం లో దోసెలతో, ఇడ్లీ తో లేదా ఉప్మా తో కలిపి తింటుంటాము.
ఆ మధ్య ఒకసారి మా దగ్గరలో ఉన్న స్వీట్ షాప్ కి వెళ్ళినప్పుడు అవిసె&పల్లీ ఉండలు చూసాను.వెంటనే కొన్నాను.అవిసె లడ్డూలు చూడడం అదే మొదటి సారి.ఇంకా అప్పటి నుండి తరచుగా తెచ్చుకుంటూనే ఉన్నాము.కానీ ఈసారి నేనే స్వయంగా ఇంట్లో తయారు చేశాను.బాగా కుదిరాయి.కాకపోతే నేను షాప్ వాళ్ళలా ముదురు పాకంలో అవిసెల పొడి కలిపి లడ్డూలు చుట్టలేదు.అందుకే లడ్డూ చుట్టడం కొంచెం కష్టమనిపించింది.ముదురు పాకంతో చేసిన లడ్డూలు గట్టిగా ఉంటాయి.మా అమ్మాయికి కొన్ని పాల పళ్ళు ఊడుతున్నాయి అందుకే తను అంత గట్టివి తినలేదు.చిన్నపిల్లలు సులువుగా ఇష్టంగా తినాలంటే ఇలా చేస్తేనే మంచిది.
అవిసెలలో మరియు నువ్వులలో ఎన్నో పోషక విలువలుంటాయి.చిన్న పిల్లలు, పెద్దవారు ఎవరైనా వీటిని తీసుకోవచ్చు.కానీ గర్భిణి స్త్రీలు వీటిని తినకూడదు.ఎందుకంటే గర్భిణి స్త్రీలు నువ్వులు తినకూడదని మన పెద్దవారు చెప్తారు కదా.అవిసెలు తినవచ్చో లేదో నాకు సరిగ్గా తెలీదు.నువ్వులలో కాల్షియమ్, ఐరన్, మెగ్నీషియం, కాపర్ వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి.అవిసెలలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది.అవిసెలు బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుటకు ఎంతగానో ఉపయోగపడతాయి.
ఈ లడ్డూలు 10 నుండి 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి.గాలి చొరబడని డబ్బాలో ఉంచితే పాడవకుండా ఎక్కువ కాలం నిలవ ఉంటాయి.ఫ్రిజ్ లో ఉంచితే 2 నుండి 3 నెలల వరకు ఉంటాయి.ఎంతో ఆరోగ్యకరమైన ఈ లడ్డూ లను మీరు కూడా తయారు చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
ఖర్భూజా పుల్ల ఐస్ తయారీ విధానం
Bounty Chocolate recipe in Telugu
Rava laddu with Strawberries recipe in Telugu
Biscuit Cake with Parle-G biscuits recipe in Telugu
Vegetable cutlets recipe in Telugu
Click here for the English Version of the recipe.
- 1 కప్పు లేదా 200 గ్రాములు అవిసెలు
- 1/2 cup లేదా 100 గ్రాములు పల్లీలు
- 1/3 కప్పు 50 గ్రాములు నువ్వులు
- ¾ కప్పు లేదా 175 గ్రాములు బెల్లం
- ¼ కప్పు లేదా 50 గ్రాములు పంచదార
- ¼ కప్పు నెయ్యి
- 3 యాలకులు
- ముందుగా పల్లీలను, నువ్వుల్ని, అవిసెలని ఒకదాని తరువాత ఒకటి వేయించాలి.
- వేయించిన వాటిని చల్లబడే వరకు పక్కన ఉంచుకోవాలి.
- పల్లీల మీద పొట్టు తీసేయాలి.
- ముందుగా అవిసెలని పొడి కొట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
- తరవాత పల్లీలని, నువ్వులను కూడా పొడి చేసి గిన్నెలో వేయాలి.
- ఒక బాణలిలో బెల్లం తరుగు వేసి సన్నని సెగ మీద కరిగేవరకు కలుపుతూ ఉండాలి.
- తరవాత అందులో పంచదార కూడా వేసి కరగనివ్వాలి.
కరగడం మొదలైన వెంటనే పల్లీ, నువ్వులు, అవిసెల పొడి, యాలకుల పొడి, నెయ్యి వేసి అన్నీ సరిగ్గా కలిసేటట్లుగా బాగా కలపాలి.
- స్టవ్ కట్టేసి ఆ మిశ్రమాన్ని కొద్దిగా ఆరనివ్వాలి.కానీ పూర్తిగా అరనివ్వకూడదు.
- అరచేతులకు కొద్దిగా నెయ్యి రాసుకొని, నిమ్మకాయ పరిమాణంలో లడ్డూ మిశ్రమాన్ని తీసుకొని గట్టిగా నొక్కుతూ లడ్డూను చుట్టాలి.
- తడి లేని, గాలి చొరబడని డబ్బాలో లడ్డూలను భద్రపరచుకోవాలి.
Flax seeds Laddu Recipe Video
[embedyt] https://www.youtube.com/watch?v=X7qFu_vE-Wk[/embedyt]
geet says
H, Bindu, Thank you so much for the recipe.
BINDU says
you are welcome…
P jayaram says
omega acids kosam ani ee avisalni daily morning tiifin to teeskuntunna 2 yrs ga nachakapoyina. kaani ee recipe valla naku chala use ayyindi. thank you so much sister. God bless u
BINDU says
ధన్యవాదములు అండీ