ఈ ఆధునిక కాలం లో సమయం తో పోటీ పడుతూ బతుకుతున్నాము. ప్రతీ నిమిషమూ విలువైనదే. బ్రతకాలి అంటే ఒక్కరు పనిచేస్తే సరిపోదు. ఇంట్లో భార్యా భర్త ఇద్దరూ పని చేసి తీరాల్సిందే. ఇది వరకయితే వంట అంటే భార్యకు మాత్రమే పరిమితం. మరి ఇప్పుడు భార్యా భర్తలిద్దరిలో ఎవరికి సమయం దొరికితే వారు ఇంటి పనులు చేస్తున్నారు. అందరికీ మంచి ఆహారం తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి అని ఉంటుంది. కానీ బయట ఆఫీస్ పని చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి కనీసం వండుకు తినే ఓపిక ఉండదు. అలాంటప్పుడు పనిని కాస్త స్మార్ట్ గా చేయడం నేర్చుకోవాలి. అవసరమైన దగ్గర ఖచ్చితంగా కష్టపడాలి. అవసరం లేని దగ్గర తెలివిగా లేదా స్మార్ట్ గా పని చేయాలి.
నేనయితే వంటింట్లో సమయాన్ని వృధా చేయడానికి ఇష్టపడను. అరగంట లేదా గంట అంత కంటే ఎక్కువ సేపు ఉండడానికి ఇష్టపడను. అలా నా పని తేలికగా అయిపోవాలి ఎలా అయినా సమయాన్ని ఆదా చేసుకోవాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు నేను ఇంటర్నెట్ లో వెతికి కొన్ని కిచెన్ గాడ్జెట్స్ కొనుక్కున్నాను. వాటి వల్ల నా పని చాలా త్వరగా అయిపోతుంది. నేను తీసుకున్న వాటి వివరాలు కింద ఇస్తాను చూడండి. అవి నేను లండన్ లో కొనుక్కున్నాను. అలాంటివే మన దేశం లో ఏమున్నాయో వాటి లిస్ట్ కూడా ఇస్తాను. చూడండి.
Kenwood Food Processor
ఇది నేను amazon.co.uk లో కొన్న food ప్రాసెసర్. నేను కొనే ముందు అసలు ఇది ఎందుకు ఉపయోగపడుతుందో చూసి దాని వల్ల నాకు ఉపయోగం ఉంటుందో లేదో చూసుకుని మరీ కొన్నాను. ఈ పైన ఉన్న ప్రాసెసర్ తో పాటుగా ఒక చాపింగ్ బ్లేడ్, గ్రేటింగ్ మరియు స్లైసింగ్ డిస్క్, 2.1 litre బౌల్, 1.2 లీటర్ బ్లెండర్ జార్ వస్తుంది. కూరగాయలు అన్నింటినీ చాపింగ్ బ్లేడ్ సహాయంతో చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు. బ్లెండర్ జార్ లో మనకు కావసినట్లుగా హెల్త్ డ్రింక్స్ లేదా స్మూతీ లు చేసుకోవచ్చు. దీని పవర్ 800 వాట్స్. దీని జార్ ఇంకా బౌల్స్ ని డిష్ వాషర్ లో పెట్టుకోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెల్సుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేయండి.
అచ్చు అలాంటిదే ప్రోడక్ట్ మన ఇండియా లో కూడా ఉందేమోనని వెతికాను. దొరికింది. కొన్ని వేరేవి కూడా ఉన్నాయి వాటి లిస్ట్ ఇస్తున్నాను చూడండి.
4 star రేటింగ్ ఉంది. నలుగురు మాత్రమే రివ్యూ రాశారు. అందులో ఒకరికి జార్ పనిచేయడం లేదు. సెల్లర్ రిటర్న్ తీసుకుని ఇంకొకటి పంపారు ని రాశారు. మిగిలిన ముగ్గురు బాగుంది అని రాశారు. ఈ ప్రాసెసర్ ఉపయోగించి chopping, grating, slicing, shredding, whipping లాంటివి చేసుకోవచ్చు. blending కూడా చేసుకోవచ్చు. స్మూతీస్, జ్యూస్, ప్యూరీ ల్లాంటివి తేలిగ్గా చేసుకోవచ్చు.
Philips Food Processor
ఇది kenwood processor కన్నా తక్కువ పవర్ అంటే. 650 watts మాత్రమే. అయినా కూడా దాని కన్నా కొద్దిగా ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. దీంతో చపాతీ పిండి కలుపు కోవచ్చు. ఇంకా citrus జ్యూస్ extractor కూడా ఉంది. ఆ సిట్రస్ attachment ని బౌల్ మీద పెట్టి దాని మీద బత్తాయి లేదా కమలా సగం చెక్క పెట్టి ఆన్ చేస్తే తేలిగ్గా జ్యూస్ బయటకు వచ్చేస్తుంది. దీనితో పాటు ఇచ్చిన బ్లేడ్స్ కూడా Kenwood కంటే బాగున్నాయి. shredding లో కూడా fine & coarse shredding ఆప్షన్స్ ఉన్నాయి. దొండకాయలు, బీన్స్ లాంటివి కూడా Fine Slicing tool ఉపయగించి చక్కగా కట్ చేసుకోవచ్చు. బెండకాయలు లాంటివి మరీ సన్నగా తరగలేము కదా అలాంటి వాటిని coarse slicing tool తో కట్ చేసుకోవచ్చు. వచ్చిన extra జార్ తో స్మూతీస్ లాంటివి చేసుకోవచ్చు. అయితే గ్రైండింగ్ కి మాత్రము పనికి రాదు. అంటే ఇడ్లీ దోశ లాంటివి రుబ్బడం మాత్రం కుదరదు. మసాలా పొడులు, చట్నీ లాంటివి కూడా కుదరదు. 2 సంవత్సరాల waaranty ఉంది. వారంటీ సమయంలో ఏదైనా సమస్య వస్తే మీకు దగ్గరగా ఉన్న Authorised Philips Service Centre దగ్గరకు తీసుకెళ్లవచ్చు.
అమెజాన్ లో దీనికి 4 స్టార్ రేటింగ్ ఉంది. చాలా మంది కొన్నారు. ఇచ్చిన రివ్యూస్ చదివితే చాలా మందికి డామేజ్ ప్రోడక్ట్ వచ్చింది. అందువల్ల కాస్త రేటింగ్ తక్కువగా ఉంది. సరైన ప్రోడక్ట్ అందుకున్న వారు మాత్రం చాలా ఉపయోగంగా ఉంది బాగుంది అని రాశారు. ఒకవేళ మీరు కొనుక్కోవాలి అనుకుంటే కొద్దిగా అలోచించి కొనుక్కోవాలి. మీకు పొరబాటున డామేజ్ అయిన ప్రోడక్ట్ వస్తే 10 రోజుల్లో దానికి Replacement ఉంటుంది. అంటే దానికి బదులుగా వేరేది పంపిస్తారు. అంతే కానీ వద్దు అనుకుంటే Return చేయడం మాత్రం ఉండదు.
Preethi Zodiac
ఇది కూడా మంచి ఫీచర్స్ ఉన్న ఫుడ్ ప్రాసెసర్. పైన రెండింటి కన్నా ఇంకా కొన్ని ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో మన మాములు మిక్సీలో ఉండేలా చిన్న స్పైస్ మిక్సీ జార్, పిండి రుబ్బుకునే పెద్ద వెట్ గ్రైండింగ్ జార్, చట్నీ జార్ ఉండడమే కాకుండా కూరగాయలు చాప్ చేసుకోవడానికి, మాంసాన్ని కీమా లా చేసుకోవడానికి వీలుగా Master Chef 2.1 litres బౌల్ కూడా ఉంది. chopping, grating, Kneading, Slicing ఆప్షన్స్ ఉన్నాయి. ఇవే కాకుండా జ్యూస్ జార్ కూడా ఉంది. జ్యూస్ extract అవ్వగానే అది బయటకు వచ్చే వీలుగా ఒక టాప్ లా ఉంటుంది ఆ జార్ కి. ఓవర్ లోడ్ అయితే ఇండికేషన్ లైట్ బ్లూ నుండి రెడ్ గా మారుతుంది.
అయితే అన్ని ప్రొడక్ట్స్ కి ఉన్నట్లుగా దీనికి కూడా కొన్ని బాడ్ రివ్యూస్ ఉన్నాయి. ప్లాస్టిక్ కొద్దిగా చీప్ గా ఉంది అని, అట్టా కలిపే బ్లేడ్ కొన్ని రోజులకి విరిగిపోయింది అని ఒకరు, జ్యూస్ జార్ బాగుంది కానీ కొబ్బరి పాలు తీయడానికి పనికి రాదు అని ఇంకొకరు రాశారు. దీనికి 5 సంవత్సరాల వారంటీ ఉంది. డామేజ్ ప్రోడక్ట్ వస్తే 10 రోజుల లోపు మార్చుకోవచ్చు. వద్దు అనుకుంటే తిరిగి తీసుకోరు. ఫస్ట్ టైం వాడినప్పుడు కొద్దిగా కాలిన వాసన వస్తుంది. అది మోటార్ కి వేసిన పెయింట్ మోటార్ తిరిగినప్పుడు వచ్చే వేడి వల్ల వచ్చే వాసన. రెండు సార్లు వాడాక కూడా వాసన అలానే వస్తుంటే అప్పుడు అది మోటార్ ప్రాబ్లెమ్ అని అర్ధం చేసుకోవాలి.
ఈ పైన చెప్పినవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి ఆన్లైన్ లో అవి Usha, Inalsa, Bajaj లాంటి బ్రాండ్స్ ఉన్నాయి కానీ వాటికి ఎందుకో అస్సలు మంచి రివ్యూస్ లేవు. అసలు Inalsa ఫుడ్ ప్రాసెసర్ వీడియో చూసి పరేషాన్ అయిపోయా. అసలది చేయని పనంటూ లేదు. కుదిరితే రాకెట్ కూడా తయారు చేస్తుందేమో అన్నంత ఫీచర్స్ ఉన్నాయి. కానీ అది కొనమని నేను సజెస్ట్ చేయలేను. ఫీచర్స్ బాగున్నాయి కానీ వాడిన మెటీరియల్ చవకగా ఉండడం వల్ల త్వరగా విరిగి పోతుంది చాలా మంది రాశారు రివ్యూస్ లో. Usha ప్రాసెసర్ అయితే చూడడానికి చాలా బాగుంది. స్ట్రాంగ్ గా కూడా ఉంది. చాలా మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి. కానీ ఎందుకో పూర్ రేటింగ్స్ ఉన్నాయి. ఇలాంటివి కొనాలి అనుకుంటే ఆన్ లైన్ లో కన్నా డైరెక్ట్ గా చూసి కొనుక్కోవడం మేలు. కాకపోతే నేను గమనించింది ఏంటి అంటే ఆన్ లైన్ లో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ బయట రిటైల్ మార్కెట్ లో ఏదో ఒక షాప్ కి వెళ్తే దొరకవు. ఒక బ్రాండ్ లో ఏదో ఒకటి రెండు మోడల్స్ మాత్రమే ఉంటాయి.
ఇక బ్లెండర్స్ విషయానికొస్తే
Nutribullet PRO High Speed Blender/Mixer/Smoothie Maker
ఇది నేను పైన చెప్పిన Vonshef బ్రాండ్ బ్లెండర్ లాంటిది.కానీ దాని కన్నా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. కాస్త ఖరీదు ఎక్కువే అయినా వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది అనుకోవచ్చు. నేను వాడేది 220 వాట్స్ అయితే ఇది 900 వాట్స్ అంటే మనం మాములుగా ఇంట్లో పిండి రుబ్బడానికి వాడే మిక్సీల కన్నా పవర్ ఫుల్ అన్నమాట. బాగా హెల్త్ కాన్షియస్ గా ఉండి రోజూ హెల్తీ డ్రింక్స్ చేసుకుని తాగాలి అనుకునే వారికి ఇది బాగా ఉపయోగ పడుతుంది.
దీనితో హెల్త్ డ్రింక్స్, అంటే అంటే స్మూతీ లు, ప్రోటీన్ షేక్స్, జ్యూస్ లాంటివి చేసుకోవచ్చు. డ్రై గ్రైండింగ్ కూడా చేసుకోవచ్చు. గరం మసాలా, కాఫీ బీన్స్ గ్రైండింగ్, కొబ్బరి పొడి లాంటివి చేసుకోవచ్చు అని ఉంది. ఎక్కువ ఫీచర్స్ లేకపోయినా ఉన్న ఫీచర్స్ మాత్రం సమర్ధవంతంగా పని చేస్తాయి. రేటింగ్ 4.6/5 ఉంది. రివ్యూస్ లో కూడా అందరూ చాలా బాగుంది అని రాశారు. సో ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే సందేహించకుండా ఇది కొనుక్కోవచ్చు. 2 సంవత్సరాల వారంటీ కూడా ఉంది.
HESTIA IQ-Blend 1000 Watts Powerful Nutritional Blender
ఇది కూడా పైన బ్లెండర్ లానే చాలా బాగా పనిచేస్తుంది. అదే ఫీచర్స్ ఉన్నాయి. కాకపోతే దీని పవర్ ఇంకా ఎక్కువ. ఇది 1000 వాట్స్. దీని బ్లెండింగ్ బేస్ కి 6 బ్లేడ్స్ ఉన్నాయి. దీనిలో కూడా బ్లెండింగ్ అండ్ డ్రై గ్రైండింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అమెజాన్ ఇమేజ్ లలో చూస్తే ఎవరో పసుపు గ్రైండ్ చేసిన ఫోటో పెట్టారు. అది చూసినప్పుడు అనిపించింది ఇది సూపర్ అని. 4.7/5 రేటింగ్స్ ఉన్నాయి. అందరూ రివ్యూస్ చాలా బాగుందని రాశారు. అందువల్ల ఇది కూడా కొనాలి అనుకుంటే సందేహించకుండా కొనుక్కోవచ్చు. పైన న్యూట్రి బుల్లెట్ కన్నా కూడా ధర తక్కువ. పవర్ ఎక్కువ.
Balzano High-Speed Nutri Blender/Mixer/Smoothie Maker
ఇది పైన రెండు బ్లెండర్స్ కన్నా ఇంకా ఎక్కువ పవర్ ఫుల్ బ్లెండర్. 1200 వాట్స్ పవర్ తో పని చేస్తుంది. ఇది ఇటలీ లో డిజైన్ చేయబడింది. రివ్యూస్ లో రమ్య అని ఒకరు తన ఫొటోస్ షేర్ చేశారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకు తెలిసి తను ఖచ్చితంగా food బ్లాగర్ అయి ఉంటారు. డ్రై గ్రైండింగ్ కూడా పనిచేస్తుంది. మన ఇండియన్ కుకింగ్ కి బాగా పనికొస్తుంది అని రాశారు. తాను దీనితో ఇడ్లీ పిండి, సాంబారు పొడి, చట్నీ లు, స్మూతీస్ చేస్తున్నాను అని రాశారు. దీనికి 4.6/5 రేటింగ్ ఉంది. అందరూ రివ్యూస్ లో చాలా బాగుంది రాశారు.
Wonderchef Nutri-Blend
పర్లేదు బాగా పని చేస్తుంది అనుకునే వాటిలో తక్కువ ధర కలిగినది వండర్ చెఫ్ బ్రాండ్ బ్లెండర్. దీని మీద ఉన్న పూల డిజైన్ వల్లనో ఏమో కానీ నాకు ఇది నచ్చదు. మొత్తం 6 రంగుల్లో వస్తుంది. దీనికి మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి. కొంతమంది బాగుంది అంటారు. కొంతమంది డామేజ్ పీస్ వచ్చింది అనీ, కొంతమంది మోటారు కాలిపోయింది అని రాశారు. ఇది 400 వాట్స్ పవర్ తో పనిచేస్తుంది. రేటింగ్స్ 3.8/5 ఉంది. ఇందులో రెండు మోడల్స్ ఉన్నాయి. రెండవ మోడల్ కూడా కింద ఇస్తున్నాను చూడండి.
Inalsa Hand Blender Robot
ఇది కూడా చాలా ఉపయోగకరమైన వస్తువు. హ్యాండ్ బ్లెండర్ లేదా immersion బ్లెండర్ అని కూడా అంటారు. మనం వేడిగా ఉన్న పదార్ధాన్ని డైరెక్ట్ గా మిక్సీ లో వేసి తిప్పలేము. ఈ బ్లెండర్ ఉంటే స్టవ్ మీద ఉడుకుతుండగానే గిన్నెలో పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. చూడడానికి చిన్నగా ఉన్నా చాలా బాగా పనిచేస్తుంది. దీనితో వేడిగా ఉన్న పప్పు ని మెత్తగా రుబ్బినట్లు చేసుకోవచ్చు. ఉడికించిన కూరగాయల్ని మాష్ చేసుకోవచ్చు. మయోన్నైస్ లాంటివి కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంకా రోటి పచ్చళ్ళు అంటే ఇష్టపడే వారికి కూడా ఇది బాగుంటుంది. మనం పచ్చడిని మిక్సీలో లో వేసి రుబ్బితే మెత్తగా పేస్ట్ లా అయిపోతుంది. రోట్లో అయితే కొద్దిగా బరక బరకగా ఉండి రుచిగా ఉంటుంది. ఆలా పచ్చడి రోట్లో నూరి నట్లుగా బరకగా రావాలి అంటే ఇది బాగా పనికొస్తుంది. కావాలంటే మెత్తగా కూడా రుబ్బుకోవచ్చు కానీ కాస్త బరకగా ఉన్నప్పుడే ఆపేసే ఆప్షన్ ఉంటుంది. నాకయితే ఇది పర్సనల్ గా చాలా నచ్చుతుంది. నేను వాడే బ్రాండ్ వేరేది. మన ఇండియా లో అయితే ఇది బాగుంది. దీనికి 4.4/5 రేటింగ్ ఉంది. రివ్యూస్ కూడా బాగుంది అని రాశారు.
కొద్దిగా తక్కువ ధరలో orpat కూడా ఉంది. దీనికి 4.1/5 రేటింగ్స్ ఉన్నాయి. ఇందులో వేరే ఎక్స్ట్రా అట్టాచ్మెంట్స్ ఏమి లేవు. చాపింగ్ లాంటి ఒప్షన్స్ లేవు. కానీ ఏదైనా వేడిగా ఉన్నప్పుడు మెత్తగా రుబ్బాలి అన్నా గ్లాస్ లో అన్నీ పదార్ధాలు వేసి స్మూతీస్ లాంటివి చేసుకోవాలి అన్నా ఇవి బాగా పనికొస్తాయి. రెండు మూడు గిన్నెలు మార్చాల్సిన పని లేకుండా ఉంటుంది. చట్నీ కోసం కూరగాయల్ని వేయించాక ఈ గిన్నెలో అయితే చట్నీ పెడుతామో అదే గిన్నెలోకి ముక్కల్ని మార్చేసి అందులోనే దీనితో గ్రైండ్ చేసుకోవచ్చు. ఏ గ్లాస్ లో అయితే జ్యూస్ తాగుతామో అదే గ్లాస్ లో ఫ్రూట్ ముక్కల్ని వేసి నీళ్లు పోసి ఇది గ్లాస్ లో పెట్టి గ్రైండ్ బ్లెండ్ చేసి తాగొచ్చు.
దీంట్లో చాపింగ్ బౌల్ విత్ చాపింగ్ అటాచ్మెంట్ ఉంది. whisking అటాచ్మెంట్ కూడా ఉంది. 2 స్పీడ్ సెట్టింగ్ ఉన్నాయి. variable స్పీడ్ కంట్రోల్ కూడా ఉంది. నేను వాడేది కూడా కొద్దిగా ఇలానే ఉంటుంది. Food Processors and Blenders video Part-2 lo దీని గురించి చూపిస్తాను.
ఇవన్నీ మన దగ్గర ఉన్న వాటిలో నాకు మంచిగా అనిపించిన కిచెన్ గాడ్జెట్స్ లిస్ట్. మీరు ఏదైనా కొనుక్కోవాలి అంటే బాగా పరిశీలించి రివ్యూస్ చదివి కొనుక్కోవాలి. ఇక్కడ నేను చేసిందల్లా ఏమిటి అంటే మీ వెతికే సమయాన్ని తగ్గించడం. అయినా సరే మన దగ్గరకు ఆ ప్రోడక్ట్ వచ్చి మనం వాడడం మొదలు పెట్టే వరకు మనకు అంతా కన్ఫ్యూషన్ గానే ఉంటుంది. నిజం చెప్పాలి అంటే ఇలాంటివి కాస్త రిస్క్ చేసి కొనాలి. 4.5/5 రేటింగ్స్ ఉన్న వాటి గురించి ఎక్కువ సందేహించనవసరం లేదు. కొనుక్కోవచ్చు. కొన్ని వస్తువులు 5/5 రేటింగ్ ఉంటాయి. కానీ ఏ ఇద్దరో ముగ్గురో మాత్రమే ఆ రేటింగ్ ఇచ్చినట్లు ఉంటుంది. అలాంటివి కూడా కొనకూడదు. సరే ఇప్పటికైతే ఇంతే. తర్వాత ఇంకా ఏదైనా కొత్తగా వస్తే ఈ పోస్ట్ ను అప్డేట్ చేస్తాను. ధన్యవాదములు.