Maatamanti

Garlic Paneer Telugu Recipe-గార్లిక్ పనీర్ తయారీ విధానం

Garlic Paneer Telugu Recipe with step by step instructions.English Version.

ఎప్పుడైనా సాయంత్రం బాగా ఆకలినిపించినప్పుడు లక్కీ గా ఇంట్లో ఆ సమయానికి పనీర్ ఉంటే ఎంచక్కా ఈ గార్లిక్ పనీర్ చేసుకోవచ్చు.మా ఆయన ఒకసారి Novotel hotel కి వెళ్ళినప్పుడు ఈ recipe ని ఫస్ట్ టైం టేస్ట్ చేసారు.తనకి బాగా నచ్చి నాకు చెప్పారు.ఆ నెక్స్ట్ డే నేను దీన్ని తయారు చేసాను.చాలా బాగా కుదిరింది.కానీ ఒక పీస్ తినగానే కడుపు నిండిపోయింది.ఇంకా నైట్ డిన్నర్ కూడా తినలేకపోయాను.మొత్తం 200 గ్రాముల పనీర్ ఉపయోగించి తయారు చేసాను.4 పీస్ లుగా డివైడ్ చేసి చేసాను.ఒక ముక్క 50 గ్రాములు ఉంటుంది.ఒక మనిషి కి 50 గ్రాములు కరెక్ట్ సర్వింగ్ సైజు.అంతకన్నా ఎక్కువ తినకపోవడమే మంచింది.

పనీర్ ముక్కల్ని మారినేట్ చేసే ముందు, 5 నుండి 7 నిమిషాల పాటు వెచ్చని నీళ్ళల్లో ఉంచితే మెత్తబడి, పట్టించిన మసాలాని చక్కగా పీల్చుకుంటాయి.అలా చేయకుండా వండితే పైన మాత్రమే గార్లిక్ టేస్ట్ లో ఉండి లోపల ఉదికించని పనీర్ టేస్ట్ లానే ఉండిపోయే అవకాశం ఉంది.పనీర్ ని మరీ ఎక్కువ సేపు వేయించినా కూడా గట్టిగా అయిపోయే అవకాశం ఉంది.అందుకే 5 నుండి 7 ననిమిషాలు మాత్రమే వేయించాలి.రుచికరమైన ఈ స్నాక్ ఐటెమ్ ను మీరు కూడా తయారు చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Vegetable cutlets recipe in Telugu
Banana Balls Recipe in Telugu
Masala Vada Recipe in Telugu
Onion Murukulu Recipe in Telugu
Flax seeds Laddu Recipe in Telugu

Click here for the English Version of this Recipe. 

Garlic Paneer Telugu Recipe
Prep Time
30 mins
Cook Time
20 mins
Total Time
50 mins
 
Course: Appetizer, Snack
Cuisine: Indian
Servings: 4
Author: బిందు
Ingredients
  • 200 గ్రాములు పనీర్
  • 1 tsp కార్న్ ఫ్లోర్
  • ¼ tsp మిరియాల పొడి
  • ½ tsp కారం
  • ఉప్పు తగినంత
  • 1 tsp వెల్లుల్లి పేస్ట్
  • 1 tsp రెడ్ చిల్లీ సాస్
  • ¼ tsp డ్రై ఆరిగానో
  • 25 గ్రాములు బటర్
Instructions
  1. పనీర్ ను మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  2. ఒక మిక్సింగ్ బౌల్ లో కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి, కారం, తగినంత ఉప్పు, వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ సాస్, డ్రై ఆరిగానో వేసి కలపాలి.
  3. తర్వాత కొద్దిగా నీరు పోసి పేస్టులా కలుపుకోవాలి.
  4. పనీర్ ముక్కలు అందులో వేసి, పేస్ట్ ను ముక్కలకు బాగా పట్టించి 15 నుండి 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
  5. ఒక పెనంలో వెన్న వేసి కరిగించాలి.అందులో నానబెట్టిన పనీర్ వేసి సన్నని సెగ మీద 5 నిమిషాల పాటు రెండు వైపులా వేయించాలి.
  6. మళ్ళీ ఒక 3 నిమిషాల పాటు రెండు వైపులా వేయించి స్టవ్ కట్టేయాలి.

Garlic Paneer Telugu Recipe Video

Related Post

Please Share this post if you like