Gobi Biryani Telugu Recipe with step by step instructions.English Version.
శాఖాహారులు బిర్యానీ తినాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.మిక్స్డ్ వెజిటెబుల్ బిర్యానీ చేసుకోవాలనుకుంటే ఆ సమయానికి అన్ని కూరగాయలు ఇంట్లో ఉండవచ్చు ఉండకపోవచ్చు.అలాంటప్పుడు ఇలా క్యాలిఫ్లవర్ తో బిర్యానీ చేసుకుంటే బాగుంటుంది.కార్తీకం, శ్రావణం లాంటి పవిత్రమైన మాసాలలో చాలా మంది మాంసాహారులు కూడా బిర్యానీల జోలికి పోరు ముట్టుకోరు.మనం తినకుండా ఉండగలం కానీ పిల్లల్ని ఎలా ఆపగలం చెప్పండి.అలాంటప్పుడు వాళ్లకు ఇలా వెజ్ బిర్యానీ చేసి పెట్టవచ్చు.రుచిలో మామూలు చికెన్ బిర్యానీ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది.తయారీ విధానం కూడా దాదాపు ఒకటే.
కాకపోతే క్యాలిఫ్లవర్ ముక్కలను ముందుగా కాసేపు ఉడకపెట్టవలసి ఉంటుంది.క్యాలిఫ్లవర్ వాసన బాగుండదు.ఉడకపెట్టడం వల్ల ఆ వాసన పోతుంది.పురుగులు, పురుగు మందు ల యొక్క ఆనవాళ్ళు లేకుండా పోతాయి.ముక్కలు మృదువుగా మారి బిర్యానీ వండాక బాగుంటాయి.మరీ మెత్తగా అయ్యేవరకు ఉడికించకూడదు.సరిగ్గా 3 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది.స్టవ్ కట్టేయగానే మూత తెరవకుండా ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచి తర్వాత వడ్డించాలి.ఈ టేస్టీ గోబీ బిర్యానీ మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Chicken Biryani Recipe in Telugu
Ulavacharu Biryani Recipe in Telugu
Fish Biryani Recipe in Telugu
Prawns Pulao Recipe in Telugu
Chicken Tikka Pulao Recipe in Telugu
Mutton Biryani Recipe in Telugu
Hyderabadi Prawns Biryani Recipe in Telugu
Click here for the English Version of the Recipe
- 250 గ్రాములు క్యాలిఫ్లవర్
- 500 ml నీళ్ళు
- 3 లవంగాలు
- 2 ఏలకులు
- ½ ముక్క జాపత్రి
- 1 tsp షాహీ జీర
- 1 అంగుళం దాల్చినచెక్క
- ½ ముక్క అనాస పువ్వు
- 4 లేదా 5 రేకులు బిర్యానీ పువ్వు
- 250 గ్రాములు బాస్మతి బియ్యం
- 1 లీటరు నీళ్ళు
- అన్ని గరం మసాలా దినుసులు
- 1 బిర్యానీ ఆకు
- ఉప్పు తగినంత
- ½ tsp పసుపు
- 2 tsp కారం
- 1 tsp నిమ్మ రసం
- 1 ½ tsp బిర్యానీ మసాలా
- 2 tsp పచ్చి మిర్చి తరుగు
- 1 tbsp అల్లంవెల్లుల్లి పేస్ట్
- 2 tsp నెయ్యి
- ¾ కప్పు పుదీనా
- ¼ వేయించిన ఉల్లిపాయలు
- 1 కప్పు పెరుగు
- 3 tsp నూనె
- 2 tsp నెయ్యి
- ¼ కప్పు పుదీనా
- 1/8 కప్పు వేయించిన ఉల్లిపాయ
- గిన్నెను కవర్ చేయడానికి అల్యూమినియం ఫాయిల్
- క్యాలిఫ్లవర్ ముక్కల్ని ఒక 10 నిమిషాల పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టి కడిగి పక్కన ఉంచుకోవాలి.
- మరుగుతున్న నీళ్ళలో క్యాలిఫ్లవర్ ముక్కల్ని వేసి 3 నిమిషాల పాటు ఉడికించి పొయ్యి కట్టేసి నీళ్ళు వంపేసి పక్కన పెట్టుకోవాలి.
- షాహీ జీరా, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, అనాస పువ్వు, బిర్యానీ పూలు మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
- బియ్యం నానబెట్టుట
- బాస్మతి బియ్యంలో నీళ్ళు పోసి 30 నిమిషాల పాటు నానబెట్టాలి.వండే ముందు 2 నుండి 3 సార్లు కడగాలి.
- ఒక మిక్సింగ్ బౌల్ లో ఉప్పు, కారం, పసుపు, బిర్యానీ మసాలా, అల్లంవెల్లుల్లి పేస్ట్, నిమ్మ రసం, వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, పెరుగు వేసి బాగా కలపాలి.
- ఉడకపెట్టిన క్యాలిఫ్లవర్ ముక్కలు కూడా వేసి బాగా కలిపి 30 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి.
- ఒక గిన్నెలో లీటరు నీళ్ళు పోసి, అన్ని గరం మసాలా దినుసులు, కొన్ని పుదీనా ఆకులు, తగినంత ఉప్పు, బిర్యానీ ఆకు వేసి పొయ్యి మీద పెట్టి మరిగే వరకు కాయాలి.
- మరగడం మొదలవగానే నానబెట్టిన బియ్యం వేయాలి.బియ్యం వేయగానే నీరు మరగడం ఆగిపోతుంది అందుకే మళ్ళీ మరిగించాలి.
- మరగడం మొదలవగానే సరిగ్గా 3 నిమిషాలు ఉడికించి పొయ్యి కట్టేసి వెంటనే నీళ్ళు వార్చేయాలి.
- ఒక మందపాటి పాత్రలో 3 tsp ల నూనె వేసి ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న క్యాలిఫ్లవర్ మిశ్రమాన్ని వేయాలి.
- దాని పైన సగం ఉడికిన అన్నం వేసి సమానంగా పరచాలి.
- పైన కొన్ని పుదీనా ఆకులు, కొద్దిగా నెయ్యి, వేయించిన ఉల్లిపాయలు వేసి గిన్నెను అల్యూమినియం ఫాయిల్ తో మూసేసి స్టవ్ మీద పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించాలి.
- స్టవ్ కట్టేశాక ఒక 15 నిమిషాలు మూత తెరవకుండా ఉంచి తరవాత వడ్డించాలి.
Gobi Biryani Telugu Recipe Video
[embedyt] https://www.youtube.com/watch?v=v5z2zuOcAB4[/embedyt]
Leave a Reply