Goddukaram Telugu recipe with step by step instructions.English Version.
గొడ్డు కారాన్నే ఇంగ్లీష్ లో చిల్లీ ఫ్లేక్స్ అంటారు.కాకపొతే వారు ఎండు మిరపకాయల్నే కచ్చాపచ్చా గా పొడి కొట్టి seasoning గాను లేదా పాస్తా, సూప్ ఇంకా పిజ్జా లాలో వేస్తుంటారు.కానీ మన చిల్లీ ఫ్లేక్స్ లేదా గొడ్డు కారం వేరే.దీనిని ఎక్కువగా ఆంధ్రా ప్రాంతాలలో తయారు చేస్తారు.
గొడ్డు కారాన్ని ఎండు మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా పొడి కొట్టి తయారు చేస్తారు.ఈ కారాన్ని బెండకాయ, దొండకాయ, చిక్కుడుకాయ, గోరు చిక్కుడుకాయ వేపుళ్ళు చేసేటప్పుడు మామూలు కారానికి బదులు వాడతారు.ఈ కారాన్ని ఒక్కసారే ఎక్కువ తయారు చేసుకునే బదులు కొద్ది కొద్దిగా తయారు చేసుకోవడం మంచిది.కరివేపాకు మరియు వెల్లుల్లి లలో సహజంగా ఉండే తడి వల్ల బూజు రావొచ్చు.అందుకే కొద్ది కొద్ది పరిమాణంలో మాత్రమే చేసుకుంటే మంచిది.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Palli Karam Dosa Recipe in Telugu
Ulli Karam Dosa Recipe
Mamidi Allam Pachadi Recipe in Telugu
Pandu Mirpakaya Pachadi Recipe in Telugu
Andhra Mamidikaya Pachadi Recipe in Telugu
Cauliflower Pachadi Recipe in Telugu
Click here for the English Version of this Recipe
- 10 ఎండు మిరపకాయలు
- 1 tsp జీలకర్ర
- 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు
- 1 రెమ్మ కరివేపాకు
-
పైన చెప్పిన పదార్ధాలన్నింటినీ చక్కని సువాసన వచ్చే వరకు నూనె లేకుండా వేయించాలి.
-
ఎండు మిరపకాయలు కర కరలాడేలా వేయించాలి.
-
స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఆరనిచ్చి మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చా గా పొడి చేయాలి.
గాలి చొరబడని డబ్బాలో ఈ పొడిని నిల్వ చేసుకోవాలి. ఈ కారం పొడిని బెండకాయ వేపుడు, బెండకాయ వేపుడు, గోరు చిక్కుడుకాయ వేపుడు వంటి వాటిల్లో వేస్తే చాలా రుచిగా ఉంటుంది.
Goddukaram Telugu Recipe Video
[embedyt] https://www.youtube.com/watch?v=gcQZv_Q9KhQ[/embedyt]