Grape Soda Telugu Recipe with step by step instructions.English Version.
వేసవి వచ్చిందంటే చాలు అసలు తిండి మీద ధ్యాసే ఉండదు.ఆ టైం కి ఏదో కాస్త తినేసి భోజనం అయిందనిపిస్తాం.అదే చల్లని జ్యూస్ లు మజ్జిగ లాంటివైతే కాస్త తీసుకోవాలనిపిస్తుంది.వేసవి లో ద్రవ పదార్ధాలు ఎంత తీసుకుంటే అంత మంచిది.మంచిది అన్నాం కదా అని అదే పనిగా పంచదార కలిపిన జ్యూస్ లు తీసుకోవడం, ఉప్పు కలిపిన మజ్జిగ తాగడం అంత మంచిది కాదు.అవి లేకుండా తీసుకుంటే మంచిది.
ఇక ఈ గ్రేప్ సోడా విషయానికొస్తే, సీడ్ లెస్ ద్రాక్ష తీసుకోవాలి.ద్రాక్షాలను నీళ్లలో వేసి మరిగించాలి.స్టవ్ కట్టేశాక పూర్తిగా చల్లబడే వరకు ఆగి తర్వాత మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి.ఆ చిక్కని జ్యూస్ ని తడి లేని శుభ్రమైన జార్ లో పోసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.అవసరమైనప్పుడు తీసి వాడుకోవాలి.ఈ గ్రేప్ జ్యూస్ కొన్ని రోజులు అంటే సుమారుగా ఒక రెండు వారాలు నిలవ ఉంచితే అచ్చు వైన్ లా ఉంటుంది.పులియడం లేదా ఫెర్మెంట్ అవడం వల్ల దీని రుచి వైన్ లా మారుతుంది.నేను జ్యూస్ లో సోడా వేసి తయారు చేశాను.సోడా కాకుండా మామూలు గా చల్లని వాటర్ పోసి కూడా తయారు చేసుకోవచ్చు.మీరు కూడా ఈ చల్లని డ్రింక్ ని తయారు చేసి టేస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
- 300 గ్రాములు ద్రాక్ష గింజలు లేనివి
- 400 ml నీళ్ళు
- ¼ కప్పు పంచదార
- ½ చెక్క నిమ్మకాయ
- 250 ml సోడా వాటర్
- 6 నుండి 7 ఐస్ క్యూబ్స్
- 1 రెమ్మ పుదీనా ఆకులు
- 1 నిమ్మకాయ చక్రంలా కట్ చేసినది
-
సాస్ పాన్ లో నీళ్ళు పోసి, ద్రాక్ష పళ్ళు కూడా వేయాలి.
-
మరిగే వరకు ఉడికించాలి.
-
మరగడం మొదలవగానే పంచదార వేసి బాగా కలపాలి.
-
పంచదార గడ్డ కట్ట కుండా ఉండేందుకు కొద్దిగా నిమ్మ రసం పిండాలి.
-
15 నుండి 20 నిమిషాలు ఉడికించాక పొయ్యి కట్టేసి పూర్తిగా చల్లబడనివ్వాలి.
-
తర్వాత ఆ మొత్తాన్ని మిక్సీలో వేసి మెత్తగా జ్యూస్ చేసి ఒక తడిలేని శుభ్రమైన జార్ లో పోసి ఫ్రిజ్ లో భద్రపరచుకోవాలి.కావాల్సినప్పుడల్లా తీసి ఉపయోగించవచ్చు.
-
ఒక గ్లాస్ లో ఐస్ క్యూబ్స్ వేసి అందులో కొద్దిగా లేదా మీ రుచికి తగ్గట్టుగా గ్రేప్ జ్యూస్ వేసుకోవాలి.
-
సోడా నీళ్ళు పోసి నిమ్మ చెక్క కూడా వేయాలి.
-
పుదీనా ఆకులతో అలంకరించి చల్లగా సర్వ్ చేయాలి.
Grape Soda Telugu Recipe Video
[embedyt] https://www.youtube.com/watch?v=kGM4JKqCFCI[/embedyt]