Hyderabadi Veg Haleem recipe with step by step instructions.English Version.
Hyderabadi veg haleem recipe చాలా పాపులర్ వంటకం.రంజాన్ ముస్లిమ్ సోదరులకు పవిత్రమైన మాసం.పగలంతా నిష్టగా రోజా పాటించి సాయంత్రం ఇఫ్తార్ లో ఆహారాన్ని తీసుకుంటారు.పొద్దున్నుండి ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎంతైనా నీరసంగా ఉంటుంది.అందుకే వారు ఇఫ్తార్ లో మంచి పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుంటారు.రకరకాల పండ్లు, వెంటనే శక్తినిచ్చే ఖర్జూరాలు, అంజీర వంటివి తీసుకుంటారు.హలీమ్ లో కూడా మంచి పోషక విలువలున్నాయి.పప్పు ధాన్యాలు,మాంసం వేసి వండడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి వెంటనే సమకూరుతుంది.
హలీమ్ ని ముస్లిమ్ లైనా అంతగా తింటారో లేదో కానీ, మిగతావారందరూ శుభ్రంగా లాగించేస్తారు.రంజాన్ వారికే కాదు అందరికీ పండుగే.ఈ మాసంలో మేము కనీసం 10 సార్లైనా హలీం తింటాము.పిస్తా హౌస్ హలీం చాలా బాగుంటుంది.హలీం ని తయారు చేసేవారు ఎన్నో గంటలు కష్టపడి ఓపిగ్గా తయారు చేస్తారు.కానీ నామమాత్రంగా డబ్బు తీసుకుంటారు.వారు పడే కష్టానికి అది నిజంగా తక్కువే.ఈ పవిత్ర మాసంలో నేను కనీసం ఒకసారైనా హలీం తయారు చేస్తాను.ఇంతకుముందు చాలా సార్లు చికెన్ ఇంకా మటన్ హలీమ్ తయారు చేసాను.కానీ వెజ్ హలీం ఎప్పుడూ తయారు చేయలేదు.శాకాహారులకూ కూడా హలీం రుచి తెలియాలి.అందుకే నేను ఈ హలీం ని తయారు చేసాను.పిస్తా హౌస్ వాళ్ళైతే వెజిటేరియన్ హలీం కూడా తయారు చేస్తారు.
వెజ్ హలీం కాబట్టి కూరగాయలు వేసి తయారు చేసాననుకుంటే పొరబాటే.నేను సోయా గ్రాన్యూల్స్ ని ఉపయోగించి దీనిని తయారు చేసాను.చాలా బాగా కుదిరింది.అచ్చు మటన్ హలీమ్ లానే ఉంది.ఇది శాకాహారులకు నిజంగా విందే.మాంసాహారం తినేవారికి చెపితే తప్ప అది వెజ్ హలీం అని గుర్తించలేరు.హలీం ని హైదరాబాద్ లో తయారు చేసినంతగా వేరే దగ్గర తయారు చేయారు.హలీం అందుబాటులో లేక ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకునే వారికోసమే ఈ recipe.
ఇక ఈ వంటకం విషయానికొస్తే ingredients చాలా ఎక్కువగా ఉండడం వల్ల తయారీ కష్టమేమో అనిపిస్తుంది.కానీ చాలా సులువు.ముందు ఒక్క సోయా తప్ప అన్ని పదార్ధాలు కలిపి పొడి చేసి నీళ్ళలో కలిపి పక్కన పెట్టుకోవాలి.తర్వాత సోయా గ్రాన్యూల్స్ ని ఉడికించాలి.ఉడికించిన తర్వాత రెండు మూడు సార్లు గట్టిగా పిండుతూ కడగాలి.లేకపోతే వాసన వస్తాయి.1 కప్పు ఉడికించినవి కావాలంటే 1/2 కప్పు గ్రాన్యూల్స్ తీసుకుంటే సరిపోతుంది.ఒకవేళ సోయా గ్రాన్యూల్స్ లేకపోతే సోయా నగ్గెట్స్ కూడా వాడవచ్చు.వాటినే మీల్ మేకర్ అని కూడా అంటారు.కాకపొతే వాటిని ఉడికించాక మిక్సీలో వేసి కాస్త రుబ్బుకుంటే సరిపోతుంది.ఈ రేసిపి కి సర్వింగ్ కూడా చాలా ముఖ్యం.దీన్ని వేడిగా తింటేనే బాగుంటుంది.చక్కగా పైన 2 స్పూన్ ల నెయ్యి, నేతిలో వేయించిన జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర, నిమ్మచెక్క వేసి సర్వ్ చేయాలి.ఎంతో రుచికరమైన ఈ వెజ్ హలీమ్ ను మీరు కూడా తయారు చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Hyderabadi Style Mutton Dalcha Recipe in Telugu
Chicken Tikka Pulao Recipe in Telugu
Andhra Chicken Fry Recipe in Telugu
Fish Biryani Recipe in Telugu
Hyderabadi style Prawns Biryani in Telugu
Pepper Chicken Recipe in Telugu
Click here for the English version of the Recipe
- 1/3 కప్పు సన్న గోధుమ రవ్వ
- ¼ కప్పు ఓట్స్
- ½ tbsp కందిపప్పు
- ½ tbsp పచ్చిశనగపప్పు
- 6 బాదం పప్పులు
- 6 జీడి పప్పులు
- 6 పిస్తా పప్పులు
- ¼ కప్పు ఎండు గులాబీ రెక్కలు
- 6 లవంగాలు
- 6 యాలుకలు
- 1 tbsp మిరియాలు
- 2 inch దాల్చినచెక్క
- ½ tsp షాజీరా
- ½ tsp జీలకర్ర
- 500 ml నీళ్ళు
- ½ కప్పు సోయా గ్రాన్యూల్స్
- 1 ½ కప్పు నీళ్ళు
- ఉప్పు తగినంత
- ½ కప్పు కొత్తిమీర తరుగు
- ½ కప్పు పుదీనా
- 1/3 కప్పు వేయించిన ఉల్లిపాయలు
- 5 పచ్చిమిరపకాయలు
- 1 tbsp అల్లంవెల్లుల్లి ముద్ద
- ½ కప్పు నెయ్యి
- 1 tbsp కిస్మిస్
- 1 tbsp గరమ్ మసాలా దినుసులు అన్నీ కలిపి
- ఉప్పు సరిపడా
- 1 tbsp నెయ్యి
- ¼ కప్పు వేయించిన జీడిపప్పు
- ¼ కప్పు వేయించిన ఉల్లిపాయలు
- ¼ కప్పు పుదీనా
- ¼ కప్పు కొత్తిమీర
- 1 నిమ్మకాయ
- గోధుమ రవ్వ, ఓట్స్, కందిపప్పు, పచ్చిశనగపప్పు, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తాపప్పు, లవంగాలు, యాలుకలు, దాల్చినచెక్క, మిరియాలు, షాజీరా, జీలకర్ర మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి.
- ఆ పొడిలో అర లీటరు నీళ్ళు పోసి బాగా కలిపి కాసేపు నాననివ్వాలి.
- సోయా గ్రాన్యూల్స్ ని ఉడికించుట.
- ఒక గిన్నెలో సోయా గ్రాన్యూల్స్ వేసి రెండు మూడు సార్లు కడగాలి.తర్వాత అందులో నీళ్ళు పోసి 3 నిమిషాల పాటు మరిగించాలి.
- తర్వాత నీళ్ళు ఓంపేసి రన్నింగ్ టాప్ కింద పెట్టి సోయా గ్రాన్యుల్స్ ని బాగా కడగి నీళ్ళు లేకుండా గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి.
- ఒక మందపాటి పాత్రలో నెయ్యి వేసి కరిగించాలి.
- అందులో 4 లవంగాలు, యాలుకలు, కిస్మిస్, దాల్చినచెక్క, మిరియాలు వేసి ఒక నిమిషం వేయించాలి.
- తర్వాత బ్రౌన్ ఆనియన్స్, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉడికించిన సోయా గ్రాన్యూల్స్, తగినంత ఉప్పు వేసి ఒక రెండు నిమిషాలు వేయించాలి.
- తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న హలీం మిక్స్ ను అందులో పోయాలి.
- ½ లీటరు నీళ్ళు పోసి బాగా కలిపి ఉప్పు సరిచూసుకోవాలి.
- పుదీనా మరియు కొత్తిమీర వేసి మూత పెట్టి సన్నని సెగ మీద 20 నుండి 25 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ కట్టేసుకోవాలి.
- ఒక ప్లేటులో 2 నుండి 3 గరిటెల హలీమ్ వేసి అందులో 1 tbsp నెయ్యి వేయాలి.
- పైన వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, నిమ్మ చెక్క ఉంచి వేడిగా సర్వ్ చేయాలి.
Hyderabadi veg haleem recipe Video
[embedyt] https://www.youtube.com/watch?v=tIAYwYb4ByE[/embedyt]
Ali says
Hi Bindu
Awesome
Recepi Chala bagundi, thanks