Instant Rava Vada Telugu Recipe with step by step instructions.English Version.
నోరూరించే రుచి కరమైన వడలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.వింటేనే నోట్లో నీళ్ళూరతాయి.కానీ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలంటేనే కష్టం.కొత్తగా వంట చేయడం మొదలు పెట్టిన వారికయితే అది కలలోని మాటే.అలాంటి వారి కోసమే ఈ సులువైన వంటకం.బొంబాయి రవ్వతో చేసే ఈ గారెలు రుచిలో మామూలు గారెలకు ఏమాత్రం తీసిపోకుండా సూపర్ టేస్టీ గా ఉంటాయి.
కానీ ఈ గారెలు సరిగ్గా రావాలంటే మాత్రం పిండిని సరిగ్గా కలపాలి.పిండి తడవడం కోసం పెరుగు, కొద్దిగా నీళ్ళు వేసి కలపాలి.కలపగానే గారెలు వేయకుండా ఒక 15 నుండి 20 నిమిషాలు పక్కన ఉంచితే బొంబాయి రవ్వ తడిని పీల్చుకుంటుంది.అప్పుడు పిండి కొంచెం గట్టిపడుతుంది.అలానే గారెలు వేసేస్తే వేయించాక గట్టిగా ఉంటాయి.కాబట్టి మళ్ళీ కొద్దిగా నీళ్ళు కలిపి పిండి మరీ జారుగా లేదా మరీ గట్టిగా లేకుండా కలుపుకోవాలి.గారెల్లా తట్టడానికి సరిపడేలా ఉండాలి.1 tsp వంట సోడా కూడా తప్పని సరిగా వేయాలి.అప్పుడే గారెలు చక్కగా పొంగి లోపల గుల్లగా బయట కరకరలాడుతూ ఉంటాయి.
నా ఈ వంటకం youtube లో చాలా పాపులర్ అయింది.గారెల పిండి ఎలా ఉండాలో కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళు ఈ recipe ని తయారు చేసి చాలా బాగుందని నాకు కామెంట్స్ పెడుతుంటారు.కానీ అవగాహన లేని కొద్ది మంది మాత్రం గట్టిగా వచ్చాయి అని రాశారు.అలా కాకుండా ఉండాలంటే పిండిని కొద్దిగా జారుగా కలుపుకుంటే సరిపోతుంది.అప్పుడు చాలా చక్కగా వస్తాయి.ఉహించని అతిధులు వచ్చినప్పుడు ఏమి చేసి పెట్టాలా అని తడబడకుండా వారితో కబుర్లు చెప్తూనే వీటిని తయారు చేసి వారిని surprise చేయవచ్చు.మీరు కూడా ఈ రుచికరమైన తేలికైన రవ్వ వడలను తయారు చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Ulli Karam Dosa Recipe in Telugu
Pancakes with bread Recipe in Telugu
Chinese Egg Noodles Recipe in Telugu
Click here for the English Version of this recipe.
- 1 కప్పు బొంబాయి రవ్వ
- ½ కప్పు ఉల్లిపాయ ముక్కలు
- ఉప్పు తగినంత
- ¼ tsp జీలకర్ర
- ½ tsp అల్లం తురుము
- ¼ కప్పు కొత్తిమీర తరుగు
- 1 tsp వంట సోడా
- ½ కప్పు పెరుగు
- నూనె డీప్ ఫ్రై కి సరిపడా
- ఉల్లిపాయ, పచ్చి మిరపకాయ, కొత్తిమీర, అల్లం లను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
- బొంబాయి రవ్వ ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
- తగినంత ఉప్పు, ¼ tsp జీలకర్ర, చిటికెడు వంట సోడా వేయాలి.
- ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, అల్లం తరుగు, పెరుగు కూడా వేసి బాగా కలపాలి.
- ఓకే 15 నుండి 20 నిమిషాలు ఆగితే రవ్వ పెరుగులో ఉన్న తడిని పీల్చుకుని కొద్దిగా గట్టి పడుతుంది.
- అప్పుడు కొద్దిగా నీళ్ళు పోసి పిండి మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా గారెల పిండిలా ఉండేలా కలుపుకోవాలి.
- డీప్ ఫ్రయింగ్
- కడాయి లో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగనివ్వాలి.
- నూనె వేడెక్కగానే, నిమ్మ కాయ పరిమాణంలో పిండిని తీసుకొని గారెల్లా తట్టి నూనెలో విడిచి పెట్టాలి.
- చక్కని బంగారు వర్ణంలో కి మారే వరకు రెండు వైపులా తిప్పుతూ వేయించి పేపర్ నాప్కిన్ లోకి తీసుకోవాలి.
Instant Rava Vada Telugu Recipe Video
[embedyt] http://www.youtube.com/watch?v=GU73qfdsUsI[/embedyt]
Leave a Reply