Site icon Maatamanti

Kothimeera Kodi Pulao Telugu Recipe Restaurant Style

kothimeera kodi pulao telugu recipe

Kothimeera Kodi Pulao Telugu Recipe with step by step instructions.English Version.

నేను ఇంతకు ముందు పోస్ట్ చేసిన పండుమిర్చి చికెన్ ఫ్రై చేసిన రోజే ఈ కొత్తిమీర కోడి పలావ్ కూడా తయారు చేశాను.ఆ రెండింటి కాంబినేషన్ సూపర్ గా ఉంది.ఈ కాంబినేషన్  ఎక్కువగా రెస్టారెంట్ మెనూ లలో కనిపిస్తుంటూ ఉంటుంది.నేనయితే ఎప్పుడూ ఈ recipes ని బయట టేస్ట్ చేయలేదు.కానీ మెనూ లో చూసినప్పుడల్లా ఎలాగయినా ట్రై చేయాలి అనుకునేదాన్ని.

అందుకే ఈ సారి రెండూ ఒకేసారి ట్రై చేశాను.చాలా బాగా కుదిరాయి.ఈ రెండు recipes నాకు నెట్ లో ఎక్కడా దొరకలేదు.అందుకే నేనే ఇలా చేస్తే బాగుంటుంది అని రాసుకొని తయారు చేశాను.పొద్దున్న షూటింగ్ అయిపోయాక కొద్దిగా టేస్ట్ చేశాను.కనీసం తినడానికి కూడా ఓపిక లేక ఎక్కువ తిన లేదు జస్ట్ కొద్దిగా టేస్ట్ చేశాను అంతే.కానీ సాయంత్రం మాత్రం ఫుల్ గా లాగించేశాను.ఎందుకో గానీ మార్నింగ్ కన్నా నైట్ కి టేస్ట్ ఇంకా enhance అయినట్లు అనిపించింది అచ్చు చేపల కూరలా.చేపల కూర కూడా అంతే కదా వండిన వెంటనే కన్నా రెండో పూట కి ఇంకా టేస్ట్ గా ఉంటుంది.ఈ recipe ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.ఒకవేళ నచ్చితే మీ friends కి కూడా షేర్ చేయండి.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Bongulo Chicken Biryani Recipe in Telugu
Pressure Cooker Chicken Biryani Recipe in Telugu
Chicken Biryani Recipe in Telugu
Ulavacharu Chicken Biryani Recipe in Telugu
Mutton Biryani Recipe in Telugu
Fish Biryani Recipe in Telugu
Hyderabadi Prawns Biryani Recipe in Telugu

Click here for the English Version of this Recipe.

మరిన్ని తెలుగు recipe videos కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Kothimeera Kodi Pulao Telugu Recipe
Prep Time
30 mins
Cook Time
40 mins
Total Time
1 hr 10 mins
 
Course: Main Course
Cuisine: Andhra, Hyderabadi, Telangana
Author: బిందు
Ingredients
నానబెట్టుటకు
  • 2 కప్పులు బాస్మతి బియ్యం(1 కప్పు=120 గ్రాములు)
  • తగినంత నీళ్ళు
గ్రైన్డింగ్ కొరకు
  • 50 గ్రాములు కొత్తిమీర
  • 2 పచ్చిమిరపకాయలు
  • ¼ కప్పు నీళ్ళు
పలావు కొరకు
  • 300 గ్రాములు చికెన్
  • 2 మీడియం ఉల్లిపాయలు నిలువుగా తరిగినవి
  • 2 పచ్చిమిరపకాయలు
  • 1 tbsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 1 tsp ధనియాల పొడి
  • ½ tsp గరం మసాలా
  • 2 tsp నెయ్యి
  • 4 లేదా 5 tbsp నూనె
  • 1 బిర్యానీ ఆకు
  • 2 దాల్చిన చెక్కలు అరంగుళం ముక్కలు
  • 2 మరాఠీ మొగ్గలు
  • 1 జాపత్రి
  • 5 ఏలకులు
  • 4 లవంగాలు
  • 1/8 ముక్క జాజికాయ
  • 1 అనాస పువ్వు
  • 3 ½ కప్పులు నీళ్ళు(బియ్యం తీసుకున్న కప్పుతో)
  • ¼ కప్పు పుదీనా ఆకులు
Instructions
నానబెట్టుట
  1. బాస్మతి బియ్యంలో నీళ్ళు పోసి ఒక అరగంట పాటు నానబెట్టాలి.
  2. వండే ముందు 2 నుండి 3 సార్లు కడగాలి.
గ్రైండ్ చేయుట
  1. కొత్తిమీరను శుభ్రంగా కడిగి పచ్చి మిరపకాయలతో పాటు కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
పలావు తయారీ
  1. గిన్నెలో నెయ్యి మరియు నూనె వేసి వేడి చేయాలి.
  2. తర్వాత గరం మసాలా దినుసులు అన్ని వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
  3. ఉల్లిపాయ, పచ్చి మిరపకాయ ముక్కలు, ఉప్పు వేసి మెత్తబడే వరకు వేయించాలి.
  4. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
  5. చికెన్ ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ముప్పావు వంతు ఉడికే వరకు ఉంచాలి.
  6. తర్వాత కొత్తిమీర పచ్చి మిర్చి పేస్ట్ వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి.
  7. 3 ½ కప్పులు(బియ్యం తీసుకున్న కప్పుతోనే) నీళ్ళు పోసి మరిగే వరకు ఉడికించాలి.
  8. నీరు మరగడం మొదలవగానే నానబెట్టుకున్న బియ్యం వేసి మళ్ళీ ఒక ఉడుకు వచ్చే వరకు ఉంచాలి.
  9. అన్నం ఉడకడం మొదలవగానే స్టవ్ సిమ్ లోకి తిప్పి మూత పెట్టి పూర్తిగా ఉడికే వరకు ఉంచి తర్వాత స్టవ్ కట్టేయాలి.

Kothimeera Kodi Pulao Telugu Recipe Video

 

Exit mobile version