Leftover Bread Pancake Telugu Recipe with step by step instructions.English Version.
ఎందుకో తెలీదు గానీ బ్రెడ్ కొన్న ప్రతీ సారి చివరి 3 లేదా 4 స్లైసులు మిగిలిపోతాయి.తప్పని తెలిసినా వాటిని అలా పారేయాల్సి వస్తుంది.ఇసారి ఎట్టి పరిస్థుతులలో వేస్ట్ చేయకూడదు అనుకుంటూనే మళ్ళీ పారేస్తాను.మా ఆయనేమో తిడుతుంటారు.”అన్ని కొనడం జాగ్రత్తగా కుళ్లిపోయే వరకు ఉంచి మరీ పారేయడం.ఇదేగా నీ పని” అని అంటుంటారు.
ఈసారి ఎలా అయినా సరే బ్రెడ్ ను వేస్ట్ చేయకూడదని ఫిక్స్ అయిపోయి ఇలా పాన్ కేక్ లా చేయడం మొదలు పెట్టాను.నిజంగా సూపర్ టేస్ట్ తో ఉన్నాయి ఈ బ్రెడ్ పాన్ కేక్స్.సరిగ్గా 10 నుండి 15 నిమిషాలలో త్వరగా తేలికగా తయారు చేసుకోవచ్చు.ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.చేయగానే పైన తేనె గానీ చాకొలేట్ సిరప్ కానీ వేసి వేడిగా సర్వ్ చేయాలి.మీరు కూడా మిగిలిపోయిన బ్రెడ్ ని ఈ సారి నుండి వేస్ట్ చేయకుండా ఇలా పాన్ కేక్స్ తయారు చేసి ఆ రుచిని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను :).
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Dry Fruit Bobbatlu Recipe in Telugu
Saggubiyyam Payasam Recipe in Telugu
Onion Murukulu Recipe in Telugu
Bounty Chocolates Recipe in Telugu
Strawberry Rava Laddu Recipe in Telugu
Parle-G Biscuit Cake Recipe in Telugu
Bread Pizza Recipe in Telugu
Click here for the English Version of this Recipe.
- 3 to 4 బ్రెడ్ స్లైస్ లు
- 2 గుడ్లు
- 200 ml పాలు
- 4 లేదా 5 tbsp పంచదార
- 20 గ్రాములు వెన్న
- ¼ ఏలకుల పొడి
- చిటికెడు మిరియాల పొడి
-
బ్రెడ్ స్లైస్ లను చిన్న చిన్న ముక్కలుగా చేసి తర్వాత మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
-
ఒక గిన్నెలో గుడ్లు పగులకొట్టి 2 నిమిషాలు గిలకొట్టాలి.
-
చిటికెడు మిరియాల పొడి, ఏలకుల పొడి, పంచదార వేసి బాగా కలపాలి.
-
బ్రెడ్ పొడి కూడా వేసి మళ్ళీ కలపాలి.
-
కొద్ది కొద్దిగా పాలు పోస్తూ పిండి జారుగా అయ్యేట్టుగా కలుపుకోవాలి.
-
పెనం వేడి చేసి కొద్దిగా వెన్న కరిగించి పాన్ కేక్ పిండిని 2 నుండి 3 స్పూన్ లు వేసి గుండ్రగా తిప్పాలి.
-
మూత పెట్టి రెండు వైపులా బంగారు వర్ణం లోకి మారే వరకు వేయించి వేడిగా సర్వ్ చేయాలి.
Leftover bread pancake Telugu recipe Video
[embedyt] https://www.youtube.com/watch?v=RPC7ai8DCRk[/embedyt]