Maatamanti

Maramarala Mixture Telugu Recipe-Easy evening snack

Maramarala Mixture Telugu Recipe with step by step instructions.English Version.

ముంత మసాలా అంటే తెలీని వారుండరు.పార్కుకు గాని మరేదైనా పబ్లిక్ ప్లేసెస్ కి గాని షికారుకు వెళ్ళినప్పుడు ఇది అమ్మేవాళ్ళని ఎక్కువగా చూస్తుంటాము.మరమరాలతో చేసే ఈ ముంత మసాలా అంటే ఇష్టపడని వారుండరు.పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ శుభ్రంగా లాగించేస్తారు.ఎందుకంటే ఇది తేలికగా జీర్ణం అయిపోతుంది.తిన్నా పెద్ద హెవీ గా అనిపించదు.పైగా దీనిలో ఉండే పదార్ధాలన్నీ ఆరోగ్యకరమైనవే.

ఈ రెసిపీ ని వేరు వేరు ప్రాంతాలలో కొద్ది మార్పులతో వేర్వేరు విధానాలలో తయారు చేస్తారు.నార్త్ సైడ్ ఇందులో గ్రీన్ చట్నీ ఇంకా మీఠా వేసి, కాస్త ఉడికించిన బంగాళాదుంపలు, కొద్దిగా పాపిడీ, పెరుగు వేసి ఇస్తారు.దీనినే వాళ్ళు భేల్ అంటారు.మన దగ్గర హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు ప్రాంతాలలో అయితే సుమారుగా నేను చేసిన పద్ధతిలో చేస్తారు.అక్కడ అమ్మేవారయితే కొద్దిగా వేయించిన కార్న్ ఫ్లేక్స్ ఇంకా అటుకులు కూడా వేస్తారు.ఇంకొన్ని ప్రాంతాల్లో మిర్చి బజ్జీలను చిన్న ముక్కలుగా కట్ చేసి దీనిలో కలిపేస్తారు.అది కూడా చాలా బాగుంటుంది.

ఆంధ్రా లో  దీనిని పిడత కింద పప్పు లేదా ముంత మసాలా అని కూడా పిలుస్తుంటారు.ఆంధ్రా సైడ్ అయితే వేయించిన నల్ల శెనగలు, బొబ్బర్లు, పుట్నాలు వంటి వి కూడా వేస్తారు.దీనిలో ఎటువంటి హాని కారకమైన పదార్ధాలు ఉండవు కాబట్టి ఎవరైనా తినవచ్చు.షుగర్, బీపీ లాంటివి ఉన్నవాళ్లు కూడా తినేయ వచ్చు.ఇంట్లో మరమరాలు రెడీ గా పెట్టుకుంటే పిల్లలు స్నాక్స్ కావాలని మారాం చేయగానే టక్కుమని 5 నిమిషాలలో చేసి ఇచ్చేయవచ్చు.అసలే వేసవి వచ్చిందంటే చాలు ఎప్పుడుపడితే అప్పుడు ఆకలి అంటుంటారు.అది నిజం ఆకలి కాదు టైం పాస్ ఆకలి :).

ఇదే రెసిపీ ని ఇంకాస్త హెల్తీ గా చేసుకోవాలంటే కొద్దిగా కీరా ముక్కలు, క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు.మీరు ఈ రెసిపీ ని తయారు చేసిన వెంటనే సర్వ్ చేస్తే మంచిది.లేకపోతే మరమరాలు మెత్తగా అయిపోతాయి.సో ఈ టేస్టీ రెసిపీ ని మీరు కూడా తయారు చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

White Sauce Pasta Recipe in Telugu
Tomato Soup Recipe in Telugu
Malai Paneer Tikka Recipe in Telugu
Ullikaram Dosa Recipe in Telugu
Saggubiyyam Payasam Recipe in Telugu
Veg Manchurian Recipe in Telugu
Palli Karam Dosa Recipe in Telugu

Click here for the English Version of this Recipe

Maramaralu Mixture Telugu Recipe
Prep Time
10 mins
Total Time
10 mins
 
Course: Snack
Cuisine: Andhra, Hyderabadi, Indian
Servings: 4
Author: బిందు
Ingredients
  • 2 నుండి ౩ కప్పులు మరమరాలు/బొరుగులు
  • 1 మీడియం ఉల్లిపాయ సన్నగా తరిగినది
  • 1 పచ్చిమిరపకాయ సన్నగా తరిగినది
  • 1 మీడియం టమాటో లోపల గింజలు తీసినది
  • ¼ కప్పు కొత్తిమీర
  • 1 tsp కారం
  • ఉప్పు తగినంత
  • 1/౩ కప్పు పల్లీలు వేయించి పొట్టు తీసినవి
  • 1/౩ కప్పు సన్న కారపూస/బారిక్ సేవ్
  • 1 tsp చాట్ మసాలా
  • 1 నిమ్మకాయ
Instructions
  1. ఒక మిక్సింగ్ బౌల్ లో మరమరాలు వేసుకోవాలి.
  2. అందులో ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, కారం, ఉప్పు, చాట్ మసాలా, వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, సన్న కారప్పూస, గింజలు తీసేసిన టమాటో ముక్కలు, నిమ్మ రసం అన్నీ వేసి బాగా కలపాలి.
  3. తర్వాత కొద్దిగా కొద్దిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైన కొద్దిగా సేవ్, ఇంకా పల్లీలు వేసి సర్వ్ చేయాలి.

Maramarala Mixture Telugu Recipe Video

[embedyt]https://youtu.be/watch?v=RNWFTCMKEjM[/embedyt]

 

Related Post

Please Share this post if you like