Masala Vadalu Recipe with step by step instructions in Telugu.English Version.
మసాలా వడలు చాలా తేలికగా చేసుకోదగ్గ ఎంతో రుచికరమైన ఈవెనింగ్ స్నాక్ ఐటమ్.ఎవరైనా గెస్ట్ లు వస్తున్నప్పుడు ఉదయాన్నే పప్పు నానబెట్టేసుకుంటే, అప్పటికప్పుడు పిండి రుబ్బి అరగంటలో ఎంచక్కా మసాలా వడలు చేసి పెట్టవచ్చు.పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.కానీ రుచిగా ఉన్నాయి కదా అని 3 లేదా 4 వడల కన్నా ఎక్కువ తింటే గాస్ట్రిక్ ట్రబుల్ తో ఇబ్బంది పడే అవకాశముంది.అందుకని మితంగా తింటేనే మంచిది.
మసాలా వడలు నూనె పీల్చకుండా చక్కగా రావాలంటే పిండిని సరిగ్గా తయారు చేయాలి.పిండిని నీళ్ళు పోయకుండా రుబ్బుకోవాలి.ముందుగానే నానబెట్టి ఉంచడం వల్ల అవి సులువుగానే నలుగుతాయి.అయితే రుబ్బే ముందు పప్పు సరిగ్గా నానిందో లేదో చూసుకోవాలి.ఒక నానిన పప్పు తీసుకొని అందులోకి గోరుని దించినప్పుడు అది తేలికగా దిగితే పప్పు సరిగ్గా నానినట్లు అర్ధం.ఎందుకంటే పప్పు మిక్సీలో తేలికగా నలగాలంటే వాటిలో తగినంత తేమ ఉండాలి.ఆ పప్పులో ఉన్న తేమతోనే పిండి రుబ్బాలి.మళ్ళీ నీళ్ళు పోయకూడదు.అలా చేయడం వల్ల పిండి జారుగా అయిపోయి వడలు నూనె ఎక్కువగా పీలుస్తాయి లేదా నూనెలో వేయగానే పిండి ముక్కలుగా విడిపోతుంది.
వీటిని టమాటో సాస్ తో గానీ కారం పొడితో గానీ తింటే బాగుంటుంది.నంజు లేకుండా ఉట్టిగా గా కూడా చాలా రుచిగా ఉంటాయి.చిన్నప్పుడు ఈ వడలను బజ్జీల బండి దగ్గర ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లి కొనుక్కుని తినేవాళ్ళం.ఎంతో రుచికరమైన ఈ మసాలా వడలను మీరు కూడా తయారు చేస్తారని ఆశిస్తున్నాను.
you may also like
Saggubiyyam Punugulu Recipe in Telugu
Onion Murukulu Recipe in Telugu
Bounty Chocolate Recipe in Telugu
Parle-G Biscuit Cake Recipe in Telugu
Vegetable Cutlets Recipe in Telugu
Click Here for the English Version of the Recipe.
- 200 గ్రాములు పచ్చిశనగ పప్పు
- 1 litre నీళ్ళు
- 1 tsp సోంపు
- 1 tsp జీలకర్ర
- 1 అంగుళం దాల్చినచెక్క
- 2 ఎండుమిరపకాయలు
- 1 చిన్న ఉల్లిపాయ
- 1 రెమ్మ కరివేపాకు
- 2 పచ్చిమిరపకాయలు
- ½ tsp అల్లం తరుగు
- ¼ కొత్తిమీర తరుగు
- 3 రెమ్మలు పుదీనా
- 1 tsp ఉప్పు
- 5 tbsp నూనె
-
పచ్చిశనగ పప్పు ను 4 నుండి 5 గంటల పాటు నానబెట్టాలి.
-
తరువాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి.
-
సోంపు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, దాల్చినచెక్క లను మిక్సీలో పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
-
నానబెట్టిన పప్పును మిక్సీలో వేసి నీళ్ళు పోయకుండా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
-
ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, జీలకర్ర, ఉప్పు, వడ మసాలా, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి.
-
ఒక బాణలిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి వేడి చేయాలి.
-
కొద్దిగా నూనెను అరచేతికి రాసుకొని ఒక ప్లాస్టిక్ షీట్ మీద నిమ్మకాయ పరిమాణంలో పిండిని తీసుకొని గుండ్రంగా వడలా తట్టి నూనెలో జారవిడవాలి.
-
మరీ పెద్ద మంట మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీద ఉంచి వడలు చక్కని బంగారు వర్ణంలోకి మారే వరకు వేయించాలి.
-
వేయించిన వడలను పేపర్ టవల్ మీదకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి.ఇలాగే పిండి అంతా అయిపోయే వరకు వేయించుకోవాలి.
Masala Vadalu recipe in Video
[embedyt] https://www.youtube.com/watch?v=ZMD9l1qqyvw[/embedyt]