Site icon Maatamanti

Methi Paneer Telugu Recipe-మెంతికూర పనీర్ కర్రీ

methi paneer telugu recipe

Methi Paneer Telugu Recipe with step by step instructions.English Version.

ఈ కూర తయారు చేయడం చాలా సులువు.పేరుకు methi పనీర్ అని రాశాను కానీ ఇందులో పచ్చి బటాణి, క్రీమ్ కూడా వేసి వండాను.అందుకే ఈ కూరను మేతి మాటర్ పనీర్ మలయ్ కర్రీ అంటారు.ఈ recipe తక్కువ సమయంలో తయారు చేసేయవచ్చు.కాకపొతే వండే ముందు కసూరి మేతి, పనీర్ లను కాసేపు వేడి నీళ్ళల్లో నానబెట్టాలి.పనీర్ ను వండే ముందు కాసేపు వేడి నీళ్ళలో నానబెట్టడం వల్ల మృదువుగా తయారవుతాయి.కూరలో వేసాక మసాలాలన్నింటిని చక్కగా పీల్చుకుంటాయి.

కసూరి మేతిని కూడా వేడి నీళ్ళలో నానబెట్టడం వల్ల అందులో సహజంగా ఉండే చిరు చేదు పోయి కూరకి చక్కని రుచిని ఇస్తుంది.ఎండు మెంతి కూర బదులు తాజా మెంతి కూర కూడా వాడవచ్చు.తాజా మెంతి కూర వాడుతున్నట్లయితే ఒక 5 నిమిషాలు ఉప్పు వేసిన గోరు వెచ్చని నీళ్ళలో నానబెట్టి అప్పుడు కూరలో వేయాలి.తాజా మెంతి కూర దొరకనప్పుడు ఇలా కసూరి మేతి ఉపయోగించి ఈ కురను తయారు చేయవచ్చు.ఈ కూరను పూరి, చపాతీ, పుల్కా లేదా వెజ్ ఫ్రైడ్ రైస్ లతో తింటే చాలా రుచిగా ఉంటుంది.ఈ కూరని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Vegetable Sambar Recipe in Telugu
Garlic Paneer Recipe in Telugu
Chamagadda Pulusu Recipe in Telugu
Mushroom Aloo korma recipe in Telugu
Mulakkada Tomato curry Recipe in Telugu
Menti Kura Chicken Recipe in Telugu

Click here for the English version of this recipe.

Methi paneer Telugu Recipe
Prep Time
15 mins
Cook Time
20 mins
Total Time
35 mins
 
Course: Main Course
Cuisine: Indian
Servings: 4
Author: బిందు
Ingredients
  • 200 గ్రాములు పనీర్
  • ½ కప్పు లేదా 10 గ్రాములు కసూరి మేతి/ఎండిన మెంతికూర
  • 1/3 కప్పు లేదా 60 గగ్రాములు పచ్చి బటాణి
  • 2 మీడియం లేదా 100 గ్రాములు ఉల్లిపాయలు
  • 2 పచ్చిమిరపకాయలు
  • 150 గ్రాములు టమాటో గుజ్జు
  • 1 tbsp అల్లంవెల్లుల్లి ముద్ద
  • ¼ కప్పు పాలు
  • 1/3 కప్పు or 70 గ్రాములు క్రీమ్
  • ఉప్పు తగినంత
  • ½ tsp పసుపు
  • 1 tbsp కారం
  • 1 tbsp ధనియాల పొడి
  • 1 tsp గరం మసాలా
  • ½ tsp జీలకర్ర
  • 1 బిర్యానీ ఆకు
  • 3 ఏలకులు
  • 3 లవంగాలు
  • 1 అంగుళం దాల్చినచెక్క
  • 1 అనాస పువ్వు
  • 6 జీడిపప్పులు
  • 4 tbsp నూనె
  • 1 tbsp బటర్
  • ¼ కప్పు కొత్తిమీర తరుగు
Instructions
నానబెట్టుట
  1. పనీర్ ని క్యూబ్స్ లా కట్ చేసుకొని ఉప్పు కలిపిన వేడి నీళ్ళలో వేసి 15 నిమిషాల పాటు ఉంచి నీళ్ళు వడకట్టేయాలి.
  2. ఎండు మెంతికూరను కూడా ఉప్పు కలిపిన వేడి నీళ్ళలో 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచి నీరు వడ కట్టేయాలి.
కూర వండే విధానం
  1. ఒక బాణలిలో నూనె వేడి చేసి అందులో జీడిపప్పు వేసి దోరగా వేయించి తీసేసి పక్కన ఉంచుకోవాలి.
  2. అదే నూనెలో ఒక బిర్యానీ ఆకు, ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క, అనాస పువ్వు, జీలకర్ర వేసి ఒక నిమిషం వేయించాలి.
  3. ఉల్లిపాయ తరుగు, పచ్చి మిర్చి, ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి.
  4. అల్లంవెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
  5. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, వేసి బాగా కలపాలి.
  6. టమాటో గుజ్జు, పచ్చి బటాణి వేసి కలిపి నూనె అంచులకు ఊరేవరకు ఉడికించాలి.
  7. పనీర్ ముక్కలను వేసి ఒక సారి బాగా కలిపి, పైన సగం గరం మసాలా చల్లి మూత పెట్టి 3 నుండి 5 నిమిషాల పాటు ఉడికించాలి.
  8. మూత తెరిచి పాలు, క్రీమ్, కొద్దిగా నీళ్ళు పోసి కలిపి మిగిలిన గరం మసాలా, కసూరి మేతి కూడా వేయాలి.
  9. ఒక సారి కలిపి గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించాలి.
  10. చివరిగా బటర్, జీడిపప్పు, కొత్తిమీర వేసి పొయ్యి కట్టేయాలి.

Methi Paneer Telugu Recipe Video

[embedyt] https://www.youtube.com/watch?v=uCmz1kR7ggU[/embedyt]

Exit mobile version