Mushroom Aloo Korma recipe with step by step instructions.English Version.
నాకు 7 ఏళ్ల వయసప్పుడు మేము ఓడిశా లోని జైపూర్ దగ్గరలో ఉన్న భరణిపుట్ అనే ఊర్లో ఉండేవారము.చిక్కని అడవి, పెద్ద కొండ, ఆ కొండ మీద ఒక రోడ్డు, రోడ్డుకి ఎడమ వైపు పెద్ద లోయ.ఆ లోయలో ఒక అందమైన కాలనీ ఉండేది.మేము అక్కడే ఉండేవాళ్ళం.అక్కడ వర్షాకాలంలో పుట్టగొడుగులు చెట్ల మొదళ్ళలో, మట్టి దిబ్బల మీద విపరీతంగా మొలిచేవి.రెండు మూడు రోజులకోసారి మా అమ్మ ఈ కూర వండేవారు.కానీ అన్ని పుట్టగొడుగులు మంచివి కావు.కొన్ని విషపూరితమైనవి కుడా ఉంటాయి.
అప్పుడు మా ఇంటి వెనుక ఒక గిరిజన కుటుంబం ఉండేది.గురు ఆ ఇంటికి పెద్ద.అతను కోసి ఇచ్చిన పుట్టగొడుగులనే వండేవారు.లేకపోతే ప్రతివారం జైపూర్ వెళ్లినపుడల్లా అక్కడ సంతలో కొనుక్కునేవాళ్ళం.కుప్ప ఒక రూపాయికి అమ్మేవారు.అన్నీ విచ్చుకున్న పుట్టగొడుగులే ఉండేవి.ఓడిషా నుండి వచ్చేసాక చాలా రోజుల వరకు ఆ కూర తినలేదు.కానీ వర్షాకాలంలో విజయవాడ బీసెంట్ రోడ్డులో నాటు పుట్టగొడుగులని అమ్మేవారు.అప్పుడు మాత్రం కొనుక్కు తినేవాళ్ళం.
ఇప్పుడయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ని సూపర్ మార్కెట్లలో అన్ని కాలాల్లో విరివిగా దొరుకుతున్నాయి.బటన్ మష్రూమ్స్, మిల్కీ మష్రూమ్స్ అని వివిధ రకాలు దొరుకుతున్నాయి.కానీ ఎంతయినా నాటు పుట్టగొడుగులలో ఉన్న రుచి వీటిలో ఉన్నట్లుగా అనిపించదు.ఏది ఏమైనా పుట్టగొడుగులలో చాలా పోషక విలువలు ఉన్నాయి కాబట్టి, కనీసం వారంలో ఒకసారైనా మనం తీసుకునే ఆహారంలో వీటిని ఉండేలా చూసుకోవడం మంచిది.
ఈ కూర పలావుతో గానీ, అన్నంతో గానీ, చపాతీలతో గానీ కలిపి తింటే చాలా బాగుంటుంది.ఈ కూరలో పెరుగు వేసే ముందు బాగా గిలకొట్టి వేస్తే పెరుగు కూరలో వేయగానే విరిగినట్లుగా అవ్వదు.ఎంతో రుచికరమైన ఈ పుట్టగొడుగుల కూరని మీరు కూడా ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే కొన్ని వంటలు
సులువుగా బంగాళదుంప వేపుడు చేయడం ఎలా?
వెజిటెబుల్ కట్లెట్ తయారు చేయడం ఎలా?
హైదరాబాదీ ప్రాన్స్ బిరియాని తయారీ విధానం
పెప్పర్ చికెన్ డ్రై రెసిపి
గోంగూర చికెన్ తయారు చేయడం ఎలా?
Click Here for the English Version of this Recipe
- 200 గ్రాములు పుట్టగొడుగులు
- 2 బంగాళాదుంపలు
- 2 ఉల్లిపాయలు సన్నగా నిలువుగా తరిగినవి
- 3 పచ్చిమిరపకాయలు
- 1 టమాటో
- 1 tbsp అల్లం వెల్లుల్లి పేస్ట్
- ½ కప్పు పెరుగు
- 1 ½ tsp కారం
- 1 tsp గరం మసాలా
- 4 tbsp నూనె
- ¼ కప్పు పుదీనా ఆకులు
- ¼ కొత్తిమీర
- పుట్టగొడుగుల్ని శుభ్రంగా కడిగి నాలుగు ముక్కలుగా కట్ చేయాలి.
- బంగాళాదుంపల్ని, ఉల్లిపాయల్ని కూడా తరిగి పెట్టుకోవాలి.
- ఒక బాణలిలో నూనె వేడి చేసి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి అవి మేతతబడే వరకు వేయించాలి.
- తర్వాత బంగాళదుంప ముక్కలు, పుట్టగొడుగులను కుడా వేసి ఒక సారి కలిపి మూత పెట్టి అయిదు నిమిషాల పాటు ఉడికించాలి.
- మూత తెరచి అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం వేసి కలుపుకోవాలి.
- ఒక రెమ్మ పుదినా ఆకులు, టమాటో ముక్కలు వేసి ఇంకో అయిదు నిమిషాలు ఉడికించాలి.
- బాగా గిలకొట్టిన పెరుగు, గరం మసాలా వేసి కలిపి నూనె తేలేవరకు ఉడికించి, కొత్తిమీర వేసి స్టౌ ఆపుచేయాలి.
Leave a Reply